మరో న్యూస్ ఛానెల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిత్తిరి సత్తి.. టీవీ9కి గుడ్ బై చెప్పింది అందుకోసం కాదా?
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మొదట సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన బిత్తిరి సత్తి ఆ తరువాత అనూహ్యంగా న్యూస్ ఛానెల్స్ లో బిజీ అయిన విషయం తెలిసిందే. ఇక V6 తీన్మార్ న్యూస్ నుంచి టీవీ9 కి షిఫ్ట్ అయిన సత్తి ఇటీవల ఆ ఛానెల్ కి కూడా రాజీనామా ఇవ్వడంతో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు ఊహించని విదంగా మరో న్యూస్ ఛానెల్ కి ఈ కమెడియన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విబేధాలు రావడంతో..
తీన్మార్ న్యూస్ ద్వారా బిత్తిరి సత్తిగా అందరికి పరిచయమైన చేవెళ్ల రవి నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించాడు. కేవలం నటనతోనే కాకుండా తన గానంతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక V6లో విబేదాలు రావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు టాక్ వచ్చింది. అనంతరం టీవీ9 న్యూస్ ఛానెల్ లో అదే తరహాలో ఇస్మార్ట్ వార్తలు కాన్సెప్ట్ తో అలరించాడు.

రాజీనామా చేసింది అందుకేనా..?
ఇక ఇటీవల ఆ ఛానెల్ కి కూడా గుడ్ బాయ్ చెప్పిన బిత్తిరి సత్తిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. బిగ్ బాస్ కోసమే అతను టీవీ9కి రాజీనామా అందజేశారు అనే విధంగా రూమర్స్ వచ్చాయి. మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్న తెలుగు బిగ్ బాస్ షోలో సత్తి ఫస్ట్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయినట్లు రూమర్స్ వచ్చాయి. దాదాపు రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

సాక్షి న్యూస్ ఛానెల్ కోసం..
అయితే ఇప్పుడు ఉహీంచని విధంగా మరొక న్యూస్ ఛానెల్ తో కొత్త ప్రోగ్రామ్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. సాక్షి టీవీ చానెల్ నుంచి ఆఫర్ రావడంతో సత్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఇతర న్యూస్ ఛానెల్స్ సత్తిని తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

క్లారిటీ ఇవ్వాల్సిందే..
అయితే తనపై వస్తున్న రూమర్స్ పై ఈ కమెడియన్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సత్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే సత్తి వివరణ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక గత ఏడాది సత్తి తుపాకి రాముడు అనే సినిమాలో హీరోగా కనిపించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











