బిగ్ బాస్2: పచ్చడైపోయిన నూతన్ నాయుడు.. హౌస్‌లో తొక్కిసలాట, ఇష్టం వచ్చినట్లు!
Recommended Video

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో గందరగోళం నెలకొంటోంది. నామినేషన్ ప్రక్రియ కోసం ఇంటి సభ్యులకు తిప్పలు తప్పడం లేదు. రిస్క్ తో కూడుకున్న టాస్క్ లతో హౌస్ మేట్స్ ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే హౌస్ నుంచి నందిని ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పుడు హౌస్ లో ఉన్నవారంతా టైటిల్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.

నామినేషన్
కాగా నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజగా విడుదల చేశారు. ఈ ప్రోమో ద్వారా నేడు ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు విభిన్నమైన టాస్క్ ఇచ్చారు.

పరుగు పందెం
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పరుగు పందేన్ని తలపిస్తోంది. మ్యూజిక్ మొదలు కాగానే ఇంటి సభ్యులంతా బయట గార్డెన్ లో ఉన్న టెంట్ లోకి పరిగెత్తుకుని వెళ్ళాలి. ఎవరు చివరగా వెళితే వారు నామినేట్ అవుతారు.

పచ్చడైపోయిన నూతన్ నాయుడు
ఈ క్రమంలో వేగంగా పరిగెత్తిన నూతన్ నాయుడు టెంటు దగ్గరకు వెళ్లేసరికి బోర్లా పడ్డాడు. అతడిపై వెనక వస్తున్న వారంతా పడిపోవడం, తొక్కుకుని వెల్ళడంతో తొక్కిసలాట జరిగింది. నూతన్ నాయుడుకి గాయాలేమైనా అయ్యాయా అనేది నేటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.
దెబ్బలు తగులుతున్నా
ఇంటి సభ్యులు దెబ్బలు తగులుతున్నా లెక్క చేయకుండా టాస్క్ లు పూర్తి చేస్తున్నారు. గత వారం జరిగిన ఎపిసోడ్ లో దీప్తిని కిందకు దించే ప్రయత్నంలో ఆమె కాలు ఇరుక్కుపోయింది. నొప్పిని భరిస్తూ కూడా ఆమె అలాగే టాస్క్ పూర్తి చేసింది.


Click it and Unblock the Notifications











