Brahmamudi October 17th: భార్య కోరికను తీర్చిన రాజ్... దొంగ చాటుగా ఆ పని.. మొత్తానికి ప్రేమలో పడిపోయాడుగా!

కనకం.. దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఇక ప్రతిసారి రుద్రాణి.. కనకంను అవమానిస్తూ ఉంటుంది. ఇక రాజ్.. కనకానికి సపోర్ట్ గా మాట్లాడుతాడు. పర్లేదు రాజ్.. మీ అత్తగారిని బాగానే చూసుకుంటున్నావ్ అని సీతారామయ్య అంటాడు. మీ పెంపకం కదా తాతాయ్య అంటాడు రాజ్. ఇక డైనింగ్ హాల్ లో అందరూ తింటూ ఉంటారు. ఇక కనకం ఎక్కడ పడుకుంటుంది అని ఇందిరా దేవి అడుగుతుంది. రుద్రాణి.. కిచెన్ ఖాళీగానే ఉందని సలహా ఇస్తుంది. ధాన్యలక్ష్మి ... నీ రూమ్ లో ఒక్కదానివే కదా.. కనకం రుద్రాణి రూమ్ లో పడుకుంటుంది అని చెప్తుంది. దానికి రుద్రాణి బలవంతంగా ఒప్పుకుంటుంది.

మరోవైపు కల్యాణ్ ప్రేమలో పడిపోయిన అప్పు.. బాధతో పెద్దమ్మతో చెప్పుకుంటుంది. తనను ఏ ఫీలింగ్స్ లేవంటూ మాట్లాడాడు అంటూ అన్నపూర్ణమ్మతో చెప్పుకుని ఏడుస్తుంది. నా మనసు కల్యాణ్ కు ఎందుకు అర్థం కాలేదు అంటూ బోరున విలపిస్తుంది. మరోవైపు కనకం, రుద్రాణి రూమ్ లో పడుకునేందుకు వస్తుంది. ఆమె కోసం చాప వేస్తే.. నాకు చాప మీద పడుకునే అలవాటు లేదని కనకం చెప్తుంది. ఇక ఇద్దరు కలిసి బెడ్ మీద పడుకుంటారు. కనకం తన భర్తకు కాల్ చేసి మాట్లాడేప్పుడు తనకు ఏసీ పడదు అని చెప్తుంది. ఆ మాట విన్న రుద్రాణి ఓ మాస్టర్ స్కెచ్ వేస్తుంది.

Rudrani bothers Kanakam in October 17th 2023 Episode number 229 in Brahmamudi Telugu Serial

మరోవైపు కావ్య రాజ్ గదిలోకి వస్తుంది. మరోవైపు రాజ్ పనిలో ఉంటాడు. ఇక తనను రాజ్ పట్టించుకోవడం లేదని.. అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా మాట్లాడుతుంది కావ్య. ఏమైంది అని రాజ్ అడుగుతాడు. ఇక కావ్య.. రాజ్ ను ఆటపట్టిస్తూ పంచ్ లు వేస్తుంది.నిన్ను ప‌ట్టించుకోని వాడినైతే మీ అమ్మ‌కు ఎందుకు స‌పోర్ట్ చేస్తాన‌ని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. నాకు అనుమాన‌మేన‌ని కావ్య అంటుంది. అనుమానం తీరాలంటే ఏం చేయాల‌ని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. నాకు కిళ్లీ తినాల‌ని ఉంద‌ని రాజ్‌తో అంటుంది కావ్య.

పాన్ ఆన్‌లైన్‌ లో ఆర్డ‌ర్ పెట్టాల‌ని అనుకుంటాడు రాజ్. కానీ స‌ర్వీస్ అందుబాటులో లేద‌ని క‌నిపిస్తుంది. పెళ్లైనా ఇన్నాళ్ల‌కు తాను మొద‌టిసారి అడిగిన కోరిక కూడా నెర‌వేర్చారా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య‌. కిళ్లీ కొనిచ్చేవ‌ర‌కు రాజ్‌ను ప‌ట్టుప‌డుతుంది కావ్య. కిళ్లీ కొన‌డానికి కావ్య‌ను బైక్‌పై తీసుకొని బ‌య‌ట‌కు వెళ్తాడు రాజ్‌.

Rudrani bothers Kanakam in October 17th 2023 Episode number 229 in Brahmamudi Telugu Serial

మరోవైపు కనకం ఏసీ చలిని తట్టుకోలేకపోతుంది. రుద్రాణి కప్పుకున్న దుప్పటిని లాగుతుంది. అది ఎంతకు రాకపోవడంతో... బీరువాలోంచి రుద్రాణి చీరలను తీసుకుని కప్పుకుంటుంది. మరోవైపు దొంగచాటుగా రాజ్, కావ్య ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం అవుతారు. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో బైక్ పై ఇద్దరు బయటకు వెళ్తారు. రాజ్ ను కావ్య హగ్ చేసుకుని వెళ్తుంది. రాజ్.. కావ్య కోసం పాన్ కట్టిస్తాడు. రాజ్ కోసం కావ్య కూడా ఓ పాన్ కట్టిస్తుంది. ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X