Brahmamudi October 31st: స్వప్న బాగోతం బయటపెట్టిన రుద్రాణి... ఆఖరికి కావ్యను బలి చేసిందిగా?
బ్రహ్మముడి సీరియల్ కథలో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం ఇంట్రెస్ట్ కలిగించింది. ఇక స్వప్న ఫేక్ ప్రెగ్నెన్సీని బయట పెట్టేందుకు రుద్రాణి ప్లాన్ మొత్తానికి వర్కౌట్ అయింది. రుద్రాణి అందరి ముందు.. స్వప్న బాగోతాన్ని బయటపెట్టేంది. ఇక నా కోడలిగా ఈ ఇంట్లో ఉండే అధికారం లేదని రుద్రాణి స్వప్నకు వార్నింగ్ ఇచ్చింది. ఇక స్వప్న ప్లేట్ పీరాయించి... ఇదంతా నడిపించింది కావ్య అంటూ షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎపిసోడ్ ప్రారంభంలోనే తల్లికొడుకులు స్వప్న ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్నది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటూ రుద్రాణి.. రాహుల్ కు చెప్తుంది. నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే... స్వప్న తనకు పెట్టిన టార్చర్‌కు మొత్తం బదులు తీర్చుకుంటాను అంటూ రాహుల్ ఆవేశపడుతాడు. స్వప్నను ఇంట్లో నుంచి గెంటివేయడం ఖాయమని రుద్రాణి కొడుకుతో అంటుంది.

ఇక మరోవైపు సీమంతం వేడుకకోసం రాజ్, కావ్య రెడీ అయ్యేందుకు రూమ్ లోకి వెళ్తారు. అక్కడ నేను ముందు రెడీ అవుతా.. నేను అవుతా అంటూ ఇద్దరు గొడవ పడుతారు. సీమంతం వేడుక కోసం రాజ్, కావ్య రెడీ అవుతారు. ఇద్దరిలో ఎవరు ముందు రెడీ కావాలో తెలియక గొడవపడతారు. రాజ్ కు చక్కిలిగింతలు పెట్టి... తాను ముందుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లాక్ చేసుకుంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ కోసం తాను కొన్న డ్రెస్‌తో పాటు అపర్ణ కొన్న డ్రెస్‌ను బెడ్‌పైన ఉంచుతుంది. ఈ రెండింటిలో భర్త ఏది సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలని అనుకుంటుంది కావ్య. చీరలో అందంగా ముస్తాబైన కావ్యను చూసి రాజ్... ప్రేమలో పడిపోతాడు.
ఏంటి అలా చూస్తున్నారని కావ్య.. రాజ్ ను అడుగుతుంది. ఆ తర్వాత ఫోన్‌లో ఒక ఫొటో తీయమని రాజ్‌ను కావ్య అడుగుతుంది. కాస్ట్లీ ఫోన్ కదా.. మీ ఫోన్ లో ఫోటోస్ బాగా వస్తాయని కావ్ అంటుంది. కావాలంటే నా ఫోన్ తీసుకో అంటాడు రాజ్. వద్దు ఒక ఫోటో తీయండి అంటుంది. ఇక కావ్యను అందంగా ఫోటో దించుతాడు. ఆ తర్వాత కావ్యకు కూడా చక్కిలిగింతలు పెట్టి లోపలికి వెళ్తాడు రాజ్. ఇక అక్కడ రెండు డ్రెస్సులు చూసి.. ఎవరి డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
అమ్మనా, కళవతినా అంటూ ఆలోచనలో పడిపోతాడు. చివరకి మాత్రం కావ్య తెచ్చిన డ్రెస్ వేసుంటాడు. అది చూసి కావ్య హ్యాపీగా ఫీలవుతుంది. రాజ్‌కు థాంక్స్ చెబుతుంది. అందంగా రెడీ అయివస్తోన్న రాజ్, కావ్యలను చూసి ఇందిరాదేవి, కనకం ఆనందపడతారు. రాజ్ తాను తెచ్చిన డ్రెస్ వేసుకోకపోవడంతో అపర్ణ షాక్ అవుతుంది. రుద్రాణి ఆ విషయం కనిపెడుతుంది. అపర్ణను ఆడుకోవాలని ఫిక్స్ అవుతుంది. నీ కుమారరత్నం నీ చేతుల్లో న ఉంచి జారిపోయి చేపపిల్లలా పెళ్లాం బుట్టలో పడ్డాడని అపర్ణ కోపాన్ని మరింత పెంచుతుంది.
