twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RX 100 మించి 90ml.. పక్కా మాస్ పాత్రలో కార్తీకేయ

    |

    ఆర్‌.ఎక్స్.100 సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌డి చేసింది. న్యూవేవ్ సినిమాగా, క‌ల్ట్ మూవీగా భారీ విజ‌యాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో ప‌దిలంగా చోటుచేసుకుంది. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్. ఆ సినిమా ద్వారా గొప్ప గుర్తింపు పొందిన హీరో కార్తికేయ‌. ఇప్పుడు మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

    RX 100 fame Karthikeyas 90ml first look released

    తాజా చిత్రం 90ఎంఎల్‌ గురించి నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ ఒక మంచి సినిమా తీస్తే ఇండ‌స్ట్రీలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌర‌వం ఎంత గొప్ప‌గా ద‌క్కుతుందో, బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లు ఎంత సంద‌డిగా ఉంటాయో మాకు ఆర్‌.ఎక్స్.100 ద్వారా తెలిసింది. గ‌తేడాది జూలై 12న మా ఆర్‌.ఎక్స్.100ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం.మా చిత్రం విడుద‌లై ఏడాది గ‌డిచినా ఆర్‌.ఎక్స్.100లాంటి సినిమా అంటూ... సినీ ప్రియులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌నూ దోచుకున్న చిత్ర‌మది. ఈ చిత్రంతో మా హీరో కార్తికేయ‌కు బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఈ ఏడాదిలో ఆయ‌న వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రానికి 90ఎంఎల్‌అని పేరు పెట్టాం. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్ప‌టికి 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి కొత్త‌వాడైనా బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. మా బ్యాన‌ర్ నుంచి వ‌చ్చే చిత్రాలు ఏవైనా స‌రే ఆర్‌.ఎక్స్.100 విజ‌యప‌రంప‌ర‌ను కొన‌సాగించేవే అయి ఉంటాయి అని అన్నారు.

    RX 100 fame Karthikeyas 90ml first look released

    ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ కార్తికేయ అన‌గానే ఎవ‌రికైనా ఆర్‌.ఎక్స్.100 గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఎంతో మందికి ఆ సినిమా ఓ రెఫ‌రెన్స్ గా మిగిలింది. వాట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంత‌కుమించి ఉండేలా 90 ఎంఎల్‌ క‌థ రాసుకున్నాను. పూర్తి స్థాయిలో ఎంట‌ర్‌టైన్ చేసే క‌థ ఇది. క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్ మెండుగా ఉంటాయి. 90 ఎంఎల్‌ అని టైటిల్ చెప్ప‌గానే చాలా మంది ఇంట్ర‌స్టింగ్‌ అన్నారు. సినిమా కూడా అంతే ఆస‌క్తిక‌రంగా వ‌స్తోంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మొత్తం ఆరు పాట‌లున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. చంద్ర‌బోస్‌గారు యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా పాట‌లు రాశారు. రంగ‌స్థ‌లం త‌ర్వాత చంద్ర‌బోస్ గారు మ‌ళ్లీ సింగిల్ కార్డు రాసింది మా సినిమాకే. ప్ర‌తి పాటా ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంటుంది.

    ఇటీవ‌ల సైరాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ర‌వికిష‌న్ మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. 90 ఎంఎల్‌ అనే టైటిల్ ఎందుకుపెట్టాం? దాని క‌థాక‌మామీషు ఏంట‌నేది తెర‌మీద చూస్తేనే బావుంటుంది. ఈ నెల 11 నుంచి హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ తెర‌కెక్కిస్తాం. దీని త‌ర్వాత మ‌రో షెడ్యూల్లో బ్యాల‌న్స్ టాకీ, 2 పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. అంత‌టితో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. క‌థ‌, క‌థ‌నం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంటాయి అని అన్నారు.

    న‌టీన‌టులు:
    కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి ప‌రిచ‌యం), ర‌వికిష‌న్‌, రావు ర‌మేశ్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్ , స‌త్య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, అదుర్స్ ర‌ఘు, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, రోల్స్ రిడా, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు

    సాంకేతిక నిపుణులు:

    నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ
    ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర
    సంగీతం: అనూప్ రూబెన్స్
    పాట‌లు: చంద్ర‌బోస్‌
    కెమెరా: జె.యువ‌రాజ్‌
    ఎడిట‌ర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
    ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌
    ఫైట్స్: వెంక‌ట్‌
    నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీ
    కో డైర‌క్ట‌ర్‌: సిద్ధార్థ్ రెడ్డి గూడూరి
    ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. సూర్య నారాయ‌ణ

    English summary
    RX 100 fame Karthikeya's Latest movie is 90ml. Shekhar Reddy is the director and Ashok Reddy Gummamkonda is the producer. This movie unit release first look and title poster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X