RRR ఫస్ట్ టైమ్ షాకింగ్ టీఆర్పీ.. ఫిదా సినిమా కంటే తక్కువే!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటిసారి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా మెప్పించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఓటీటీ లో కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హింది వెర్షన్ కు దేశ విదేశాల నుంచి కూడా ప్రశంసలు అందాయి. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా మేకింగ్ గురించి చాలా గొప్పగా ప్రశంసించారు.

అయితే రీసెంట్ గా RRR సినిమా తెలుగు వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. స్టార్ మాలో శాటిలైట్ హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే టెలివిజన్ లో RRR గతంలో క్రియేట్ అయిన రికార్డులను మాత్రం ఈ బ్రేక్ చేయలేకపోయింది. RRR కంటే చిన్న సినిమాలు కూడా ఊహించని స్థాయిలో టిఆర్పిని అందుకున్నాయి. ముఖ్యంగా ఫిదా TRP కంటే తక్కువగానే నమోదు చేసుకోవడం ఆశ్చర్యకరం. RRR ఫస్ట్ టైం టిఆర్పి 19.32 వచ్చింది. ఈ తరహా రేటింగ్స్ వస్తాయి అని ఎవరు ఉహించలేదు.

RRR telugu movie first time TRP unexpected response

తప్పకుండా నెంబర్ వన్ రికార్డును సొంతం చేసుకుంటుంది అని అనుకున్నారు. అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో ఫస్ట్ టైం టిఆర్పి 29.4 ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు 23.4, బాహుబలి 22.7, శ్రీమంతుడు 22.54, పుష్ప 22.54, డీజే 21.7, బాహుబలి 21.54 TRP తో ఆ తరువాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఎనిమిదవ స్థానంలో ఫిదా సినిమా 21. 31 టిఆర్పిని అందుకోగా ఆ తర్వాత గీత గోవిందం 20.8 టిఆర్పి అందుకుంది. ఇక వాటి కంటే RRR సినిమా తక్కువ టిఆర్పిని సొంతం చేసుకుంది. మరి మిగతా భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X