ఆ నటితో క్లోజ్‌గా బాయ్‌ఫ్రెండ్.. ప్రియుడి మోసాన్ని లైవ్‌లో బయటపెట్టిన నటి

తెలుగు టెలివిజన్ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు సాయికిరణ్. అన్నయ్య, తండ్రి, పెదనాన్న వంటి పాత్రలు పోషిస్తూ బాగా బిజీ అయ్యారు. అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడైన సాయికిరణ్ తొలుత హీరో అవ్వాలని కలలు కన్నారు. ప్రతిష్టాత్మక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన నువ్వేకావాలిలో సెకండ్ హీరో పాత్రలో నటించారు. నటుడిగానే కాకుండా సింగర్‌గానూ అలరించారు. ఈ సినిమా హిట్ అయినప్పటికీ తరుణ్, రిచాలకు వచ్చినంత పేరు సాయికిరణ్‌ అందుకోలేకపోయారు.

సాయికిరణ్ ఆఫర్లు దక్కించుకున్నా అవన్నీ చిన్నాచితకా పాత్రలే కావడంతో క్లిక్ కాలేకపోయారు. తెలుగుతో పాటు పలు భాషల్లోనూ నటించారు. ఈ దశలో అనుకోకుండా బుల్లితెర నుంచి సాయికిరణ్‌ పిలుపు అందుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు సీరియల్‌లో విష్ణుమూర్తిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలలో పలు సీరియల్స్‌లో నటించి మెప్పించారు. పడమటి సంధ్యా రాగం, కోయిలమ్మ, ఇంటిగుట్టు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే స్టార్ మాలో ప్రసారమైన గుప్పెడంత మనసులో మహేంద్ర పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

Sai Kiran Ram and Jabardasth Emmanuel Fun at Zee Kutumbam Awards Goes Viral

సాయికిరణ్‌కు తొలుత వైష్ణవితో వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే లైఫ్ లీడ్ చేశారు సాయికిరణ్.. అయితే కోయిలమ్మ సీరియల్‌లో తన సహ నటి స్రవంతితో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడారు. ప్రస్తుతం భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సాయికిరణ్ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు.

కాగా.. ఇటీవల జరిగిన జీ కుటుంబం అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న సాయికిరణ్‌.. తన జానకమ్మ సీరియల్‌ టీమ్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా జబర్దస్త్ కమెడియన్, బిగ్‌బాస్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ సరదాగా ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దండాలు అయ్యగారు.. మీ మీద నేను అలిగాను. మీరు ఈ మధ్య జానకమ్మతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నారు. నాకు నచ్చడం లేదు. ప్లీజ్.. మీ కోసమే కదా మా ఆయనని వదిలేసి వచ్చింది అని ఇమ్మాన్యుయేల్ అనడంతో అంతా నవ్వేశారు.

ఆ వెంటనే జానకమ్మ చాలా అందంగా ఉంది.. మా వూళ్లో అందరూ నన్ను జూనియర్ జానకమ్మ అంటూ ఉంటారు. మేమిద్దరం సేమ్ టూ సేమ్ ట్విన్స్‌‌లా ఉంటాం. అసలు సాయికిరణ్‌ను చూస్తుంటే నా మనసులో అదోలా ఉంది అంటూ ముద్దు పెట్టేశాడు ఇమ్మాన్యుయేల్. దాంతో ముద్దు పెట్టేశాడే అంటూ సాయికిరణ్ షాక్ అయ్యాడు. ఒక్క దానికే ఇలా అయిపోతే ఎలా.. మొత్తం 40 అవార్డులు.. అవార్డుకు ఒక్క ముద్దు చొప్పున, 40 అవార్డులకు 40 ముద్దులు పెట్టేస్తానని చెబుతాడు ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అయితే జీ సినీ కుటుంబ అవార్డుల్లో ఏ సీరియల్‌కు, ఏ నటుడు అవార్డ్ అందుకున్నారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: jabardasth emmanuel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X