Bigg Boss Telugu 7: రేస్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్... కప్ కొడుతాడు అనుకుంటే ఇలా అయ్యిందేంటి?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ గత సీజన్స్ కంటే విభిన్నంగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులకు షాక్, ట్విస్టులు అందిస్తూ.. ఎంటర్ టైన్ చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది. అయితే ఈ టాస్క్ నుంచి పల్లవి ప్రశాంత్ ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే.. ఆసక్తిగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... సామాన్యులను సైతం ఆకర్షిస్తుంది. ఈ షోలో మొదట 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదు వారాలకు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఆరో వారంలో మరో ఉల్టా పుల్టా అంటూ రీ ఎంట్రీ ద్వారా మరో కంటెస్టెంట్ హౌస్ లో అడుగుపెట్టారు.

ఇక ప్రతి వారం ఓ ఉల్టా పుల్టా ట్విస్టు, షాక్ తో బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక గతవారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన నాగార్జున అన్నట్లుగానే అశ్విని, రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ షోలో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా హాట్ హాట్ గా సాగిందని తెలుస్తోంది.
ఈ వారం నామినేషన్స్ లో 7 మంది ఉన్నారని తెలుస్తోంది. శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా సెట్టి ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప.. అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ తర్వాత హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులు మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టికెట్ టు ఫినాలే టాస్కు గెలవాలంటే.. 7 టాస్కులు గెలవాలి.
అయితే మొదటి టాస్కు నిర్వహించగా.. అందులో నుంచి పల్లవి ప్రశాంత్ ఓడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ రియాలిటీ షోలో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. టైటిల్ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ పల్లవి ప్రశాంత్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అయ్యాడు. మొదటి రౌండ్ లో అర్జున్ గెలిచినట్లు తెలుస్తోంది. టికెట్ టు ఫినాలే గెలిస్తే.. డైరెక్ట్ ఫినాలేకి వెళ్లిపోతారు. ఇక పల్లవి ప్రశాంత్ ఈ సారి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఔట్ అవ్వడంతో.. ఆయన ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఇక గ్రాండ్ ఫినాలే విషయానికి వస్తే... డిసెంబర్ 17న రాత్రి 7 గంటలకు జరగనుంది. ఇక సీజన్ 7 కాబట్టి.. టాప్ 7 కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టికెట్ టు ఫినాలే గెలవకపోయినా.. ప్రశాంత్ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











