బుల్లితెరపై తారక్, చరణ్, రాజమౌళి హల్‌చల్.. టీఆర్పీ రికార్డులు బద్దలే.. కానీ చివర్లో ట్విస్ట్

బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'ఢీ'. ఇప్పటికి పది సీజన్లు పూర్తి చేసుకుని, పదకొండో సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అడుగు దూరంలో నిలిచింది. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే ఈ షో అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఈ షో గురించి చెప్పుకోడానికి కారణం ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే, పూర్తిగా చదివేయండి.

చివరి అంకానికి చేరుకుంది

చివరి అంకానికి చేరుకుంది

బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఢీ డ్యాన్స్ షో ఫైనల్స్‌కు చేరుకుంది. దాదాపు ఏడాది పాటు సాగిన ఈ షోలో నాలుగు జట్లు చివరి అంకానికి చేరుకున్నాయి. అందులో సుధీర్‌ టీమ్ నుంచి రెండు జట్లు, రష్మీ జట్టు నుంచి రెండు టీమ్స్ ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో రెండు మాత్రమే లెవెల్‌ - 2కు చేరుకుంటాయి. అవే టైటిల్ కోసం పోరాటం చేస్తాయి. ఫైనల్‌‌లో గెలిచే జోడీ 75 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్‌తో పాటు టైటిల్ గెలుచుకుంటుంది.

ఫైనల్ గెస్ట్స్ వాళ్లేనంటూ ప్రకటన

ఫైనల్ గెస్ట్స్ వాళ్లేనంటూ ప్రకటన

సూపర్ క్వాలిఫైయర్స్ అయిపోయిన తర్వాత నాలుగు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. అదే సమయంలో వచ్చే వారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను షో నిర్వహకులు విడుదల చేశారు. అందులో ఫైనల్స్‌కు ‘RRR' యూనిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి వస్తారంటూ ప్రకటించారు. అంతేకాదు, వాళ్లు వస్తున్నట్లు కూడా కొన్ని క్లిప్స్ చూపించారు. దీంతో సదరు హీరోల అభిమానులు ఖుషీ అయిపోయారు.

రికార్డులు బద్దలవుతాయనకుంటే వాటిని తీసేశారు

‘RRR' యూనిట్ వస్తే టీఆర్పీ రికార్డులు బద్దలవుతాయని చాలా మంది అనుకున్నారు. గతంలో ఎన్టీఆర్ వచ్చిన ఎపిసోడ్ భారీ స్థాయిలో రేటింగ్ సంపాదించుకుంది. దీంతో మరోసారి అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయనుకున్నారు. అయితే, గతంలో విడుదల చేసిన ప్రోమోలను సదరు చానెల్ తీసేసింది. వాటి బదులు మరికొన్ని ప్రోమోలను విడుదల చేసింది. దీంతో తమ అభిమాన హీరోలు వస్తారని ఆనంద పడిన ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు.

కారణం అదేనా.??

కారణం అదేనా.??

ప్రస్తుతం ‘RRR' యూనిట్ బల్గేరియాలో ఉంది. అక్కడ ఓ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటారు. ఆయనపై మాత్రమే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతాయని టాక్. ఈ బల్గేరియా షెడ్యూల్ మూడు వారాల పాటు జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే రామ్ చరణ్ మాత్రం ఇక్కడే ఉంటారని తెలిపింది.

 ఢీ జోడీ విన్నర్ ఆ జంటేనట

ఢీ జోడీ విన్నర్ ఆ జంటేనట

ఢీ జోడీ ఫైనల్ ఎపిసోడ్స్ ఇంకా ప్రసారం కాలేదు. కానీ, ఓ జోడీ విజయం సాధించిందని ప్రచారం జరుగుతోంది. రష్మీ టీమ్‌లోని మహేశ్ అండ్ రితునే టైటిల్ గెలుచుకుందని కొన్ని యూట్యూబ్ చానెళ్లు వీడియోలు పెడుతున్నాయి. ఈ జోడీకి ప్రశాంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. అంతేకాదు, ఫైనల్స్‌కు మహేశ్ బాబు వచ్చాడని కొందరు, రామ్ చరణ్ వచ్చాడని కొందరు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X