నిజ జీవితంలోనూ చీర లాగారు.. తీవ్రంగా కొట్టారు.. మహాభారతం ద్రౌపది ఫేమ్ రూపా గంగూలీ కామెంట్స్
బుల్లితెరపై మహాభారతం సీరియల్ ఓ సంచలనం. ఒకప్పుడు ప్రజలకు అంతగా వినోదం అందుబాటులో లేని సమయంలో మహాభారతం సీరియల్ ప్రసారమైంది. 1988లో ప్రసారమైన ఈ ధారావాహిక ఎంతో ప్రభావాన్ని చూపింది. అప్పటి పాత్రధారులను ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. వారి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మళ్లీ మహాభారతం సీరియల్‌ను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ రికార్డులు..
లాక్‌డౌన్ కారణంగా ప్రజల అభీష్టం మేరకు మహాభారతం సీరియల్‌ను పున: ప్రసారం చేశారు. ఈ కారణంగా మహాభారతం సీరియల్‌కు అదిరిపోయే రేటింగ్ వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ (వినోద కార్యక్రమంలో) సాధించిన ధారావాహికగా రికార్డులకెక్కింది.

పాత్రధారుల వీడియో..
మహాభారతం సీరియల్ షూటింగ్ పూర్తయిన తరువాత పాత్ర ధారులంతా కన్నీరుమున్నీరయ్యారు. పాండవులుగా నటించిన వారంతా షూటింగ్ ముగిసిపోవడంతో ఒకరినొకరు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

రూపా గంగూలీకి ఎదురైన ఘటన..
మహాభారత్ లో సీరియల్లో ద్రౌపది పాత్రతో బెంగాలీ నటి రూపా గంగూలీ విశేషమైన ప్రజాదరణ పొందింది. ఆ సీరియల్లో వస్త్రాపహరణం సన్నివేశాల్లో ద్రౌపది నిస్సహాయతను ఆమె అద్భుతంగా పలికించింది. అయితే, తనకు నిజజీవితంలోనూ వస్త్రాపహరణం తరహా ఘటన ఎదురైందని రూపా వెల్లడించింది.
Recommended Video

చీర లాగేశారు..
రాజకీయాల్లో ప్రవేశించిన సమయంలో 2016లో మరో వర్గం వ్యక్తులు తనపై దాడి చేశారని వివరించారు. కోల్ కతా లోని డైమండ్ హార్బర్ వద్ద తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, తనను నేలకేసి విసిరికొట్టారని, చీర లాగేశారని వెల్లడించింది. తన తలను కారుకేసి కొట్టారని, దాంతో ఓ కన్ను పోయినంత పనైందని వివరించింది.


Click it and Unblock the Notifications











