Bigg Boss 16: కనివిని ఎరుగని రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న సల్మాన్ ఖాన్.. షాకింగ్!

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోలు కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా భారీ స్థాయిలో ఆదాయాన్ని అయితే అందుకుంటున్నారు. రియాలిటీ షోల ద్వారా వారికి వస్తున్న పారితోషికాల గురించి వింటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. సల్మాన్ ఖాన్ అయితే కనీవిని ఎరుగని రేంజ్ లో అయితే పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అతను అడిగిన రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ తో లాభాలు

సల్మాన్ తో లాభాలు

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్ తో ఎలాంటి సినిమా చేసిన కూడా పెట్టిన పెట్టుబడి మొత్తం మొదటి వీకెండ్ లోనే వెనక్కి వచ్చేస్తుంది. ఆ విధంగా అతను ఒక బలమైన మార్కెట్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాతలు మాత్రం గత కొన్ని ఎళ్లుగా పెద్దగా నష్టాలను చూడడం లేదు.

 బిగ్ బాస్ ద్వారా భారీ ఆదాయం

బిగ్ బాస్ ద్వారా భారీ ఆదాయం


ఇక సల్మాన్ ఖాన్ బుల్లితెర ద్వారా కూడా భారీ స్థాయిలో క్రేజ్ అయితే అందుకున్నాడు. బిగ్ బాస్ షో ద్వారా అతనికి ఆదాయం కూడా చాలానే పెరిగింది అని చెప్పాలి. ఒక రెండు మూడు సినిమాలు చేస్తే వచ్చే ఆదాయం.. అతనికి ఒక బిగ్ బాస్ సీజన్ పూర్తి చేస్తే దక్కుతోంది అంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాబోయే బిగ్ బాస్ 16వ సీజన్ కోసం అతను ముందుగానే నిర్వాహకులతో పారితోషకం గురించి చర్చలు జరుపుతున్నాడు.

అడిగినంత ఇస్తున్నారు

అడిగినంత ఇస్తున్నారు

బిగ్బాస్ నిర్వాహకులు అయితే పారితోషికం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ లేకుండా ఆ రియాలిటీ షోకు క్రేజ్ రాదు అని వారికి బాగా తెలుసు. మిగతా స్టార్స్ ఎవరు కూడా ఈ కాంట్రవర్సీ షోను అంతని కంటే బాగా బ్యాలెన్స్ చేయలేరు. అందుకే నిర్వాహకులు అతను ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా వెనక్కి తగ్గకుండా అడిగినంత ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు.

 భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

గతంలో 15వ సీజన్ కోసమే సల్మాన్ ఖాన్ భారీ స్థాయిలో పారితో అందుకున్నాడు. ఒక్కో ఎపిసోడ్ కు అతను దాదాపు 20 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా టాక్ వినిపించింది. ఇక మొత్తంగా ఆ సీజన్ కు అతను 450 కోట్లకు పైగానే ఆదాయం అందుకున్నట్లు సమాచారం. ఒక విధంగా టెలివిజన్ రంగంలో ఇండియా మొత్తంగా చూసుకుంటే అదే అత్యధిక పారితోషికం అని చెప్పవచ్చు.

 ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్?

ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్?


ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 15వ సీజన్ కోసమైతే అంతకంటే ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బిజినెస్ అయితే వేల కోట్లల్లోనే జరుగుతోంది అని.. అందుకే ఈసారి సల్మాన్ ఖాన్ 1000 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగే అవకాశం ఉందట. మొత్తం సీజన్ కు అతను ఆ రేంజ్ లోనే డిమాండ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వాహకులతో అయితే చర్చలు జరుగుతున్నాయట. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X