ఆ స్టార్ హీరోతో ఎఫైర్, మంచు మనోజ్ ర్యాగింగ్ : ఎన్టీఆర్, బాలయ్య గురించి ఓపెన్ అయిపోయిన సదా!
జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా ఆ తర్వాత తెలుగులో చాలా మంది టాప్ హీరోలతో నటించింది. అలాగే తమిళంలో అవకాశాలు రావడంతో అక్కడ కూడా ఆమె అనేక హిట్ సినిమాల్లో భాగమైంది. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ భామ తన సినీ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

జయం సినిమాతో
తెలుగులో జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సదా ఆ తర్వాత ప్రాణం, నాగా, దొంగ దొంగది, లీలామహల్ సెంటర్, ఔనన్నా- కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, మైత్రీ, యమలీల 2 లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా టార్చ్ లైట్ అనే తమిళ సినిమాలో వేశ్య పాత్రలో నటించగా ఆ సినిమాను తెలుగులోకి కూడా అనువదించారు.

ఆయనతో ఎఫైర్
తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ భామ తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న మాధవన్ తో వరుసగా మూడు సినిమాలు చేయడంతో ఆయన తో ఎఫైర్ ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేది అని చెప్పుకొచ్చింది.. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్ కావడంతో తాను వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది.

మంచు మనోజ్ ర్యాగింగ్
ఇక మంచు మనోజ్ ర్యాగింగ్ గురించి చెప్పుకొస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ షూటింగ్ సమయంలో తనను బాగా ఏడిపించే వాడని ఆమె చెప్పుకొచ్చింది. అప్పటిదాకా రాగింగ్ అంటే ఎలా ఉంటుందో తెలియని తనకు మంచు మనోజ్ ర్యాగింగ్ చేసి ఒక రకంగా చుక్కలు చూపించాడు అని చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్లో ఉండగానే ఎప్పుడూ తనను ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు అని ఆమె పేర్కొంది

ఆయనతో కష్టమే
ఇక నాగ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఈ భామ వీరభద్ర సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది. నాగ సినిమా విశేషాల గురించి చెబుతూ ఎన్టీఆర్ లాంటి డాన్సర్ ని తాను ఇప్పటిదాకా చూడలేదని ఎలాంటి కష్టమైన మూమెంట్స్ ఇచ్చినా సరే ఎన్టీఆర్ చాలా ఈజ్ తో వాటిని చేస్తారని చెప్పుకు వచ్చింది. ఆయనతో కలిసి డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను అని ఆమె పేర్కొంది.

బాలయ్య చిన్నపిల్లాడు
ఇక వీరభద్ర సినిమా లో బాలయ్య బాబుతో కలిసి నటించడం గురించి ఆమె మాట్లాడుతూ ఆయన సెట్లో ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడు లానే ఉంటారు అని చెప్పుకొచ్చింది. సెట్స్ తో పాటు బయట కనిపించినా సరే చాలా యాక్టివ్ గా కనిపిస్తారని ఒకరకంగా బాలకృష్ణ అంటే ఎనర్జీకి మారుపేరు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతానికి రిలీజ్ అయింది ప్రోమో కాగా పూర్తి ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











