Bigg Boss Buzzz:‘ బిగ్‌బాస్‌లో అందరూ కట్టప్పలే.. ఆమె వెన్నుపోటుతోనే: సాయి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్

Sai srinivas Bigg Boss Buzzz Interview: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి చేరుకుంటుంది. ప్రతి వారం కొత్త ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ, ఈసారి మాత్రం డబుల్ ఎలిమినేషన్‌తో షోలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రాము రాథోడ్ స్వయంగా హౌస్‌కి గుడ్‌బై చెబితే, ఆదివారం ఎపిసోడ్‌లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ కావడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాయి శ్రీనివాస్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంటర్వ్యూ మొదలైన వెంటనే హోస్ట్ శివాజీ తనదైన స్టైల్‌లో సాయిని స్వాగతించాడు. "ఉన్నాడు ఇతను ఉన్నాడు సాయిరాం... తృప్తిగా ఉంది నాయనా" అంటూ సరదా పంచ్‌లతో ప్రారంభించాడు. ప్రేక్షకులను నవ్విస్తూ హాట్ సీట్ లాంటి సోఫాలో కూర్చోబెట్టి అసలైన ప్రశ్నల దాడి మొదలుపెట్టాడు. "నువ్వు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నీకు పాజిటివ్‌గా అనిపించిందా? నెగటివ్‌గా అనిపించిందా?" అని అడగగా, సాయి ప్రశాంతంగా "నేను కనిపించి, కనిపించకుండా ఉన్నాను కాబట్టి పాజిటివ్ 50%, నెగటివ్ 50%" అంటూ బ్యాలెన్స్‌డ్ సమాధానం ఇచ్చాడు. దానికి శివాజీ "అసలేం కాలేదు కదా?" అంటూ చమత్కరించగా సాయి "అవునా?" అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

Sai Srinivas Bigg Boss Buzzz Interview His Says Everyone is Kattappa Comment Goes Viral

తర్వాత శివాజీ సరదాగా "నీ అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్‌కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు" అని అన్నాడు. ఆశ్చర్యపోయిన సాయి "ఎందుకు?" అని అడగగా, శివాజీ "నువ్వు ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు కాబట్టి ఫ్రెష్ కాండిడేట్‌గా తీసుకుంటారు" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు. స్టూడియో మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. ఆ తర్వాత సాయి "మీరు హౌస్‌లో ఉన్నప్పుడు సిట్యుయేషన్ వేరు, ఇప్పుడు వేరు. కానీ మీరు ఆడిన విధానం మాత్రం అద్భుతం" అంటూ శివాజీని పొగిడేందుకు ప్రయత్నించాడు. దానికి శివాజీ "నేనే అందరికీ సూపేస్తాను... నువ్వు నాకు ఆముదం రాస్తున్నావు!" అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.

ఇంటర్వ్యూలో శివాజీ సడన్‌గా సీరియస్ టోన్ తీసుకుంటూ "నువ్వు హౌస్‌లో 'నేను పోరాటానికి వచ్చాను, ప్రాధేయపడ్డానికి కాదు' అన్నావు కదా... ఏ విషయంలో పోరాడావు?" అని అడిగాడు. ఆ ప్రశ్నకు సాయి కాసింత అయోమయంలో పడ్డాడు. శివాజీ వెంటనే "అదేంటి ఆ స్టేట్‌మెంట్‌కి సపోర్ట్ ఏమీ కనిపించలేదు కదా?" అంటూ మరొక సెటైర్ వేసాడు. తర్వాత స్క్రీన్‌పై కొన్ని ఫోటోలు చూపిస్తూ సాయికి టాస్క్ ఇచ్చారు. మొదటగా బాహుబలి సినిమాలోని రాజమాత శివగామి ఫోటో చూపించి "ఇలాంటి క్యారెక్టర్‌తో హౌస్‌లో ఎవరు ఉన్నారు?" అని అడగగా, సాయి "తనుజ మాత్రమే అలాంటి ఫీల్ ఇచ్చింది" అని చెప్పాడు.

తర్వాత కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే సీన్ చూపించి "హౌస్‌లో కట్టప్ప ఎవరు?" అని అడగగా సాయి షాకింగ్‌గా "హౌస్‌లో అందరూ కట్టప్పలే!" అని అన్నాడు. శివాజీ ఆశ్చర్యపడి "ఎవరు ఎవరిని పొడిచారు?" అని అడగగా, సాయి సీరియస్‌గా "రీతు... ఆమె వెన్నుపోటు పొడిచింది కాబట్టే నేను బయట ఉన్నాను" అని చెప్పాడు. ఈ వ్యాఖ్యతో స్టూడియో కాసేపు షాక్ అయ్యింది. సాయి సమాధానం విన్న శివాజీ "సీజన్ 9లో అందరూ కట్టప్పలే అంటున్నాడయ్య మన సాయి" అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో మీమ్‌లా వైరల్ అవుతోంది.

మొత్తానికి ఈ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ సరదాగా, సీరియస్‌గా సాగి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు "బిగ్ బాస్‌లో అవుట్ అయినా, ఇంటర్వ్యూలో విన్నర్‌లా కనిపించాడు సాయి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చి 9వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఈ యువ నటుడు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు అభిమానులు ఆయనకు కొత్త సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. "సాయి కెరీర్ బాగుండాలి... మళ్లీ స్క్రీన్‌పై చూడాలి" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి సాయి శ్రీనివాస్ బజ్ ఇంటర్వ్యూలో చెప్పిన ఒక్క మాట "అందరూ కట్టప్పలే!" ప్రస్తుతం బిగ్ బాస్ 9 సీజన్‌నే కాకుండా, ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X