twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి నా మొదటి పెళ్లాం.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సద్దామ్

    |

    ప్రస్తుతం బొమ్మ అదిరింది షో ఏ రేంజ్‌లో క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదిరింది షోకు వర్షెన్ 2.ఓగా వచ్చిన బొమ్మ అదిరింది షో బ్లాక్ బస్టర్ అయింది. బొమ్మ అదిరింది షోలో చేసిన మార్పులే దీనికి కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదిరిందో షోలో జడ్జ్‌గా ఉన్న నవదీప్, యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీలను పక్కకు జరిపారు. ఆ స్థానంలో యాంకర్‌గా శ్రీముఖి, జడ్జ్‌గా జానీ మాస్టర్‌లను పట్టుకొచ్చారు. అలా అప్పటి నుంచి షో పైపైకి లేస్తూనే ఉంది.

    మొదటి ఎపిసోడ్‌తోనే..

    మొదటి ఎపిసోడ్‌తోనే..

    బొమ్మ అదిరింది మొదటి ఎపిసోడ్‌తోనే షో మొత్తం హైలెట్ అయింది. వైఎస్ జగన్‌లా ఇమిటేట్ చేసిన స్కిట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. జగన్ అభిమానులు ఈ షోపై, జగన్‌లా ఇమిటేట్ చేస్తూ స్కిట్ వేసిన రియాజ్, ఎక్స్ ప్రెస్ హరి, సద్దాంలను ఏకిపారేశారు. నాగబాబును దారుణంగా ట్రోల్ చేసేశారు. నాగబాబు కూడా వాటిని అంతే స్థాయిలో తిప్పి కొట్టారు.

    అప్పటి నుంచి దూసుకెళ్తోంది..

    అప్పటి నుంచి దూసుకెళ్తోంది..

    అలా మొదటి ఎపిసోడ్ ఓ రేంజ్‌లొ క్లిక్ అవ్వడం, ట్రోలింగ్‌తో అందరికీ తెలిసిపోవడంతో అలా షో ప్రతీవారం టాప్‌లో దూసుకుపోతోంది. అయితే ఇందులో స్పెషల్‌గా సద్దాం స్కిట్లకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, మాస్‌కు నచ్చేలా చెప్పే సెటైర్లు బాగా వైరల్ అవుతుంటాయి. ప్రతీసారి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు.

    రాజ్యంలో రాజు..

    రాజ్యంలో రాజు..

    సద్దాం వచ్చే వారంలో కూడా ఓ వెరైటీ స్కిట్ వేయనున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇందులో సద్దాం ఓ రాజులా ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే శ్రీముఖిపై దారుణంగా కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్‌కు శ్రీముఖి మొహం మాడిపోయినట్టు అనిపించింది.

    Recommended Video

    Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
    మొదటి పెళ్లాం..

    మొదటి పెళ్లాం..

    రాజులా ఎంట్రీ ఇచ్చినా సద్దాం.. శ్రీముఖి నా మొదటి భార్య అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో సెటైర్ వేశాడు. ఈశాన్యంలో బరువు ఉండాలని అన్నారు కాబట్టి శ్రీముఖిని చేసుకున్నాను అని శ్రీముఖి ఓవర్ వెయిట్‌పై కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ ప్రోమోలో లైలా ఎంట్రీ, రియాజ్ పర్ఫామెన్స్, సద్దాం పంచులతో బాగానే క్లిక్ అయింది.

    English summary
    Saddam Comments On Sreemukhi In Bomma Adirindhi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X