Brahmamudi September 9th: కనకానికి దొరికేసిన రాహుల్... గదిలో అప్పు బందీ.. తల్లికి నిజం చెప్పేసిన రాజ్

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రారంభంలో కావ్య పూలు, పాల గ్లాస్ తో రాజ్ గదిలోకి వెళ్తుంది. కాసేపు పాలు, పూల గురించి క్లాస్ తీసుకుంటుంది కావ్య. అది వినలేక రాజ్.. కావ్యకు దండం పెడుతాడు. మళ్లీ ఫీల్ అవుతుందేమోనని.. మూడు నెలలు టైమ్ అడిగాను కదా అని కావ్యకు గుర్తు చేస్తాడు రాజ్. అమ్మమ్మ పూలు పెట్టారు, చిన్నత్తయ్య పాలు ఇచ్చారని చెప్తుంది కావ్య. దీంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు.

ఇక కళ్యాణ్ అనామిక ఫోటో పట్టుకుని చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. ఆమె ప్రేమలో కళ్యాణ్ ప్రేమలో తేలుతూ ఉంటాడు. ఈ విషయం గురించి అప్పుని అడగాలని తనకి కాల్ చేస్తాడు. కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది. మళ్ళీ చేసేసరికి చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి పనిలో ఉన్నానని అరుస్తుంది. ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడమని బతిమలాడతాడు. సరే అని మాట్లాడుతుంటే అనామిక కాల్ చేస్తుంది. దీంతో అప్పు కాల్ కట్ చేసేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పు కోపంగా కళ్యాణ్ కి కాల్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుకి మండిపోతుంది.

Brahmamudi Telugu Serial

మరోవైపు కనకం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా కారులో రాహుల్ వెళ్తూ కనిపిస్తాడు. ఇదేంటి హనీ మూన్ కి వెళ్లారని అన్నారు కదా రాహుల్ ఇక్కడ ఉన్నాడు ఏంటని అనుకుని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. రుద్రాణి నిద్రలో ఉంటుంది. కాల్ చేసి మీ అబ్బాయి రోడ్డు మీద కనిపించాడు అని అడుగుతుంది. ఎలా చూస్తారు నిన్న రాత్రి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఊటీలో ఉన్నారు. అంటే మీరు మీ కూతురితో రోజు మాట్లాడటం లేదా? పెళ్లి అయిన తర్వాత తల్లిని వదిలేసిందా? అని అంటుంది రుద్రాణి. ఆహా అదేం లేదు రోజు మాట్లాడుతుంది. ఊటీలో ఉన్నానని చెప్పిందని చెప్తుంది.

రుద్రాణి వెంటనే రాహుల్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. మీ అత్త నిన్ను చూసింది. పని పూర్తయ్యే వరకు ఎవరికీ కనిపించొద్దని చెప్పాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావ్. మనం ఇప్పుడు చేస్తున్న పని చాలా రిస్క్ తో కూడుకున్నది. నువ్వు ఇలా తప్పులు చేసి దొరికిపోతే జీవితాంతం వీళ్ళ కాళ్ళ కింద పడి బతకాల్సి వస్తుందని సూచిస్తుంది. ఒకే మామ్ ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్తాడు రాహుల్.

Brahmamudi Telugu Serial

మరోవైపు కావ్య కృష్ణయ్యకి పాట పాడి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. బాల కృష్ణుడిని పిలిస్తే నీ బాల గోపాలుడు వచ్చాడని ఇంద్రాదేవి అంటుంది. ప్రతి పండగ గొప్పగా చేయాలా? ఇంటిని భజన మందిరం చేస్తున్నారని రుద్రాణి దెప్పి పొడుస్తుంది. తను పూజ కదా చేసింది అందులో తప్పేముంది. ఇల్లు భజన మందిరంలా అనిపిస్తే మీరు మీ గదిలోనే కూర్చోండి ఎవరు వద్దన్నారని రాజ్ అంటాడు. పూజలు చేయడానికి ఉన్న విశిష్టత గురించి ఇంద్రాదేవి చక్కగా చెప్తుంది. నీకు రావడం ఇష్టం లేకపోతే నీ గదిలోనే ఉండు. బయటకి వస్తే నోరు అదుపులో పెట్టుకో అని చెప్తుంది.

అందరూ జంటలుగా వచ్చి కృష్ణయ్యని ఆశీర్వదించి దణ్ణం పెట్టుకుంటారు. ముందుగా సీతారామయ్య వాళ్ళు తర్వాత శుభాష్, ప్రకాశం వాళ్ళు దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. అందరూ అయిపోయిన తర్వాత రాజ్, కావ్యని వెళ్ళమని అమ్మమ్మ చెప్తుంది. భర్తతో కలిసి పూజ చేసినందుకు కావ్య చాలా సంతోషిస్తుంది. భర్త మనసు మారుతుంది, అత్త మనసు కూడ మారి కోడలిగా స్వీకరించేలా చూడమని కావ్య కృష్ణయ్యని వేడుకుంటుంది. అప్పు ఆడుకోవడానికి బయటకి వెళ్లబోతుంటే కనకం కోపంగా తనని గదిలో పెట్టి బంధించేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్ కావ్య మెడలో హారం వేస్తాడు. దీంతో తను చాలా ఎమోషనల్ అవుతుంది. ఇదే విషయాన్ని ఇంద్రాదేవి వాళ్ళతో పంచుకుంటుంది. ఈ బ్రహ్మముడి ఎందుకు వేశావు దేవుడా అని ఎంతో బాధపడేదాన్ని.. కానీ నాకు నమ్మకం వచ్చింది నేను ఈ ఇంటి కోడలినే అని కావ్య సంతోషంగా మాట్లాడటం అపర్ణ విని షాక్ అవుతుంది. కోపంగా రాజ్ ని గదికి లాక్కెళ్లి ప్రశ్నిస్తుంది. వరలక్ష్మీ వ్రతం జరిగిన రోజు రాత్రి నుంచి నీలో మార్పు వచ్చింది. కావ్య అంటే ఇష్టం ఉన్నట్టు ప్రేమ చూపిస్తున్నావ్. ఎందుకు ఇలా మారిపోయావ్ అని నిలదీస్తుంది. తాతయ్య కోసమని జరిగింది మొత్తం చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X