శానిటైజర్ తాగి ప్రాణాలు తీసుకోవాలనుకున్న సాయి కుమార్.. ఆ కష్టం ఎవరికీ రాకూడదు!!

డైలాగ్ కింగ్ సాయి కుమార్‌కు అతిపెద్ద కష్టం వచ్చింది. తాను హోస్ట్‌గా నిర్వహించే వావ్ మూడో సీజన్ ప్రోగ్రాం దుమ్ములేపుతోన్న సంగతి తెలిసిందే. అనసూయ, హైపర్ ఆది, సుమ, రవి వంటి వారితో షోను గట్టిగానే ప్రారంభించాడు. మొదటి రెండు ఎపిసోడ్‌లు, వాటి ప్రోమోలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఓ ప్రోమోను వదిలారు. ఇందులో అందరూ లేడీ ఆర్టిస్ట్‌లే. ఇక వీరి ప్రతిభను చూసి సాయి కుమార్‌కు పిచ్చెక్కినట్టైంది. ఒకానొక దశలో శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేంత పని చేశాడు. అంతలా సాయి కుమార్‌ను భయపెట్టిన వీరి సంగతేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
 కొందరు సెలెబ్రిటీలు అంతే..

కొందరు సెలెబ్రిటీలు అంతే..

సెలెబ్రిటీలకు వారిదే ఓ లోకం. వారి ప్రపంచంలోనే వారు బతుకుతుంటారు. బయట జరిగే విషయాలపై అందరికీ అంత అవగాహన ఉండదు. అంత జనరల్ నాలెడ్జ్ ఉండదు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు మనమంతా ప్రత్యక్షంగా చూశాం కూడా. మనవాళ్లే అని కాదు దాదాపు అన్ని భాషలకు చెందిన సెలెబ్రిటీల్లో జనరల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే.

అలియా అలా..

అలియా అలా..

ఓ సారి అలియా భట్ కరణ్ షోలో పాల్గొంది. అందుకే మన దేశ ప్రధాని ఎవరంటే కూడా చెప్పలేకపోయింది. ఇక ఓ సారి సానియ మీర్జా వైఎస్సార్ పూర్తి పేరును చెప్పలేకపోయింది. ఇలా మన రాష్ట్ర రాజధానులు, ముఖ్యమంత్రులు, దేశాలు వాటి క్యాపిటల్స్ ఇలాంటివన్నీ వారికి తెలియవు.

తాజగా ఇలాంటి వారే..

తాజగా ఇలాంటి వారే..

తాజాగా సాయి కుమార్ వావ్ 3 షోలోనూ ఇలాంటి వారే ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఖండానికి, దేశానికి కూడా తేడా తెలియడం లేదు. కనీసం కర్ణాటక రాష్ట్ర రాజధాని అంటే ఏంటో కూడా చెప్పలేకపోయారు. వీరి జ్ఞాన సంపదను చూసిన సాయి కుమార్ దెబ్బకు షాక్ అయ్యాడు.

శానిటైజర్ తాగి..

శానిటైజర్ తాగి..

వచ్చే వారం వావ్ 3 షోలో వందన, ఖుషీ, ప్రియాంక, సాధన పాల్గోన్నారు. వీరి తెలివికి సాయి కుమార్ ఖంగుతిన్నాడు. కర్ణాటక క్యాపిటల్ ఏంటమ్మా అని అడగడంతో తెలియదు సార్ అని సమాధానం ఇచ్చింది. ఇక వెంటనే కర్ణాటకలో పోలీస్ స్టోరీ అనే సినిమా వచ్చింది అందులో హీరో ఎవరు అని సాయి కుమార్ అడగడంతో మళ్లీ ఆలోచనలో పడింది సదరు అమ్మాయి. దీంతో శానిటైజర్ తీసుకుని తాగి చనిపోతా అన్నట్టుగా మూత తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

 అవి కూడా తెలియలేదు..

అవి కూడా తెలియలేదు..

ప్రపంచం మొత్తం మీద o (ఓ) అక్షరంతో ప్రారంభమయ్యే దేశమేది అని అడిగాడు సాయి కుమార్. వెంటనే ఓ అమ్మాయి ఒంగోలు అని సమాధానం ఇచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రపంచం మొత్తం మీద ప్రభుత్వమే లేని ఖండం ఏది అని ప్రశ్నించగా.. వెంటనే ఒడిశా అని ఆన్సర్ ఇచ్చారు. దీంతో సాయి కుమార్ ఒక్కసారిగా తన గుండెపై చేయి వేసుకున్నాడు. మొత్తానికి వీరి సమాధానాలు తెగ వైరల్ అవుతున్నాయి. సాయి కుమార్‌కు వచ్చిన ఈ కష్టం ఎవ్వరికీ రాకూడదని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X