బూతు కంటెంట్‌తో బోర్ కొట్టిస్తున్న బిగ్ బాస్.. వాళ్లకు రెండు రోజులు నరకయాతన

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే, గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో బూతు కంటెంట్ ఎక్కువవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ షోను ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇలాంటి టాక్ రావడానికి కారణాలు ఏంటి?

వరుణ్ - వితికలతో రొమాన్స్ మొదలు

వరుణ్ - వితికలతో రొమాన్స్ మొదలు

హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించాయి. బాత్ టబ్‌లో రొమాన్స్, దుప్పట్లో దూరిపోవడం వంటి వాటితో ఈ జంట మరింత హైలైట్ అయింది.

రాహుల్ - పునర్నవి రెచ్చిపోయారు

రాహుల్ - పునర్నవి రెచ్చిపోయారు

ఇక ఇదే హౌస్‌లోని రాహుల్ సింప్లీగంజ్, పునర్నవి కూడా రొమాన్స్‌ను పండిస్తున్నారు. డేటింగ్ సంభాషణలో వీళ్ల మధ్య ఏదో ఉందన్న టాక్ వినిపించింది. ఆ తర్వాత నాగార్జున కూడా వీళ్ల బంధం గురించి ప్రస్తావించడంతో అది పెరిగిపోయింది. ఆ తర్వాత పునర్నవి లవ్ ట్రాక్‌కు బలం చేకూర్చే విధంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అనడంతో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

ఈ వారం మరింత హాట్‌గా...

ఈ వారం మరింత హాట్‌గా...

లగ్జరీ బడ్జెట్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకునేందుకు ఈ వారం బిగ్ బాస్ ఇచ్చే వీక్లీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీని ప్రకారం.. హౌస్‌లోని కొందరు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్ సెట్టింగ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో కొందరు కంటెస్టెంట్లకు బాస్ కొన్ని పాత్రలను కేటాయించాడు. అలాగే, రొమాన్స్ కూడా చేయాల్సిన అవసరాన్ని కల్పించాడు. దీంతో హౌస్‌మేట్స్ రెచ్చిపోయారు.

 పునర్నవి - రవి కృష్ణ హనీమూన్ కపుల్

పునర్నవి - రవి కృష్ణ హనీమూన్ కపుల్

ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి - రవిని హానీమూన్ కపుల్స్ చేశాడు బిగ్ బాస్. వీళ్లిద్దరూ హనీమూన్ కోసం ట్రైన్‌లో ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఈ కొత్త జంట రెచ్చిపోయి నటించింది. తరచూ ఒకరినొకరు హత్తుకుని ఉండడం, ఒకరిపై ఒకరు పడిపోతుండడం వంటి వాటితో ప్రేక్షకులకు చిరాకు పుట్టించారు. మరీ ఈ రేంజ్‌లో రొమాన్స్ చేయడం చూసి చాలా మంది విస్తుపోయారు. దీంతో ఈ జంట హాట్ టాపిక్ అయింది.

అలీ రేజా - శ్రీముఖి కూడా...

అలీ రేజా - శ్రీముఖి కూడా...

ఇదే టాస్క్‌లో అలీ రేజా, శ్రీముఖి కూడా ప్రేమను వెతుక్కునే అమ్మాయి, అబ్బాయిగా నటించారు. వీళ్లు కూడా టాస్క్‌లో భాగంగా రొమాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రేమను దక్కించుకునే క్రమంలో వీళ్లిద్దరూ చేసిన ఫీట్స్ కూడా చిరాకు తెప్పించాయి. దీంతో ఈ టాస్క్ జరిగిన విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి.

బూతు కంటెంట్‌తో బోర్

బూతు కంటెంట్‌తో బోర్

దాదాపు రెండు రోజుల పాటు సాగిన వీక్లీ టాస్క్ బోర్ కొట్టించింది. ఈ రెండు రోజులు బిగ్ బాస్ వీక్షకులు నరకయాతన అనుభవించారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో గతంలో మాదిరిగా ఈ సారి టాస్క్‌లు ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త టాస్కులు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X