ట్రాన్స్ జెండర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్.. ఎంత ఖర్చు అయిందో తెలుసా?

జబర్దస్త్‌లో ఆడపాత్రతో ఆకట్టుకొన్న కమెడియన్ సాయి తేజ అమ్మాయిగా మారిపోయిన ఘటన అందరికీ ఆసక్తిని రేకేత్తించింది. ఆడపిల్లగా మారిన తర్వాత తనకు ఎదురైన కష్టాలు అంతా ఇంతా కాదని వెల్లడించారు. అలాగే తనతో కొందరు ప్రవర్తిస్తున్న తీరు బాధకలిగిస్తున్నదని సాయితేజ అలియాస్ ప్రియాంక చెప్పుకొచ్చారు. తాను సాయితేజ నుంచి ప్రియాంకా సింగ్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కారణాలను వెల్లడిస్తూ..

 చిన్నప్పటి నుంచి అలాంటి కోరికలు

చిన్నప్పటి నుంచి అలాంటి కోరికలు

తనకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలతోనే ఎక్కువగా తిరిగే తిరిగేవాడిని. చిన్నతనంలో నేను ఆడపిల్లల బట్టలు వేసుకొని సంతోష పడేవాడిని. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అక్కయ్య చీర, లంగా ఓణి ధరించే వాడిని అని సాయితేజ్ చెప్పుకొంటూ వచ్చారు.

స్వయంగా నిర్ణయం

స్వయంగా నిర్ణయం

ఇక జబర్దస్త్‌లో పేరు వచ్చిన తర్వాత నిజంగా ఆడపిల్లగా మారిపోవాలని అనుకొన్నాను. ఇంట్లో చెబితే ఒప్పుకోరని స్వయంగా నిర్ణయం తీసుకొన్నాను. ఆడపిల్లగా మారిన తర్వాత చాలా నెలలు శారీరకంగా చాలా బాధలు అనుభవించాను. ఆ బాధ మాటల్లో చెప్పలేను అని అన్నారు.

ఇంట్లో వాళ్లకు తెలియకుండా

ఇంట్లో వాళ్లకు తెలియకుండా

నేను ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఇంట్లోకి వాళ్లకు తెలిసింది. మా అమ్మ, నాన్న చాలా రోజులు మాట్లాడలేదు. కుటుంబం నుంచి నన్ను వెలివేసినంత పని చేశారు. చాలా రోజులు వారికి దూరంగా బతకాల్సి వచ్చింది. అయితే నాకు ఇష్టమైన పని చేశాననే సంతృప్తి మిగిలింది అని సాయితేజ ఉరఫ్ ప్రియాంక సింగ్ చెప్పారు.

ఆడపిల్లగా మారడానికి ఎంత ఖర్చంటే

ఆడపిల్లగా మారడానికి ఎంత ఖర్చంటే

ఆడపిల్లగా మారడానికి చాలా డబ్బులే ఖర్చు అయింది. ఎంత అయిందనే విషయాన్ని, సర్జరీ ఎక్కడ చేయించుకొన్నారు అనే ప్రశ్నలు నన్ను అడగవద్దు. నా సంపాదించిన డబ్బులతోనే నేను ట్రాన్స్ జెండర్‌గా మారాను. అయితే ట్రాన్స్ జెండర్‌గా మారడానికి లక్షలు ఖర్చు అయ్యాయని మాత్రం చెప్పగలను అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

Recommended Video

Chota.K.Naidu Brother Taken Into Custody By S.R.Nagar Police
దర్శకుడు వేధించారు

దర్శకుడు వేధించారు

ట్రాన్స్ జెండర్‌గా మారిన తర్వాత ఆడవాళ్ల కష్టాలు తెలిసి వచ్చాయి. ఓ సినీ దర్శకుడు రూంకు పిలిచి అసభ్యంగా మాట్లాడారు. నా సినిమాలో ఐటెం సాంగ్ చేస్తావా? అని అడిగితే చేయడానికి సిద్ధం అని అన్నారు. కొందరు ఎక్స్‌పోజింగ్ చేస్తావా? లాంటి ప్రశ్నలు అడిగారు. షూట్ కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుందని, అక్కడే కొన్ని రోజులు గడుపుదామని ఆ దర్శకుడు అదోలా మాట్లాడటం, వేధించడం చేశాడు అని ప్రియాంక చెప్పారు. కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X