యాంకర్ ప్రదీప్‌కు ఏమైంది.. అలాంటి వ్యాధితో బాధపడుతున్నాడా? ఇంతకీ ఏం జరిగిందంటే?

బుల్లితెరపై యాంకరింగ్‌లో సుమ ఢీకొట్టే వారు ఎవరైనా ఉన్నారా అంటూ.. అది ఒక్క ప్రదీప్ మాత్రమే. ఢీ షోతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మేల్ యాంకర్‌లో మకుటం లేని మహారాజులా వెలిగిపోతోన్న ప్రదీప్‌పై కొన్ని రోజులుగా వింత వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనే రూమర్స్ ఊపందుకోగా అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 ఢీ షోలో ప్రత్యక్షమైన రవి..

ఢీ షోలో ప్రత్యక్షమైన రవి..

ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సుల కోసం మాత్రమే చూసేవాళ్లు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎప్పుడైతే ప్రదీప్ ఢీ పగ్గాలను చే పట్టాడో.. సుధీర్, రష్మీ జాయిన్ అయ్యారో షో స్వరూపమే మారిపోయింది. వీరికి సరిజోడు అన్నట్లు శేఖర్ మాష్టర్ తోడయ్యాడు. వీరంతా కలిసి చేసే ఫన్ కోసమే ఢీ షోను చూస్తున్నారు.

పంచ్‌లతో అదరగొట్టే ప్రదీప్..

పంచ్‌లతో అదరగొట్టే ప్రదీప్..

సుధీర్, రష్మీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ప్రదీప్ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. సుధీర్‌ను అమాయకుడిని చేసి ఆట పట్టించడంల్ ప్రదీప్ దిట్టా. ఈ త్రయం చేసే కామెడీ బుల్లితెరపై నవ్వుల పూయిస్తుంది. అంతేకాకుండా పండుగలకు ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాల్లోనూ ప్రదీప్ తనదైన శైలిలో ఆకట్టుకుంటాడు.

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా..

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా..

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అంటూ ప్రదీప్ చేసే కార్యక్రమంలో ఎంతో వైరల్ అయింది. సెలెబ్రిటీల రహస్యాలను తెలుసుకుని వారితో సరదాగా ఆడిస్తూ ఉండే ప్రదీప్.. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. వీక్షకులు అభిమానించే తారలతో ముచ్చటిస్తూ.. ఎంతో మంది ఫ్యాన్స్ అభిమానాన్ని మూటగట్టుకున్నాడు ప్రదీప్.

గత కొంతకాలంగా రూమర్స్..

గత కొంతకాలంగా రూమర్స్..

అయితే ప్రదీప్ గత కొన్ని రోజులుగా ఢీ షోలో కనబడటం లేదు, మొన్న దీపావళికి చేసిన స్పెషల్ ప్రోగ్రామ్‌లోనూ కనబడలేదు.. కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షోకూ రావడం లేదు. దీంతో అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎన్నో అనుమానాలు రేకెత్తసాగాయి.

 అరుదైన వ్యాధి అంటూ వార్తలు..

అరుదైన వ్యాధి అంటూ వార్తలు..

ఢీ షోలో రెమ్యూనరేషన్ విషయమై తేడా రావడంతో గుడ్ బై చెప్పాడని, అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్‌లకు రావడం లేదని, అరుదైన వ్యాధితో బాధపడుతున్నందుకే బయటకు రావడం లేదంటూ నానా రకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే దగ్గరి సన్నిహితుల సమాచారం మేరకు అవన్నీ వట్టి రూమర్సే అని తెలుస్తోంది.

షూటింగ్‌లో కాలుకి గాయం..

షూటింగ్‌లో కాలుకి గాయం..

ఇటీవలె ఓ షూటింగ్‌లో ప్రదీప్ కాలికి గాయం అయిందని, అందువల్లే షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటికి మాత్రమే పరిమితమై పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరలోనే షూటింగ్‌లకు హాజరు కానున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X