Brahmamudi November 10th: ఆస్తి కోసం రుద్రాణి స్కెచ్... వీలునామా రాయించిన సీతారామయ్య
రుద్రాణి.. సీతారామయ్యను కాక పడుతూ ఉంటుంది. మీరు కనకపోయినా.. నన్ను కన్నకూతురిలా పెంచారు అంటూ సీతారాయ్యతో రుద్రాణి అంటుంది. ఈ ఇంట్లో వాళ్లు నన్ను, నా కొడుకుని ఇంటి పనిమనిషుల్లా చూస్తున్నారు. నువ్వు ఉన్నప్పుడే నాకు, నా కొడుక్కు ఏదో ఒక దారి చూపించు నాన్న అంటూ ఏడుస్తుంది. ఇక ఖాళీ దస్తావేజులు సీతారామయ్య చేతిలో పెట్టి... డ్రామా ప్లే చేస్తుంది. ఇక ఈ విషయాన్ని అంతా ధాన్య లక్ష్మి చూస్తూ ఉంటుంది.
ఇక ఏడుస్తూ గదిలోకి వస్తుంది. అక్కడ రాహుల్ తాగుతూ ఉంటాడు. మామ్ ఏడ్చావా అంటాడు.. లేదు.. జీవించాను అంటుంది రుద్రాణి. ఇక మంచితనం ముసుగు చాలా కష్టం అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక రుద్రాణి కూడా రాహుల్ తో చేరి మందు తాగుతూ ఉంటుంది. జీవితం చిన్నది.. ఉన్నప్పుడే అన్ని చూసేయాలి అంటూ రాహుల్ కి హితబోద చేస్తుంది రుద్రాణి. ఇక ఆస్తిలో వాటా రాగానే నేను వరల్డ్ టూర్ వెళ్తాను అంటాడు రాహుల్. అన్ని నిధానంగా చేయాలి అని రుద్రాణి అంటుంది.

ఇక ఇంట్లో వాళ్లకు టీఫిన్లు సిద్ధం చేస్తూ ఉంటుంది కావ్య, ధాన్య లక్ష్మి. ఇక కాసేపు రుద్రాణి అక్కడి వాళ్లతో వాదిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో టీఫిన్ చేద్దాం అనుకునేలోపే లాయర్ వస్తాడు. ఏమైంది ఎందుకు వచ్చారు అంటే... సీతారామయ్య గారు రామన్నారు అని చెప్పాడు. ఇక లాయర్ సీతారామయ్యతో మాట్లాడేందుకు వెళ్తాడు. ఏ పని అని ఎవరూ అడిగినా.. వారినే అడగండి అంటాడు. దీంతో సీతారామయ్య గదికి లాయర్ వెెళ్తాడు. ఇక అక్కడ ఉన్న ఇందిరాదేవిని బయటకు పంపించి.. లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రుద్రాణి.. రాత్రి యాక్టింగ్ కు కరిగిపోయి లాయర్ ను పిలిపించి ఉంటాడు అని రాహుల్ తో అంటుంది.
ఇక ఇందిరాదేవి గదిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఏమైంది అమ్మా అంటూ ప్రకాశం అడుగుతాడు. నాకేం తెలుసు అని చెప్తుంది. నువ్వేందుకు వచ్చావ్ అని అడిగితే.. నేను ఎక్కడ వచ్చాను వెళ్లమన్నాడు అని చెప్తుంది ఇందిరాదేవి. ఇక గదిలో లాయర్ తో వీలునామా రాయిస్తాడు సీతారామయ్య. నేను చెప్పినట్లుగా వీలునామా రాయండి అంటాడు. ఇక వీలునామా చేసి తీసుకువస్తా అని లాయర్ బయటకు వెళ్లిపోతారు.

ఇక సుభాష్ తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక టీ తీసుకుని సుభాష్ కు ఇస్తుంది ధాన్య లక్ష్మి. ఇక ధాన్య లక్ష్మి మాట్లాడుతూ... రుద్రాణి అన్న మాట నిజమై నిజంగా ఆస్తుల పంపకం గురించే లాయర్ ను పిలిపించారేమో. ఇక ఆస్తి పంపకాల్లో కల్యాణ్ కు అన్యాయం చేస్తే అని అడుగుతుంది. రాజ్.. కల్యాణ్ కు అన్యాయం చేయడు అని సుభాష్ చెప్తుంది. నాన్న ఏ వీలునామా రాసిన మేం గౌరవిస్తాం అంటాడు సుభాష్.
ఇక అపర్ణ సీతారామయ్య గారితో మాట్లాడేందుకు గదిలోకి వస్తుంది. రుద్రాణి ఏవో పేపర్లు పట్టుకుని వచ్చిందంట.. నిజమేనా అంటే.. అవును అంటాడు సీతారామయ్య. నువ్వు ఊహించిందే అంటూ చెప్తాడు. ఇక మీరు లాయర్ తో వీలు నామా రాయిస్తే కనుక...దాన్ని విరమించుకోండి. ఎందుకంటే.. రుద్రాణి, రాహుల్ ఖర్చు పెట్టడమే తప్ప.. కాపాడుకోవడం రాదు అంటుంది అపర్ణ. ఇక ఇల్లు చీలిపోకుండా నేను చూసుకుంటాను అని మాట ఇచ్చి వెళ్తుంది. ఇక సీతారామయ్య కూడా తీవ్ర ఆలోచనలో పడిపోతాడు.
మరోవైపు గదిలో రాజ్.. తాతాయ్య ఆరోగ్యం ఫోన్లో గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక కావ్య భోజనం ప్లేట్ తీసుకుని వస్తుంది. ఇక మళ్లీ టామ్ అండ్ జెర్రీలా మాట్లాడుకుంటారు. మోసం చేసినా న్యాయం చేయాలనుకునే మా వంశం మాది అని రాజ్ అంటాడు. తినండి అని చెప్తుంది కావ్య. తినను అని చెప్తాడు రాజ్. నువ్వు చేసింది నేను తినను అని రాజ్ అంటాడు. నా మీద కోపం అన్నం మీద వద్దు తినండి అంటుంది కావ్య. తినను అని చెప్తున్నా కదా అంటాడు. ఇక ఇక్కడికి ఎపోసోడ్ ముగుస్తుంది.
తదుపరి ఎపిసోడ్ లో సీతారామయ్య.. లాయర్ తో వీలునామా రాయిస్తాడు. ఆస్తి పంపకాలు వద్దు అని ఎవరు చెప్పినా.. వినడు సీతారామయ్య. ఇక లాయర్ వీలునామా చదువుతూ ఉండగా.. రాజ్ వచ్చి... ఆ కాగితాన్ని చింపివేస్తాడు. ఇక రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతటితో ఆపేయండి అంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











