Brahmamudi July 11th Episode: రాజ్ గుండెలో ప్రేమ గంటలు... రుద్రాణి స్కెచ్... కారుతో పోలీసును ఢీ కొట్టిన కావ్య
బ్రహ్మముడి సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. దుగ్గిరాల కుటుంబంలో కోడాళ్లుగా కావ్య, స్వప్న అడుగుపెట్టాక.. కథలో మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే సిరీయల్ అసలు కథలోకి వెళ్తోంది. దీనితో బుల్లితెర ప్రేక్షకులు.. ఈ ధారవాహికను మిస్ అవ్వకుండా చూస్తున్నారు. తెలుగు సిరియల్ లో దీనికి అత్యధిక టీఆర్పీ వస్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...
రాజ్ గుండెల్లో ప్రేమ గంటలు:రాజ్ గుండెల్లో ఇప్పుడిప్పుడే ప్రేమ గంటలు మోగుతున్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా... కావ్యపై మంచి అభిప్రాయం ఏర్పడుతోంది. ఇక కావ్య కోసం అకౌంట్ ఓపెన్ చేయించాలని.. రాజ్ తిప్పలు పడుతూ ఉంటాడు. ఇంట్లో అందరూ ఓపెన్ చేయాడానికి హాల్లోకి వస్తారు. ఒక్క కావ్య తప్ప. దీంతో రాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అది గమనించిన ధాన్యలక్ష్మి.. అంతగా వెతక్కు రాజ్.. మీ ఆవిడ గదిలో ఉంది.. నేను వెళ్లి తీసుకుని వస్తానులే అని అంటుంది. దాంతో రాజ్ తెగ ఇబ్బంది పడుతూ.. అంటే పిన్నీ.. మరి అందరితో పాటు తనకి కూడా అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఫీల్ అవుతుంది కదా.. అంతకుమించి ఏమీ లేదు అని నవ్వుతుంటాడు రాజ్.

అకౌంట్ కోసం తిప్పలు...:ఆ తరువాత బ్యాంక్‌కి సంబంధించిన వ్యక్తి.. ఒక్కొక్కర్నీ వాళ్ల వివరాలు అడుగుతాడు. రాహుల్ ను అడిగేసరికి.. నా పేరు రాహుల్.. ఇంటి పేరు లేదు అని అంటాడు. రుద్రాణి కోపంగా చూస్తూ ఉంటుంది. సార్.. ఒక్కటే అప్లికేషన్ ఉంది.. ఇంకెవరూ లేరు కదా అని అంటాడు బ్యాంక్ అసిస్టెంట్. ఈరోజుల్లో కూడా అప్లికేషన్స్ ఏంటయ్యా.. ఆన్ లైన్‌లో చేయొచ్చు కదా? అని అంటాడు రాజ్. సార్.. సర్వర్ డౌన్ ఉంది.. అందుకే నేను రావాల్సి వచ్చిందని అంటాడు. అయితే కావ్యని తీసుకుని రావడం కోసం పైకి వెళ్లిన ధాన్యలక్ష్మి.. కావ్య(కళావతి)తో పాటు స్వప్నని కూడా తీసుకుని వస్తుంది. ఇంతలో బ్యాంక్ అసిస్టెంట్.. సార్ ఒకటే అప్లికేషన్ ఉంది. ఎవరి పేరు రాయాలి? అని అడుగుతాడు.

ధాన్యలక్ష్మి.. కావ్య కోసమే కదా రాజ్ ఇన్ని తిప్పలు పడుతోంది... కావ్య పేరే రాయించండని అంటుంది. కావ్య మాత్రం ఇందులో ఆలోచించడానికి ఏముంది ఆ అకౌంట్ మా అక్క పేరుమీదే ఓపెన్ చేయించండి.. నా దగ్గర బ్యాంకులో దాచేంత డబ్బుల్లేవ్ అని అంటుంది. ఆ మాటతో స్వప్న.. కావ్య కరెక్ట్‌గా చెప్పింది.. మీరు నా డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి అని అంటుంది. ఆ మాటతో రాజ్... నాకు ఈ తింగరబుచ్చి ఎక్కడ దొరికిందో.. ఆ రోజు హాస్పిటర్‌లో డబ్బుల్లేక ఎంత ఇబ్బంది పడింది.. తన కోసం ఇంత చేస్తే అర్ధం చేసుకోదు ఏంటి? అని అనుకుంటాడు.

