రైతులపై రోల్ రైడా ర్యాప్.. వామ్మో అంటోన్న నెటిజన్లు.. శ్రీదేవీ డ్రామా కంపెనీలో హైలెట్స్ ఇవే
బుల్లితెరపై చానెల్స్ మధ్య పోటీ పీక్స్‌లో ఉంది. ఒకరు ప్రోమోలు రిలీజ్ చేశారంటే.. అవతలి వాళ్లు కూడా కాస్త అటూ ఇటూగా ఓ ప్రోమోను బయటకు వదులుతున్నారు. ఇప్పుడు ఈటీవీ, స్టార్ మా చానెల్స్‌లో నేరుగా పోటీ కనిపిస్తోంది. ప్రతీ ఆదివారం మధ్యాహ్నాం 1 30 గంటకు కొత్త షోలను ప్రారంభించబోతోన్నాయి. శ్రీదేవీ డ్రామ కంపెనీ అంటూ ఒకరు.. కామెడీ స్టార్స్ అంటూ మరొకరు రచ్చ చేస్తున్నారు. ప్రోమోల మీద ప్రోమోలతో దంచి కొడుతున్నారు.

పోటాపోటీగా..
శ్రీదేవీ డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ అనే రెండు షోలు ఇప్పుడు పోటాపోటీగా వస్తున్నాయి. ప్రోమోలు విడుదల చేయడం నుంచి ప్రతీ ఒక్క విషయంలోనూ పోటీ పడుతున్నారు. అయితే ఇందులో మొదటగా శ్రీదేవీ డ్రామా కంపెనీయే ప్రోమోలను వదిలింది.

కామెడీ స్టార్స్ అలా..
బిగ్ బాస్ షో ముగిశాక స్టార్ మా ఓ స్పెషల్ షోను ప్లాన్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అవినాష్‌ను ముందు పెట్టి ఓ స్పెషల్ షోను ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య టాక్ బయటకు వచ్చింది. దానికి తగ్గట్టు అవినాష్ ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లను కూడా తీసుకొచ్చి మంచి ప్లానే వేశారు.

తాజాగా ప్రోమో..
ఐదారు గంటల క్రితం కామెడీ స్టార్స్ ప్రోమో వచ్చింది. దానికి ధీటుగా శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి ఓప్రోమో వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు బాగానే వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెండు అంశాలు హైలెట్ అవుతున్నాయి.

రోల్ రైడా ర్యాప్..
బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా ర్యాప్ అంటే అందరికీ ఎన్నో రకాలు మీమ్స్, ట్రోల్స్ గుర్తుకు వచ్చి ఉంటాయి. అచ్చం ఇప్పుడు కూడా అలానే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. రైతుల మీద తాజాగా రోల్ చేసిన ర్యాప్ ట్రోలింగ్‌కు గురవుతోంది. ప్రతీసారి ఇలా ఎందుకు రైతులను వాడుకుంటారంటూ కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video

రికార్డింగ్ డ్యాన్స్..
పాలకొల్లు నుంచి వచ్చిన రికార్డింగ్ డ్యాన్సర్ చాందిని వేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. అంతే కాకుండా చివర్లో చెప్పిన మాటలు అందరినీ టచ్ చేశాయి. మాటలను అనుకరిస్తే మిమిక్రీ అంటున్నారు.. అదే డ్యాన్స్ అనుకరిస్తూ స్టేజ్ మీద డ్యాన్స్‌లు చేస్తే చిన్న చూపు చూస్తున్నారంటూ అందరినీ ఆలోచించేలా చేశారు.


Click it and Unblock the Notifications











