శ్రీముఖిని అనకూడని మాట అనేసిన తెలంగాణ టైగర్: స్టేజ్ మీదే పరువు పోవడంతో రాములమ్మ అలా!

నటిగా కెరీర్‌ను ఆరంభించి.. యాంకర్‌గా స్థిరపడిపోయింది తెలంగాణ పిల్ల శ్రీముఖి. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టేసిన ఈ బ్యూటీ ఎన్నో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూ సత్తా చాటుతోందీ భామ. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. ఇలా దాదాపు ఐదారేళ్లుగా తన హవాను చూపిస్తోన్న రాములమ్మ.. తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో తెలంగాణ టైగర్ చేసిన పనికి శ్రీముఖి పరువు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే...

శ్రీముఖి కెరీర్ మొదలైందిలా.. బన్నీతో స్టార్ట్

శ్రీముఖి కెరీర్ మొదలైందిలా.. బన్నీతో స్టార్ట్

నటిగా సెటిల్ అవ్వాలన్న లక్ష్యంతో నిజామాబాద్ పిల్ల శ్రీముఖి హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం చూస్తోన్న సమయంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'జులాయి'తో నటిగా పరిచయమైంది. ఆ సినిమాతో ఆకట్టుకుని ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్', 'బాబు బాగా బిజీ' సహా పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించి మెప్పించింది.

క్లీవేజ్ షోతో కాకపుట్టిస్తోంది.. హన్సమాలి పిక్స్ వైరల్

అదుర్స్ నుంచి బొమ్మ అదిరింది వరకు ఇలా

అదుర్స్ నుంచి బొమ్మ అదిరింది వరకు ఇలా


వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే 'అదుర్స్' అనే శ్రీముఖి యాంకర్‌గా మారిపోయింది. అందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఈ ప్రయాణంలో 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది' సహా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా చేసి మెప్పించింది.

ఆ ఒక్క షోతోనే అంతా.. ఫేమస్.. విమర్శలు

ఆ ఒక్క షోతోనే అంతా.. ఫేమస్.. విమర్శలు

సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో షోలను అద్భుతంగా నడిపించింది శ్రీముఖి. అందులో ఎక్కువ గుర్తింపును తెచ్చింది మాత్రం 'పటాస్' షోనే. ఇందులో యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షో వల్లే ఆమెకు రాములమ్మ అనే పేరు కూడా వచ్చింది. ఇందులో వ్యవహరించిన తీరు వల్ల ఆమెపై విమర్శలు రావడంతో పాటు షోను నిషేదించాలన్న టాక్ వచ్చింది.

బిగ్ బాస్ తర్వాత యూటర్న్.. సినిమాలలో

బిగ్ బాస్ తర్వాత యూటర్న్.. సినిమాలలో

తనకు కేవలం స్పైసీ రోల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారన్న కారణంతో సినిమాలకు దూరమైంది శ్రీముఖి. అలాంటి సమయంలోనే బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన ఆమె రన్నరప్‌గా నిలిచింది. అయినప్పటికీ వరు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ చిత్రంలోనూ చాన్స్ పట్టేసింది.

అందులోనే ఎప్పుడూ.. రచ్చ చేస్తున్న భామ

అందులోనే ఎప్పుడూ.. రచ్చ చేస్తున్న భామ


వరుస షోలు.. సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్‌లోని విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోందామె.

శ్రీముఖిని అనకూడని మాట అనేసిన సద్దాం

శ్రీముఖిని అనకూడని మాట అనేసిన సద్దాం


జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట' అనే స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. దీనికి ఆ ఛానెల్‌లో పని చేస్తున్న నటీనటులతో పాటు కమెడియన్లు, సింగర్లు హాజరయ్యారు. ఎంతో సందడిగా సాగిన ఈ కార్యక్రమాన్ని శ్రీముఖి హోస్ట్ చేసింది. ఇందులో భాగంగానే కమెడియన్ సద్దాం ఆమెను అనకూడని మాట అనేసి పరువు తీశాడు.

స్టేజ్ మీదే పరువు పోవడంతో రాములమ్మకు

స్టేజ్ మీదే పరువు పోవడంతో రాములమ్మకు

'జీ తెలుగు వారి పాట సరదా సయ్యాట' ఈవెంట్‌లో కమెడియన్ సద్దాం హుస్సేన్ 'తెలంగాణ టైగర్' అనే పేరుతో స్టేజ్ పైకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ కుర్రాడు వచ్చి అతడి కాళ్లపై పడ్డాడు. అప్పుడు సద్దాం 'మీ ఇంటికి వస్తా. గొర్రెతో దావత్ చేద్దాం. వెనకాల బర్రె ఉంది. సక్కగా పో' అని శ్రీముఖిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీంతో పరువు పోవడంతో ఆమె ముఖం తేలేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X