బిగ్‌బాస్ హౌస్‌లో సాయిధరమ్ తేజ్, అనుపమ.. సెటైర్లు పేల్చిన తేజు, బావని చూడగానే!

Recommended Video

బిగ్‌బాస్ హౌస్‌లో సాయిధరమ్ తేజ్, అనుపమ.. సెటైర్లు పేల్చిన తేజు, బావని చూడగానే!

నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. 100 రోజుల పాటు ఆడియన్స్ కు వినోదాన్ని పంచనున్న బిగ్ బాస్ హౌస్.. సినిమా ప్రమోషన్లకు అడ్డాగా మారిపోయింది. ఆ మధ్యన జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. దానికి సంబందించి ప్రోమోని విడుదల చేశారు.

బావని చూడగానే

బావని చూడగానే

బిగ్ బాస్ 2 లో తేజస్వి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే తేజస్వి ఎగిరి గంతేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో వీరిద్దరూ బావ మరదళ్ళుగా నటించారు.

నీకు నేనే ఎక్కువ

నీకు నేనే ఎక్కువ

తేజ్ చూడగానే ఎగిరి గంతేసిన తేజస్వి అతడిని కౌగిలించుకుంది. ఈ సందర్భంగా వీరిమధ్య సరదా సంభాషణ జరిగింది. నా బర్త్ డేకి కేక్ కూడా తేవా బావా అని తేజస్వి అడగగా.. నీ పేస్ కు నేనే ఎక్కువ అని తేజు సమాధానం ఇచ్చాడు.

 సెటైర్లు పేల్చిన తేజు

సెటైర్లు పేల్చిన తేజు

బాగా బౌలింగ్ వేస్తున్నావంట ఈ మధ్యన అని సామ్రాట్ ని ఉద్దేశించి తేజు సెటైర్ వేశాడు. రోజు గిటారు నేర్పిస్తున్నారు అని తనీష్ అంటాడు. రోజు నువ్వు వాయిస్తున్నావు కదా అని తేజు కౌంటర్ ఇచ్చాడు. తేజు సెటైర్లకు హౌస్‌లో నవ్వులు విరిశాయి.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

శుక్రవారం జులై 6 న తేజ్ ఐ లవ్ యు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రేమ కథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయిధరమ్ తేజ్, అనుపమ ఈ చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X