రాంగోపాల్ వర్మ గాలి తీసేసిన యంగ్ కమెడియన్.. నాగబాబు కూడా షాక్!

By Manoj Kumar P

కొన్నేళ్లుగా సంచలన నిర్ణయాలతో వివాదాస్పద చిత్రాలతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తెలుగు సినీ ఇండస్ట్రీలోని దర్శకులందరూ ఏడాది, రెండేళ్లకో సినిమా తీస్తుంటే... ఈయన మాత్రం ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున తెరకెక్కిస్తున్నాడు. ఇక, ఈ మధ్య మరింత స్పీడు పెంచిన ఆర్జీవీ... నెలకో సినిమాతో వస్తున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద చిత్రాలనే తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఎదుటే వర్మపై ఓ యంగ్ కమెడియన్ పంచుల వర్షం కురిపించాడు. ఆ వివరాలు మీకోసం.!

పాయింట్ దొరికితే చాలు.. సినిమా కంప్లీట్

పాయింట్ దొరికితే చాలు.. సినిమా కంప్లీట్

ఒకప్పుడు గొప్ప గొప్ప చిత్రాలు తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ క్రమంలోనే వరుస అవకాశాలు కూడా అందుకున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో సైతం ఛాన్స్ పట్టేశాడు. అంతటి పేరున్న ఈ డైరెక్టర్... కొన్నేళ్లుగా విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పాయింట్ దొరికితే చాలు సినిమా తీసేద్దాం అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు.

అన్నీ అదే తరహాలో.. అందుకే వివాదాలు

అన్నీ అదే తరహాలో.. అందుకే వివాదాలు

రాంగోపాల్ వర్మ ఈ మధ్య తీస్తున్న చిత్రాలన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి కారణం ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందిస్తుండడమే. ఇప్పటికే అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన... కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు. వాటితోనే సినిమాలు తీసి వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు.

ఆ చిత్రాలన్నీ ఒకెత్తు... కొత్తది మరో ఎత్తు

ఆ చిత్రాలన్నీ ఒకెత్తు... కొత్తది మరో ఎత్తు

రాజకీయ నేపథ్యం... అందునా కొంత వివాదాస్పదం అయి ఉంటే చాలు రాంగోపాల్ వర్మ సినిమా తీసేస్తున్నాడు. ఇదే బేసిస్‌తో ఇప్పటికే ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి చిత్రాలను రూపొందించాడాయన. ఇక, ఈ మధ్య ‘పవర్ స్టార్' అనే మరో పొలిటికల్ సెటైరికల్ మూవీతో ఆర్జీవీ మెగా ఫ్యామిలీతో గిల్లికజ్జాలు కొనసాగించాడు.

ముందు నుంచీ అంతే... ఇప్పుడు పవన్

ముందు నుంచీ అంతే... ఇప్పుడు పవన్

మెగా ఫ్యామిలీ అంటే రాంగోపాల్ వర్మకు ముందు నుంచీ పడదన్న విషయం తెలిసిందే. దీని వల్లే ఆయన ఎప్పటి నుంచో ఆ కుటుంబానికి చెందిన హీరోలపై విమర్శలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను బాగా టార్గెట్ చేశాడు. ఇందులో భాగంగానే ఆయన కథతో ‘పవర్ స్టార్' తీశాడు. ఈ చిత్రంతో బాగా లాభాలను కూడా అర్జించాడు వర్మ.

మెగా ఫ్యాన్స్ ఫైర్.... సెలెబ్రిటీల మద్దతు

మెగా ఫ్యాన్స్ ఫైర్.... సెలెబ్రిటీల మద్దతు

‘పవర్ స్టార్' మూవీ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌ రాంగోపాల్ వర్మపై కారాలు మిరియాలు నూరారు. సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిట్టారు. అయినా వర్మ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో కొందరు సెలెబ్రిటీలు సైతం మెగా ఫ్యామిలీకి మద్దతుగా.. రాంగోపాల్ వర్మకు వ్యతిరేకంగా తమ తమ వాదనలు వినిపించారు.

ఆర్జీవీ గాలి తీసేసిన యంగ్ కమెడియన్

ఆర్జీవీ గాలి తీసేసిన యంగ్ కమెడియన్

రాంగోపాల్ వర్మ.. మెగా ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే స్పందిచే వ్యక్తి నాగబాబు. అయితే, పవర్ స్టార్ విషయంలో ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆయన జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ‘అదిరింది' షోలో మాత్రం ఆర్జీవీపై సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల ధన్‌రాజ్... ఈ సెన్సేషనల్ డైరెక్టర్‌పై మెగా బ్రదర్ సాక్షిగా విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు మరో కమెడియన్ ఆయన గాలి తీశాడు.

అతడి దెబ్బకు నాగబాబు కూడా షాక్.!

అతడి దెబ్బకు నాగబాబు కూడా షాక్.!

‘అదిరింది' రౌడీ బాయ్స్ టీమ్ లీడర్ హరి... రాంగోపాల్ వర్మపై పంచుల వర్షం కురిపించాడు. వైరస్ మనిషి రూపంలో వస్తే అది వర్మ అని... హీరోల ఫ్యాన్స్‌ను గెలికే వ్యక్తికి కూడా ఫ్యాన్స్ ఉంటారా అని... వరుసగా సెటైర్లు వేశాడు. దీనికి నాగబాబు పగలబడి మరీ నవ్వాడు. అంతేకాదు, హరి స్పీడుకు ఓ సందర్భంలో షాకయ్యాడు కూడా. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X