బిగ్ బాస్ 14: వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్ కొత్త రెమ్యునరేషన్.. తగ్గించేశారా ఏంటి?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మారికొన్ని రోజుల్లో బుల్లితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఎంతగానో క్రేజ్ అందుకున్న బిగ్ బాస్ సీజన్ 14పై ఈ సారి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటికే ప్రమోషన్స్ తో హడావుడి మొదలుపెట్టారు. అయితే ఈ సారి రెమ్యునరేషన్ అనుకున్నంత రేంజ్ లో అయితే అందుకోవడం లేదని తెలుస్తోంది.

ఎలాంటి టాస్క్ లు ఇస్తారో?
కరోనా కాలంలో బిగ్ బాస్ కోసమని మొత్తానికి పర్మిషన్స్ అయితే తెచ్చుకుంటున్న నిర్వాహకులు షో కోసం కండిషన్స్ ని ఎలా ఫాలో అవుతారు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముందైతే కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే కంటెస్టెంట్స్ ని హౌజ్ లోపలికి పంపుతారు ఇక ఆ తరువాత ఎలాంటి టాస్క్ లు ఇస్తారో చూడాలి.

రెమ్యునరేషన్ తగ్గించారా?
అసలు మ్యాటర్ లోకి వస్తే.. అక్టోబర్ 4న మొదలు కానున్న హిందీ బిగ్ బాస్ 14కోసం దాదాపు బ్యాక్ గ్రౌండ్ వర్క్ అయితే అయిపోయింది. అయితే ఈ సారి సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఎపిసోడ్ కి 10.25కోట్లు తీసుకోనున్నట్లు టాక్ వచ్చింది. మొదట ఇంతకంటే హై రేంజ్ లో ఉంటుందని రూమర్స్ వచ్చాయి.

సల్మాన్ ఖాన్ ఫామ్ జౌజ్ నుంచే..
ఇక షో కోసం మొత్తంగా 250కోట్ల వరకు ఆదాయాన్ని అందుకొనున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ సారి 12వారాలు మాత్రమే ఉంటుందట. కరోనా వైరస్ తో ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా అత్యంత జాగ్రత్తగా షోను నిర్వహించనున్నారు. ఆల్ మోస్ట్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. ఇక సల్మాన్ ఖాన్ తన ఫామ్ జౌజ్ నుంచే షోను నడిపించే అవకాశం ఉన్నట్లు మరో టాక్ కూడా వస్తోంది.
Recommended Video

కరోనా వైరస్ లేకపోయి ఉంటే..
కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈ సారి బిగ్ బాస్ ద్వారా సల్మాన్ ఖాన్ 400కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉండేదట. పరిస్థితులను అర్థం చేసుకొని సల్మాన్ ఖాన్ కూడా షో నిర్వాహకులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది. ఇక ఈ స్టార్ హీరో నెక్స్ట్ రాధే సినిమాతో బిజీ కానున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











