Brahmamudi October 27th: అబార్షన్ కోసం రుద్రాణి స్కెచ్.. ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ తాగిన స్వప్న.. చివరకు?

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. ఈ వారం మొత్తం ట్విస్టులతో ఇంట్రెస్ట్ ను కలిగించింది. ఇక స్వప్న అబార్షన్ కోసం.. రుద్రాణి ఓ స్కెచ్ వేస్తుంది. ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ స్వప్నతో తాగిస్తుంది. మరోవైపు కావ్య ప్రేమలో రాజ్ పడిపోతాడు. ఆమెను గట్టిగ హగ్ చేసుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దుగ్గిరాల ఇంట్లో స్వప్న సీమంతం గురించి మాట్లాడుకుంటారు. ఇక కనకంతో అపర్ణ ప్రేమగా మాట్లాడటం చూసి కావ్య మురిసిపోతుంది. ఈ టైంలోనిజం చెప్పి... వీళ్ల సంతోషాన్ని చెడగొట్టలేనని కావ్య అనుకుంటుంది. తనలో తాను బాధపడిపోతుంది. అమ్మమ్మగారు పుట్టబోయే బాబుపై ఆశలు పెట్టుకున్నారని ఆవేదన చెందుతుంది. మరోవైపు రుద్రాణి.. స్వప్న అబార్షన్ కోసం కొత్త ప్లాన్ వేస్తుంది. డాక్టర్ శ్రీదేవి దగ్గరి నుంచి అబార్షన్ ట్యాబెట్లు తీసుకొచ్చినట్లు... రాహుల్ కి చెప్తుంది. ఫుడ్ లో కలిపి.. ఫుల్ పాయిజన్ అయిందని చెప్పి అబార్షన్ ప్లాన్ వేస్తుంది.

Rudhranis Wicked Plan in October 27th 2023 Episode number 238 in Brahmamudi Telugu Serial

అయితే వద్దు మమ్మీ అని రాహుల్ అంటాడు. ఇప్పుడు స్వప్నకు ఏమైనా జరిగితే అంతా మనల్నే అనుమానిస్తారు అని చెప్తాడు. ముఖ్యంగా నన్ను అనుమానిస్తారు అని అంటాడు. ఈ టాబ్లెట్స్ వేసిన జ్యూస్ నేరుగా నువ్ తాగిస్తే.. నీపై అనుమానం వస్తుంది. కానీ, ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలిస్తే.. నిన్నేందుకు అంటారు అని రుద్రాణి అంటుంది. రాహుల్ అర్థం కానట్లు చూస్తే.. ఇప్పుడు ఇంట్లో భోజనాలు ఎవరు చేస్తున్నారు. కావ్య చేస్తుంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే.. అది ఎవరి మీదకు వెళ్తుంది అని రుద్రాణి అంటుంది. కావ్య మీదకు వెళ్తుంది. సూపర్ మామ్. ఇప్పుడే కలిపి ఇస్తాను అని రాహుల్ అంటాడు.

Rudhranis Wicked Plan in October 27th 2023 Episode number 238 in Brahmamudi Telugu Serial

రాత్రి అందరూ భోజనం చేశాక జ్యూస్ ఇవ్వు... తర్వాత మనం డాక్టర్ శ్రీదేవి దగ్గరికి తీసుకెళ్దాం. మనం చెప్పినట్లే ఆమె చేస్తుంది. దీంతో స్వప్న బిడ్డ పీడ విరగడి అవుతుంది అని రుద్రాణి అంటుంది. మరోవైపు కృష్ణుడితో తన బాధ చెప్పుకుంటుంది కావ్య. అబద్ధం చెప్పాను కానీ. ఇప్పుడు అందరి సంతోషాన్ని పోగొట్టాలని లేదు. ఇందులో నన్ను నిందించకూడదు అని మొరపెట్టుకుంటుంది. మరోవైపు అనామిక కోసం కల్యాణ్ వంట వండుతుంటాడు.

నువ్వేందుకు చేస్తున్నావ్... అనామికకు రాదా అని అడుగుతుంది అప్పు. అనామిక వచ్చి... రాదని చెప్తుంది. మరి పెళ్లయ్యాక అని అప్పు అడిగితే.. అక్కడ పని వాళ్లు ఉంటారు కదా అని చెప్తుంది. ఇంతలో కర్రీ రెడీ అయిందని కల్యాణ్ తీసుకొస్తాడు. అది టేస్టే చేసిన అనామిక అస్సలు బాగోలేదని చెబుతుంది. దీనికి వండటమే ఎక్కువ అంటే.. అని అప్పు లోపల అనుకుంటుంది. దానికి కల్యాణ్ కూడా సరే అంటాడు. వీడిని దేవుడే కాపాడాలని అప్పు అనుకుంటుంది.

మరోవైపు జ్యూస్‌లో అబార్షన్ ట్యాబెట్లు కలిపి ఇస్తుంది రుద్రాణి. దాన్ని తీసుకొచ్చిన స్వప్నను తాగమంటాడు. అది మోసంబి జ్యూస్. నాకు ఇష్టం ఉండదు. నేను తాగను అని స్వప్న అంటుంది. నీకోసం ప్రేమగా చేశాను అని రాహుల్ అంటాడు. స్వప్న తాగను అని చెప్తుండగా.... ఇంతలో కనకం వచ్చి.. బలవంతంగా తాగిస్తుంది. అదంతా చూసిన రుద్రాణి.. కన్నతల్లే కూతురుకి కడుపు పోయేందుకు కారణం అవుతుంది. ఇక డ్రామా మొదలుపెట్టాలి అని అనుకుంటుంది.

Rudhranis Wicked Plan in October 27th 2023 Episode number 238 in Brahmamudi Telugu Serial

గదిలో రాజ్ బామ్ పట్టుకుని ఉంటాడు. అది చూసిన కావ్య.. మళ్లీ నా నడుముకు బామ్ రాస్తారా అని అంటుంది. అంతలేదు... తలనొప్పిగా ఉందని చెప్తాడు. మొన్న నాకు బామ్ రాశారు కదా... నేను మీ తలకు రాస్తును అని చెప్పి... రాజ్ తలకు కావ్య బామ్ రాస్తుంది. దానికి మైమరిచిపోతాడు రాజ్. బామ్ పేరుతో నా నోరు మూయించావంటే నువ్ చాలా డేంజరే అని చెప్పి పడుకుంటాడు. ఇంతలో కరెంట్ పోతుంది. ఫోన్ తీసుకుందామనే క్రమంలో కావ్య నుడుముని రాజ్ ముట్టుకుంటాడు. మీరు కావాలనే టచ్ చేశారని కావ్య అంటుంది.

భార్యగా ఒప్పుకోండి.. నేనే మీ దాన్ని అయిపోతాను అని కావ్య అంటుంది. కాసేపు ఇద్దరు అరుచుకుంటారు. ఇక రాజ్ కావ్య ఇద్దరు పడుకుంటారు. మీరు మారుతున్నారు... ఆ విషయం మీకే తెలియడం లేదు.. నా మనసుకు తెలుస్తుందని కావ్య అనుకుంటుంది. ఇక రాహుల్.. స్వప్నకు ఏం కాలేదని అనుకుంటాడు. ఏమైనా కావాలా అని అడిగితే.. డైమండ్ నెక్లెస్ కావాలి అని స్వప్న అంటుంది. ఇక కాసేపు వాదించుకుంటారు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో రాజ్... కావ్య తల తడుచుకుంటూ ఉంటుండగా వచ్చి హగ్ చేసుకుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X