హౌస్‌లో కెవ్వు కేక సాంగ్, విచ్చలవిడిగా చిందులు.. బిగ్ బాస్‌కి ఒళ్ళు మండింది, ఏంచేశాడంటే!
Recommended Video

బిగ్ బాస్ 2 షో ఆసక్తికరంగా కొనసాగుతోంది. వారం గడిచేసరికి ఎలిమినేషన్ కి బలయ్యే సభ్యుడు ఎవరో అని ఆడియన్స్ ఈ షోని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజగా విడుదల చేసిన ప్రోమో నేడు జరగబోయే ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. సభ్యులు హౌస్ లో నిభందనలు పాటించడం లేదు అంటూ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఆగ్రహం ఎవరిపైనో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

కెవ్వు కేక సాంగ్
బిగ్ బాస్ హౌస్ లో సభ్యులంతా సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తేజస్వి, బాబు గోగినేని, గీత మాధురి బాగా హైలైట్ అవుతున్నారు.

విచ్చలవిడిగా చిందులు
సభ్యులంతా గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక సాంగ్ కు విచ్చల విడిగా చిందులు వేస్తున్న దృశ్యాలు ఈ ప్రోమోలో చూపించారు. తేజస్వి, దీప్తి సునైనా, మరికొంతమంది సభ్యులు విచ్చలవిడిగా సాంగ్ కు చిందులు వేస్తున్నారు.

బిగ్ బాస్‌కు ఒళ్ళు మండింది
సభ్యులు హౌస్ లో నిబంధనలు పాటించకపోవడంతో బిగ్ బాస్ కు ఒళ్ళు మండినట్లు ఉంది. సభ్యులు నిబంధనలు పాటించడంలో విఫలం అయ్యారు. బిగ్ బాస్ ఇద్దరిని శిక్షిస్తున్నాడు అంటూ ప్రకటన వెలువడింది.

ఆ ఇద్దరూ ఎవరు
బిగ్ బాస్ శిక్షించిన ఆ ఇద్దరు సభ్యులు ఎవరనే విషయం నేడు జరగబోయే ఎపిసోడ్ లో తెలియనుంది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది.


Click it and Unblock the Notifications