ఇక మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారని కావ్యపై అనామిక అంటుంది. మీ ఇద్దరిని చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉందని కనకం అంటుంది. నా సీమంతం వేడుకలో అందరూ కావ్యను పొగడటం స్వప్న ఫీల్ అవుతుంది. స్వప్న సీమంతం ఏర్పాట్లతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ ఆనందం చూసి స్వప్న కంగారు పడుతుంది. తన ప్రెగ్నెన్సీ నిజమైతే బాగుండునని లోలోన అనుకుంటుంది. అందరూ స్వప్న సీమంతం పనుల్లో బిజీగా ఉంటే రుద్రాణి, రాహుల్ మాత్రం.. దూరం దూరంగాఉంటారు.
ఇక డాక్టర్ శ్రీదేవి ఫోోన్ చేస్తుంది. శ్రీదేవి స్వప్న బాగోతం మొత్తం బయటపెడుతుంది. స్వప్న ప్రెగ్నెన్సీ అబద్ధమని, అవన్నీ ఫేక్ రిపోర్ట్స్ అని రుద్రాణితో అంటుంది డాక్టర్. ఆ మాట వినగానే రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. తనతో పాటు తన కొడుకును ఫూల్ చేసిన స్వప్నకు తగిన బుద్ది చెప్పాలని రుద్రాణి అనుకుంటుంది. కోడలు స్వప్నకు గిఫ్ట్ ఇవ్వడం లేదా అని రుద్రాణిని అడుగుతుంది ధాన్య లక్ష్మి. స్వప్నకు మంచి బహుమతి ఇవ్వబోతున్నట్లు, దారిలో ఉందని, మరికొద్ది క్షణాల్లో ఆ గిఫ్ట్ వస్తుందని వెటకారంగా అంటుంది రుద్రాణి.
ఇక రాహుల్ కు రుద్రాణి స్వప్నకు ప్రెగ్నెన్సీ లేదని చెప్తుంది. ఆ మాట వినగానే రాహుల్ ఆవేశంతో ఊగిపోతాడు. ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇలా నాలుగు గోడల మధ్య చెబుతావు ఏంటి? ఇప్పుడే అందరికి చెబుతానని వెళ్లబోతాడు. రాహుల్‌ను ఆపేస్తుంది రుద్రాణి. మనం చెబితే ఇంట్లో ఎవరూ నమ్మరని, ఇన్నాళ్లు స్వప్నను దొంగ ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్‌తోనే ఆ నిజం చెప్పిస్తానని అంటుంది. స్వప్న ఫ్రెండ్ డాక్టర్ ప్రియకు ఫోన్ చేసి మీరు ఆడిన ప్రెగ్నెన్సీ నాటకం మొత్తం తనకు తెలిసిపోయిందని భయపెట్టిస్తుంది. ఇక ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తదుపరి ఎపిసోడ్ లో... సీమంతం వేడుకలోనే దుగ్గిరాల కుటుంబసభ్యులు అందరి ముందు స్వప్న ఫేక్ ప్రెగ్నెన్సీని రుద్రాణి బయటపెడుతుంది. కడుపు పేరుతో అబద్ధం ఆడిన స్వప్న ఇంట్లో ఉండకూడదని, స్వప్న ఎప్పటికీ తన కోడలు కాదని రుద్రాణి ఫైర్ అవుతుంది. అందరి ముందు తాను దోషిగా మారడం సహించలేకపోతుంది స్వప్న. ఈ ప్రెగ్నెన్సీ డ్రామా తనతో కావ్యనే ఆడించిందని చెప్తి షాక్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











