దానిని అక్కడ పెట్టుకొంటావా? ఎవరైనా చేయి పెడితే.. నిక్కి తంబోలికి సల్మాన్ క్లాస్
బిగ్‌బాస్ 14 షోలో భాగంగా వారాంతం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులను హెస్ట్ సల్మాన్ ఖాన్ కడిగిపోడేశాడు. ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్ నిక్కి తంబోలిని తీవ్రస్థాయిలో మందలించారు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేనంత విధంగా ఆయన మండిపడ్డారు. తన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మౌనంగా నిలబడిన నిక్కి తంబోలికి ఈ విధంగా క్లాస్ పీకారంటే...

ప్యాంటులో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై
గత వారం బిగ్‌బాస్ షోలో ఓ టాస్క్‌లో భాగంగా నిక్కి తంబోలి తన వద్ద ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ను ప్యాంటులోని లోదుస్తుల్లో దాచుకోవడంపై దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఆమె ఫోటోలు జాతీయ మీడియాతోపాటు ప్రాంతీయ మీడియాలో కూడా పతాక శీర్షికలను ఆకర్షించాయి. నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోశారు.

గేమ్‌లో నిక్కి తంబోలి అలా
రాహుల్ వైద్య అనే కంటెస్టెంట్‌లో గేమ్‌లోకి రాగానే అతడు మాస్క్ చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అతడికి అవకాశం లేకుండా నిక్కి దానిని తన ప్యాంటులో కుక్కేసుకొన్నది. దాంతో అతడు ఆ గేమ్‌ను గెలవడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఆ గేమ్ సందర్భంగా రాహుల్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు అందుకొన్నారు.

నీవు మాస్క్ ఎక్కడ పెట్టుకొన్నావు?
తను క్రియేట్ చేసిన వివాదాన్ని గుర్తు చేస్తూ నిక్కి తంబోలిపై మండిపడ్డారు. నిక్కి.. నీ మాస్క్ ఎక్కడ పెట్టుకొన్నావు? అంటూ సల్మాన్ ఖాన్ అడిగిన ప్రశ్నకు ఆమె కంగుతున్నారు. ఆమె మౌనంగా ఉండిపోవడంతో నీవు ఎక్కడ పెట్టుకొన్నావో చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? చెప్పడానికి కష్టమౌతుందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రాహుల్ అక్కడ చేయిపెడితే.
ప్యాంటులో నీవు మాస్క్ పెట్టుకొన్న తర్వాత నీకు ప్రత్యర్థిగా ఆడుతున్న రాహుల్ స్థానంలో మరొకరు ఉండి.. దానిని అక్కడ చేయిపెట్టి లాగేసుకొంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించావా? అంటూ సల్మాన్ అంటే.. నా మనసులో అప్పుడు అలా తోచింది.. నాకు ఆ సమయంలో అది అనిపించింది. నేను చేశా అంటూ నిక్కి తంబోలి అంటే.. ఇంకా నీవు సమర్థించుకొంటున్నావా అంటూ సల్మాన్ ఖాన్ ప్రశ్నించాడు.

దక్షిణాదిలో హాట్ హీరోయిన్‌గా
చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోయిన్ నిక్కి తంబోలి హిందీ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో వేదికపైన ప్రవేశించినప్పటి నుంచి ఇంట్లోకి చేరే వరకు నిక్కి రచ్చ చేసింది. నేను సింగిల్ అంటూ ఏకంగా సల్మాన్‌కే టెండర్ వేసే ప్రయత్నం చేసింది. ఓ దశలో నిక్కి తంబోలి ధాటికి సల్మాన్ కూడా చిత్తపోయినట్టు కనిపించారు. కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలో బిగ్‌బాస్ అవకాశం వచ్చింది.


Click it and Unblock the Notifications











