For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ సుమ ముందే నోట్లో నోరు పెట్టుకొని షాక్ ఇచ్చారుగా.. టీవీ షోలో రొమాంటిక్ సీన్

  |

  బుల్లితెరపై కూడా ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ రొమాంటిక్ సీన్స్ హద్దులు దాటేస్తున్నాయి. ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చూస్తుంటే భవిష్యత్తులో సెన్సార్ వర్క్ టీవీల్లోనే ఎక్కువగా అవసరం పడేలా ఉంది. టిఆర్పీ కోసం కొందరు కంటెంట్ డోస్ గట్టిగానే పెంచేస్తుండడం అప్పుడప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. శృతిమించకుండా ఉంటే ఏదైనా అందంగానే ఉంటుంది. ఇక రీసెంట్ గా సుమ షోలో అలాంటి సీన్స్ దర్శనమివ్వడం వైరల్ గా మారింది.

  చాలా ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వస్తోంది

  చాలా ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వస్తోంది

  యాంకర్ సుమ ఎలాంటి షో చేసినా కూడా కుటుంబసమేతంగా చూసే వాతావరణంలోనే ఫన్ క్రియేట్ చేస్తుంటారని చెప్పవచ్చు. స్టార్ మహిళతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సుమ ఒక ప్రోగ్రామ్ మొదలుపెడితే రెండు మూడేళ్లయినా సందడి చేయాల్సిందే. ఆమె ఖాళీగా ఉండడం లేదు కాబట్టి చాలా ఆఫర్లను రిజెక్ట్ చేయాల్సి వస్తోంది.

  ఓవరాక్షన్ చేయకుండా

  ఓవరాక్షన్ చేయకుండా

  మిగతా యాంకర్స్ మాదిరిగా ఓవరాక్షన్ చేయకుండా సింపుల్ గా తన మాటలతో ఎట్రాక్ట్ చేయగల సత్తా సుమకు ఉంది. టెలివిజన్ ప్రోగ్రామ్ అయినా సరే సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ అయినా సరే ఆమె తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటారు. సుమ సినిమా ఈవెంట్స్ లలో ఉంటే దర్శకనిర్మాతలకు అదొక ధైర్యం.

  భారీ రేటింగ్స్..

  భారీ రేటింగ్స్..

  ఇక సుమ టెలివిజన్ ప్రోగ్రాంలలో ఎక్కువగా క్రేజ్ అందుకున్న వాటిలో క్యాష్ షో ఒకటి. జబర్దస్త్ తరువాత ఈటీవీ ఛానెల్ ఆ షోతోనే భారీ రేటింగ్స్ అందుకుంటోంది. ఆ షోకు సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పుడు కూడా అంతగా డోస్ పెంచని క్యాష్ షోలో ఈసారి ఒక జంట చేసిన హడావుడికి అందరూ ఆశ్చర్యపోయారు.

  క్యాష్ కొత్త ప్రోమో వైరల్

  క్యాష్ కొత్త ప్రోమో వైరల్

  నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రసారం కాబోయే ఆ షో కోసం సీరియల్స్ జంటలు కంటెస్టెంట్స్ గా వచ్చారు. రియల్ జంట, రీల్ జంటతో మొదలయ్యే క్యాష్ లో ఈసారి రియల్ కపుల్స్ గా దేవత ఫేమ్ అర్జున్ అలాగే అతని భార్య సురేఖ ఎంట్రీ ఇచ్చారు. ఇక రీల్ జంటగా నవ్యస్వామి, రవికృష్ణ వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో యూ ట్యూబ్ లో వైరల్ అవుతోంది.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  నోట్లో పెట్టేసుకొని లాగేసుకున్నారు

  నోట్లో పెట్టేసుకొని లాగేసుకున్నారు

  ఈ నలుగురితో క్యాష్ షోను చాలా సరదాగా లవ్లీగా కొనసాగించారు. అయితే చివరలో అర్జున్, సురేఖ ఒక్కసారిగా రొమాన్స్ తో షాక్ ఇచ్చారు. కొంతవరకు అది బాగానే ఉన్నప్పటికీ చివరలో మాత్రం సురేఖ గులాబీ పువ్వును నోటితో పట్టుకోగా దాన్ని అర్జున్ తన నోటితో లాగేసుకున్నాడు. ఇద్దరు అలా ఆల్ మోస్ట్ లిప్ లాక్ ఇచ్చినట్లు స్టిల్స్ ఇవ్వడంతో సుమ కూడా ఆశ్చర్యపోయారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సుమ షోలో కూడా ఇలాంటి సీన్స్ వస్తున్నాయేంటి అని నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

  English summary
  No need to be so surprised that someone doesn’t know a star hero okay. But not knowing the anchor suma means it should be a shock. It is known that Suma, who has increased her craze so much, continues to be the top most anchor. However, Suma, who is very close to the Rajamouli family, did not appear at an event related to them recently.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X