Brahmamudi October 28th: స్వప్న బండారం తెలుసుకున్న రుద్రాణి.. అక్కాచెల్లెళ్లు పరిస్థితి ఏంటో?
ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ తాగిన స్వప్నకు ఏమి కాకపోవడంతో.. రాహుల్ ఆశ్చర్యపోతాడు. స్వప్నను లేపి.. ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఒక డైమండ్ నెక్లస్ కావాలి.. కొనిస్తావా అంటూ స్వప్న వెటకారంగా అంటుంది. అది కాదు.. నీకు అంతా బానే ఉందా అని రాహుల్ అడుగుతాడు. ఇష్టంలేకపోయినా జ్యూస్ తాగినా.. పడుకుంటే లేపుతావ్ ఏంటి అని చిరగ్గా స్వప్న సమాధానం ఇస్తుంది. ఇక నీకు ఏమ్ అవుద్దే... అయితే మాకు అవుద్ది అంటూ రాహుల్ చిరాకుపడి పడుకుంటాడు.
మరోవైపు రుద్రాణి.. స్వప్న గదిలోంచి అరుపులు, కేకలు రావట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది. డోర్ దగ్గరకు వెళ్లి రుద్రాణి వినేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే కనకం వచ్చి.. ఏమైందని కనకం అడుగుతుంది. ఇందాకా వీళ్లు గొడవపడ్డారు... ఏమైందా అని చూస్తున్నా అని రుద్రాణి కవర్ చేస్తుంది. అంతేలే.. ఇలాగే కవర్ చేయాలి అని కనకం అంటుంది. నాకు అలాంటి పాడు బుద్ది లేదు అని రుద్రాణి అంటుంది. కాసేపు వాదించుకున్న తర్వాత రండి పడుకుందామని కనకం.. రుద్రాణిని లాక్కెళ్తుంది.

ఇక కావ్య స్నానం చేసి.. రెడీ అవుతుంది. నిద్రపోతున్న రాజ్ ను చూసి ప్రేమగా ఓ సెల్ఫీ తీసుకుంటుంది. అప్పుడే కావ్య హెయిర్ రాజ్‌పై పడటంతో.. వెనక్కి వచ్చేస్తుంది కావ్య. తన హెయిర్ టవల్ తో తుడుచుకుంటూ ఉంటుంది కావ్య. అప్పడే నిద్రలేచిన రాజ్.. కావ్య అందాన్ని చూసి టెంప్ట్ అవుతాడు. ఇక రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి కావ్య అందానికి ఫిదా అవుతాడు. ఇక రాజ్.. నా భార్యను అలా చూడొద్దని అంతరాత్మకు చెప్తాడు. నువ్వు నేను ఒకటే రా అంటూ అంతరాత్మ చెప్తాడు.
ఇక కావ్యను రాజ్ అంతరాత్మ హగ్ చేసుకునేందుకు వెళ్తుంటే.. రాజ్ వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంటాడు. దానికి కొంత షాక్ అయిన కావ్య.. రాజ్ హగ్ చేసుకోవడంతో చాలా సంతోషిస్తుంది. ఇద్దరు కాసేపు అలాగే ఉండగా... ఇంతలో కావ్య అంటూ ధాన్యలక్ష్మీ వచ్చి చూస్తుంది. రాజ్ చెంగున ఎగిరి గొడ పక్కకు దాక్కుంటాడు. నేను ఎప్పుడు ఇలాంటి సమయంలోనే రావాలా. అయినా డోర్ ఒకటి ఉందిగా. దాన్ని వేసుకోవచ్చు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక కావ్యను... సీమంతానికి రెడీ చేయాలి రమ్మని పిలుస్తుంది.
మరోవైపు ట్యాబ్లెట్స్ పనిచేశాయా లేదా అని స్వప్న డోర్ ముందే రుద్రాణి ఆలోచిస్తుంది. ఇంతలో అటుగా వస్తున్న కనకాన్ని చూసి.. ఇక్కడ కనిపిస్తే అనుమానం వస్తుందనుకున్న రుద్రాణి.. వెళ్లి చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తుంది. అది చూసి కనకం షాక్ అవుతుంది. తర్వాత బయటకు వచ్చిన రాహుల్ ను అసలు ఏమైందని అడుగుతుంది. ఏం కాలేదు... దున్నపోతులా పడుకుంది అని రాహుల్ అంటాడు. అలా ఎలా జరిగిందని ఇద్దరు ఆలోచిస్తుంటే.. ఇంతలో స్వప్న కేకలు పెడుతుంది.
ఏమైందా అని వెళ్లి అడిగితే.. బల్లిని చూసి భయపడినట్లు చెబుతుంది స్వప్న. తర్వాత స్వప్న వెళ్లిపోతుంది. ఆ డాక్టర్ సరైనా ట్యాబ్లెట్స్ ఇవ్వలేదని అనుకుంటారు రుద్రాణి, రాహుల్. ఇక గదిలో ఉన్న రాజ్ కు కావ్య డ్రెస్ గిఫ్టుగా ఇస్తుంది. సీమంతానికి ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవాలని తీసుకున్నానని చెప్ప్తుంది. మీ ఇష్టం బలవంతం ఏమిలేదని చెప్తుంది. నా ఇష్టం అనడానికి ఎందుకు తీసుకున్నావని అంచాడు రాజ్. ఇష్టం చూపించగలం.. కానీ లాక్కోలేమని చెప్తుంది కావ్య.
మరోవైపు డాక్టర్ కి కాల్ చేస్తుంది రుద్రాణి. నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ చాలా పవర్‌ఫుల్. మీరు వేరే మందులైన వాడి ఉండాలి. లేదా పర్సన్‌కి కడుపు లేకుండా అయినా ఉండాలి, నీ సైడ్ నుంచే ఏదో తప్పు ఉంది. అదేంటో తెలుసుకో అని రుద్రాణికి డాక్టర్ చెబుతుంది. దీంతో అదేంటే తెలుసుకోవాలని రుద్రాణి ఆలోచిస్తుంది. ఇంట్లో సీమంతానికి అంతా రెడీ చేస్తారు. ఇంతలో అప్పు, కృష్ణమూర్తి వస్తారు. అప్పు సెటైర్లు వేస్తుంది. తర్వాత రాజ్ కోసం తెప్పించిన డ్రెస్ వేసుకోమ్మని ఇస్తుంది అపర్ణ. దీంతో భార్య డ్రెస్ వేసుకోవాలా, తల్లి డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచనలో పడతాడు రాజ్. అత్తగారి డ్రెస్ బాగుంది. అదే వేసుకోండి అని కావ్య అంటుంది. నీ రికమండేషన్ అవసరం లేదని అపర్ణ అంటుంది.
ఇక రుద్రాణికి అపర్ణ చెప్పిన పని గుర్తు చేస్తుంది. అమ్మవారి కుంకుమ తెచ్చావా అని అడుగుతుంది. ఇక రుద్రాణి తప్పించుకునేందుకు కావ్యకు చెప్పాను.. తెచ్చావా అని అడుగుతుంది. నాకు చెప్పలేదు మీరు అని కావ్య అంటుంది. ఇక తర్వాతి ఎపిసోడ్‌లో స్వప్నకు కడుపు లేదని డాక్టర్ చెబుతుంది. అదే విషయాన్ని ఇంటికి వచ్చి అందరికి చెప్పాలి అని రుద్రాణి అంటుంది. దానికి కావ్య షాక్ అవుతుంది.


Click it and Unblock the Notifications











