పవర్‌ఫుల్ ప్రీ లుక్.. సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే'
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న సినిమా 'ప్రతిరోజూ పండగే'. బన్నీవాస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్‌లో ఇద్దరు వ్యక్తులు ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి కనిపించారు. అయితే ఆ వ్యక్తులెవరనేది చూపించకుండా కేవలం ఆ చేతులనే చూపిస్తూ ఈ లుక్ రిలీజ్ చేశారు. 'వేలు విడవని బంధం' అని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఈ మేరకు రేపు (సెప్టెంబర్ 11) సాయంత్రం 8 గంటలకు చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రీ లుక్కే ఇంత పవర్ ఫుల్‌గా ఉందంటే, ఇక ఫస్ట్ లుక్ ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చూడాలనే కుతూహలం నెలకొంది ప్రేక్షకుల్లో.

ఆసక్తికర కథాంశంతో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఈ స్క్రిప్ట్ పరిశీలించి ఓకే చేశారు. దీంతో చిత్రాన్ని అన్నిహంగులు జోడించి చిరంజీవి అంచనాలను రీచ్ అయ్యేలా నిర్మిస్తున్నారు డైరెక్టర్ మారుతి. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











