మరోసారి టెలివిజన్ ప్రపంచంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన RRR.. ఇది అరాచకం!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR గత ఏడాది రిలీజై ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇండియాలోనే థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా RRR నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్స్ ఆస్కార్ అవార్డు అందుకోవడం ద్వారా ఇండియన్ హిస్టరీలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ చరిత్రలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాగా RRR నిలిచింది.

ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయింది. హాలీవుడ్ నటులు, దర్శకులు సైతం RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. రామ్ చరణ్, తారక్ ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం కూడా ప్రత్యేకత అని చెప్పాలి. రాజమౌళి సైతం ఇండియా నుంచి హాలీవుడ్ స్థాయికి చేరువైన దర్శకుడుగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

RRR movie 5th time TRP solid and total 5 times ratings details

ఇదిలా ఉంటే సిల్వర్ స్క్రీన్, డిజిటల్ మాధ్యమాల్లో సంచలన విజయం నమోదు చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు రీచ్ అయిన ఈ సినిమా బుల్లితెరపై కూడా అదే రేంజ్ లో సత్తా చాటింది. బుల్లితెరపై 5 సార్లు ఈ సినిమాని టెలికాస్ట్ చేశారు. మొదటి సారి ఏకంగా 19.62 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సెకండ్ టైం 8.02 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక మూడో సారికి మరింత తగ్గిపోయి 6.37 రేటింగ్ ని దక్కించుకుంది.

RRR movie 5th time TRP solid and total 5 times ratings details

నాలుగో సారి అయితే ఇంకా తగ్గిపోయి 4.14 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది. అయితే ఐదో సారి మరల RRR సినిమాని బుల్లితెరపై ప్రదర్శించగా ఏకంగా 8.17 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. రెండో సారి ఈ మూవీకి వచ్చిన రేటింగ్ కంటే ఎక్కువగా ఐదో సారి రావడం ప్రత్యేకత అని చెప్పాలి. RRR సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడం వలన మరోసారి తెలుగు ఆడియన్స్ బుల్లితెరపై RRR సినిమాని చూడటానికి ఆసక్తి చూపించారని అర్ధం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X