Brahmamudi August 18th: కావ్యను ఇంట్లోంచి మెడ పట్టి బయటకు గెంటేసిన రాజ్... ఉత్కంఠగా ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ లో ఈ రోజు రాజ్ అత్తారింటికి వస్తాడు. ఇక అనుకోని పరిస్థితుల్లో మట్టి తొక్కాల్సి వస్తుంది. కావ్యతో కలిసి మట్టి తొక్కుతాడు. దీన్ని వీడియో, ఫోటోలు తీసి.. రాహుల్ కు పంపిస్తాడు ఓ వ్యక్తి. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీలో పెద్ద సునామీ సృష్టిస్తోంది రుద్రాణి. అపర్ణ, కావ్యల మధ్య మాటల యుద్ధం జరగ్గా.. రాజ్ వచ్చి.. కావ్యను కొట్టబోతాడు. ఇక పూర్తి ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే....
అత్తారింటికి కావ్యతో కలిసి రాజ్ వస్తాడు. ఇక అనుకోని పరిస్థితుల్లో.. రాజ్ మట్టిలో కాల్ వేస్తాడు. మూర్తి, కనకం వచ్చి పొరబాటున కాలుపెట్టారా బాబు అని అడుగుతారు. లేదమ్మా.. ఏదైనా మంచి చేయాలంటే.. మావారితోనే చేయిస్తారని కావ్య చెబుతుంది. ఇక రాజ్ తో మట్టి తొక్కిస్తుంది. కనకం మాట్లాడుతూ.. నువ్వు కూడా అల్లుడిగారితో మట్టి తొక్కు అంటూ చెప్తుంది. దీంతో కావ్య కూడా రాజ్ తో కలిసి మట్టి తొక్కుతుంది. కాసేపు వీళ్ల మధ్య మంచి రొమాంటిక్ సీన్ అయితే నడుస్తుంది. చూడ ముచ్చటగా ఉన్నారు అని కనకం, మూర్తి మురిసిపోతూంటారు. అయితే ఈ సీన్ ను అక్కడ ఓ వ్యక్తి వీడియో, ఫోటోలు తీస్తాడు.

ఇక కట్ చేస్తే.. కల్యాణ్.. అనామిక కోసం.. కవితలు రాస్తూ కూర్చొంటాడు. పేపర్స్ మీద రాస్తూ.. పారేస్తూ.. కవితలు రాస్తాడు. అయితే అక్కడికి పేపర్లు వేరుకునే వ్యక్తి వచ్చి.. ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసకుంటాడు. అతను అనామిక పంపించిన వ్యక్తి. ఇక అతనికి పాపం అని కల్యాణ్ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఆ వ్యక్తి కాగితాలు తెచ్చాను అనామికకు చెప్పాడు. ఇక ఆమె కాగితాలు డిక్కిలో పెట్టు అని చెబుతుంది.
మరోవైపు రాహుల్ ఫోన్ మాట్లాడుండగా.. కావ్య, రాజ్ ల వీడియో తీసిన వ్యక్తి కాల్ చేస్తాడు. ఏంటి కాల్ చేశావ్ అని ఆ వ్యక్తిని అడగ్గా.. మీకు గుడ్ న్యూస్ పంపించాను చూడండి అని అంటాడు. రాజ్ మట్టి తొక్కుతున్న ఫొటో చూసి సంబుర పడిపోతాడు. అప్పుడే వచ్చిన రుద్రాణి కూడా వాట్ రాజ్ మట్టి తొక్కుతున్నాడా అంటుంది. సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేయమని, నువ్ బయట తుపాను పుట్టిస్తే.. నేను ఇంట్లో సునామీ పుట్టిస్తానని చెబుతుంది.
కావ్యను పుట్టింటిలో వదిలేసి.. రాజ్ కారులో వెళ్తుంటాడు. సడెన్ గా అతని ఆత్మ వచ్చి.. మాట్లాడుతుంది. నన్ను ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉంచుతావ్ రా.. త్వరలో కావ్యతో మింగిల్ అవ్వు అని సలహా ఇస్తాడు. చచ్చినా అవ్వను.. అని చెప్తాడు రాజ్. నన్ను ఇలాగే ఉంచుతావా... చిన్నప్పుటి నుంచి ఇలాగే చేస్తున్నావ్.. కనీసం పెళ్లాయ్యాక మారుతావ్ అనుకున్నా.. అని చెబుతాడు రాజ్ ఆత్మ. ఇష్టం ఉండాలి కదా.. అని రాజ్ అంటాడు. నువ్ కళావతి.. మింగిల్ అవ్వాలిరా అంటుంది అంతరాత్మ. నువ్ ఎలాగైనా చావు.. నేను కూడా తనను భార్యగా అంగీకరించాలేనని చెబుతాడు రాజ్. అది చూస్తానని అంతరాత్మ చెబుతుంది.

కావ్యను మూర్తి పిలుస్తాడు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇంటికి వెళ్లమని చెబుతాడు మూర్తి. ఈరోజు ఇంకా పూర్తి చేయాల్సిన పని ఉందని అంటుంది. అదంతా కుదరదని ఇప్పుడు వెళ్లమని అప్పు వార్నింగ్ ఇస్తుంది. నీకోసం ఆటో కూడా తీసుకొచ్చానని అంటుంది. కల్యాణ్ రాసి విసిరేసిన పేపర్స్ అన్నీ అనామిక.. పెట్టుకుని ఒక్కొక్కటి చూస్తుంది. వాటని చదువుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి చదువుతూ నవ్వుకుంటూ ఉంటుంది.
అపర్ణ ఫోన్లో మాట్లాడుతుంటే రుద్రాణి వస్తుంది. ఫోన్ మాట్లాడుతుంటే.. నిలబడి చూస్తావేంటని సీరియస్ అవుతుంది అపర్ణ. ఎప్పుడైనా రాజ్ మట్టితొక్కుతూ.. విగ్రహాలకు రంగులు వేయడం చూశావా అని ప్రశ్నిస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సీరియస్ అవుతుండగా.. రాజ్ మట్టితొక్కుతున్న ఫొటో చూపిస్తుంది. దీంతో అపర్ణ షాక్ అవుతుంది. ఇప్పుడు నమ్ముతావా వదినా అని అంటాడు. కావ్య.. రాజ్ ను గుప్పిట్లో పెట్టుకుని ఏం చేస్తుందో చూడు అని రెచ్చగొడుతుంది. ఇక ఈరోజుకు సీరియల్ ముగుస్తోంది.
తర్వాతి ఎపిసోడ్లో కావ్య మీద రాజ్ సీరియస్ అవుతాడు. మా అమ్మను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతావా.. నువ్ ఎంత నీ స్థాయి ఎంత అని అంటాడు. కావ్యను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నేను ఎక్కడకు వెళ్లను ఇక్కడే ఉంటానని చెబుతుంది కావ్య. వర్షంలో అలానే ఇంటి బయట నిల్చుంటుంది. కట్టుకున్న భార్యని చీకట్లో వర్షంలో గెంటేయడం తప్పు అని రాజ్ తో కల్యాణ్ చెబుతాడు. ఇంటి బయట నిల్చొమని నేను చెప్పలేదని రాజ్ అంటాడు. ఈ విషయం కనకం వాళ్లకు తెలిసి ఆటోలో వస్తారు.


Click it and Unblock the Notifications











