బుల్లి తెర కాదు ఖరీదైన తెర: ఆ స్టార్ హీరోకు రూ. 78 కోట్ల రెమ్యూనరేషన్!

By Bojja Kumar

టెలివిజన్ రంగాన్ని అంతా బుల్లితెర అని పిలుస్తుంటారు. ఆ పేరుకు తగ్గట్లే తెర చిన్నగా ఉంటుంది, వెండితెరతో పోలిస్తే నటీనటుల రెమ్యూనరేషన్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడు బుల్లితెరపై వచ్చే కొన్ని కార్యక్రమాల బడ్జెట్, అందులో కనిపించే యాంకర్లు, నటుల రెమ్యూనరేషన్ వెండితెరను మించిపోతోంది. వెండితెరకు ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర కార్యక్రమాలు ఎంటర్టెన్మెంట్ అందిస్తుండటం కూడా ఇందుకు ప్రధాన కారణం. తాజాగా ఓ టీవీ షో కోసం సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

 సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ప్రస్తుతం ఇండియన్ సినిమా పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్ సల్మాన్ ఖాన్. కేవలం వెండితెరపై మాత్రమే కాదు, బుల్లితెర కార్యక్రమాలను కూడా హోస్ట్ చేస్తూ రెండు రంగాల్లోనూ బాగా సంపాదిస్తున్నాడు. సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ అందుకునే సల్మాన్.... టీవీ షోల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

 రేటింగ్స్ పెంచుతున్న సల్లూ భాయ్

రేటింగ్స్ పెంచుతున్న సల్లూ భాయ్

సల్మాన్ ఖాన్ క్రేజ్ వల్ల టీవీ షోల టీఆర్పీ రేటింగులు కూడా భారీగా పెరుగుతుండటంతో ఆయా కార్యక్రమాల నిర్వాహకులు కూడా ఆయన డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడానికి వెనకాడటం లేదు.

 మళ్లీ సల్మాన్ ఖాన్ ‘దస్ కా దమ్'

మళ్లీ సల్మాన్ ఖాన్ ‘దస్ కా దమ్'

హిందీలో సూపర్ సక్సెస్‌తో రన్ అవుతున్న ‘బిగ్‌బాస్' రియాల్టీ షో కంటే ముందు సల్మాన్ ఖాన్ ‘దస్ కా దమ్' అనే షో చేశారు. అప్పట్లో ఆయన ఈ షోకు ఫన్ జోడించి సూపర్ హిట్ చేశారు. తర్వాత ‘బిగ్‌బాస్' వైపు వెళ్లిన ఆయన మళ్లీ ‘దస్ కా దమ్' చేయలేదు. తాజాగా ఆయన మళ్లీ ఈ షో చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

 3, 4వ సీజన్లో సల్మాన్ ఖాన్

3, 4వ సీజన్లో సల్మాన్ ఖాన్

‘దస్ కా దమ్' 3వ సీజన్లో చేయడానికి.... వీలైతే నాలుగవ సీజన్ కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ 3వ సీజన్‌కు సంబంధించి అంతా సెట్ అయిపోయింది. 4వ సీజన్ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 షాకింగ్ రెమ్యూనరేషన్

షాకింగ్ రెమ్యూనరేషన్

4వ సీజన్ రెమ్యూనరేషన్ విషయంలో సల్మాన్ ఖాన్ భీష్మించుకుని కూర్చున్నాడని సమాచారం. మొత్తం 26 ఎపిసోడ్లు ఉండే ఈ షోకు ఎపిసోడ్‌కు రూ. 3 కోట్ల చొప్పున డిమాండ్ చేస్తున్నాడట. మొత్తం ఎపిసోడ్లకు కలిపి రూ. 78 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడు.

 ఈ షోను భారీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్

ఈ షోను భారీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్

‘దస్ కా దమ్' సీజన్‌ను నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం స్పెషల్ గా యాప్ కూడా డిజైన్ చేస్తున్నారట. సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం ‘రేస్ 3' షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లడానికి ముందే ‘దస్ కా దమ్' 3వ సీజన్ ప్రోమో చిత్రీకరణలో పాల్గొనబోతున్నారట.

More from Filmibeat

Read more about: salman khan bollywood dus ka dum
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X