స్వప్నకు రాహుల్ హితబోధ:అమ్మా త్యాగమూర్తీ ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా... మీ ఆయన నీకోసం ఏర్పాటు చేసిందే.. అలాంటిది నువ్వు వద్దంటావ్ ఏంటీ అని ధాన్యలక్ష్మి అంటుంది. స్వప్నకి బ్యాంక్ అకౌంట్ కావాలంటే.. రాహుల్ బ్యాంక్‌కి తీసుకుని వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయిస్తాడులే అని అంటుంది. రాజ్ కూడా డీటెయిల్స్ చెప్పు అనడంతో కావ్య చెబుతోంది. అలా అకౌంట్ ఓపెన్ చేయిస్తాడు రాజ్. ఇదంతా గమనించిన స్వప్న కోపంగా తన గదిలోకి వెళ్తోంది. అక్కడ రాహుల్ తనను పట్టించుకోనట్టు ఉండగా.. ఫ్లవర్ వాజ్ పగులగొడుతుంది. కావ్యకు ఉన్న గౌరవం, ప్రేమ.. ఈ ఇంట్లో తనకు లేదని కోపంగా అరుస్తుంది. దీనితో రాహుల్.. కావ్య మీ చెల్లెలు.. ముందు ఆమెను కంట్రోల్ లో పెట్టుకో అని సలహా ఇస్తాడు.

వంటగదిలో స్వప్న:సీన్ కట్ చేస్తే.. స్వప్న కిచెన్ లో వంట చేస్తూ ఉండగా.. ధాన్య లక్ష్మి వచ్చి నువ్వెందుకు వండుతున్నావ్ అంటుంది. అసలే కడుపుతో ఉన్నావ్.. వెళ్లి రెస్ట్ తీసుకో అని అంటుంది. నేనేం బరువులు మోయడం లేదు కదా అని అంటుంది. పెద్దోళ్లు అంటే రెస్పెక్ట్ లేదా.. మాటకు మాట సమాధానం చెబుతున్నావ్.. ఏదైనా కావాలంటే కావ్యను అడుగు.. కానీ వంటగదిలో అడుగుపెట్టకు అని చెబుతుంది. ఆఖరుకి వంటగదిలోకి అడుగుపెట్టే హక్కు అధికారం నాకు లేదా అని అంటుంది స్వప్న. అన్నింటికీ కావ్యా కావ్యా అంటారేంటి? అదేమన్నా ఈ ఇంటికి మహారాణా? అని విరుచుకు పడుతుంది స్వప్న. నీకంటే మీ చెల్లి ఈ ఇంటి కోడలు.. ఈ ఇంటికి పెద్ద కోడలు అని అంటుంది ధాన్యలక్ష్మి. దీంతో ప్రతీదీ దాన్ని అడుక్కోవల్సిన కర్మ నాకు పట్టలేదు.. ఛీ అని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

అక్కచెల్లెల్ల మధ్య చిచ్చు:బయట హాలులో అపర్ణ ఉంటుంది. విన్నారా, చూశారా అంటుంది. హా అని అపర్ణ సమాధానమిస్తుంది. నీకు లేని బుర్ర, మీ చెల్లెలికి ఉంది కాబట్టి.. ఆమెకు పెత్తనం ఇచ్చారని అపర్ణ చెబుతుంది. నాకు అర్థం కావడం లేదని స్వప్న అనగా.. నీకు ఏది అనిపిస్తే.. అది అనేస్తావ్ అని, అదే మీ చెల్లెలు అయితే మనసులో ఏది ఉన్నా.. అందరికి గౌరవం ఇచ్చినట్టుగా నటిస్తుంది అపర్ణ చాడీలు చెబుతుంది. ఇంకా అర్థం కాలేదా.. మీ చెల్లెలు ఇంట్లో ఉన్నంత కాలం, నిన్ను ఓ మనిషిగా కూడా చూడరని చెబుతుంది. చూస్తాను, దాన్ని పనిమనిషిలా చూసేలా చేస్తానని అనుకుంటుంది స్వప్న.

పోలీసును ఢీకొట్టిన కావ్య:ఇక కావ్యకు కల్యాణ్ డ్రైవింగ్ క్లాసులు మెుదలుపెడతాడు. గంటలో డ్రైవింగ్ వచ్చేయాలని కావ్య అనగా.. అలా రాదు వదినా అంటాడు కల్యాణ్. మినిమం వారం రోజులు పడుతుందని కల్యాణ్ చెబుతాడు. ఏం వచ్చు అనగా కావ్య ఫన్నీగా మాట్లాడుతుంది. మెుత్తానికి కావ్య కారు స్టార్ట్ చేసి.. నడుపుతుంటే.. ఆపమని కంగారు పడతాడు కల్యాణ్. ముందు ఉన్న పోలీసులను చూపించి.. వారిని కంగారు పెట్టకుండా.. స్మూత్ గా వెళ్లాలని కల్యాణ్ అంటాడు. సరేనని చెప్పి వెళ్లి.. పోలీసుకు కారుతో డ్యాష్ ఇస్తుంది కావ్య. రాజ్ ఆఫీసుకు వస్తాడు, ఇన్ హేయిలర్ తీసి.. చూస్తూ.. కావ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇదే సమయంలో ఓ ఎంప్లాయి వస్తుంది. డిజైన్స్ చూపిస్తుంది. వాటిని చూసిన రాజ్.. సీరియస్ లుక్ ఇస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











