బిగ్‌బాస్ హోస్ట్‌గా హీరో తప్పుకొంటారని రూమర్లు.. అక్టోబర్ చివరి వారానికి వాయిదా
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ టెలివిజన్ షోపై ఆసక్తికరమైన విషయాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కరోనావైరస్ కారణంగా ఈ షో ప్రారంభం ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ షోలో సెలబ్రిటీలతోపాటు సాధారణ వ్యక్తులు కూడా ఉంటారని నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్ హిందీ రియాలిటి షోకు సంబంధించి ఇది 14వ సీజన్ కావడం గమనార్హం.
14వ సీజన్‌లో మొత్తం 16 మంది సెలబ్రిటీలు ఉంటారు. అందులో ముగ్గురు సాధారణ వ్యక్తులకు చోటు కల్పించున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ షోను ఆలస్యంగా ప్రారంభించే ఛాన్స్ లేకపోలేదు అని నిర్వాహకులు మీడియాకు వెల్లడించినట్టు సమాచారం. అయితే ఈ షో గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ సారి అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అవ్వొచ్చు అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు మొత్తం 30 మంది సెలబ్రిటీలను షార్ట్ లిస్ట్ చేశారని, అందులో నుంచి 16 మందిని ఎంపిక చేసి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తామని నిర్వాహకులు చెప్పారు. ఇంట్లోకి వెళ్లే ముందు సెలబ్రిటీలకు కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత వారిని లోపలికి పంపుతాం. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకొంటాం. హౌస్‌ను కూడా శానిటైజ్ చేస్తాం అని నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్ 13 విషయానికి వస్తే.. గతేడాది సిద్దార్థ్ శుక్లా విజేతగా నిలిచారు రెండో రన్నరప్‌గా అసిమ్ రియాజ్ ఎంపికయ్యారు.
అయితే బిగ్‌బాస్ షోను సల్మాన్ ఖాన్ తప్పుకొంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన కథనం కూడా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ తన ఫాంహౌస్ పన్వేల్‌లోనే బిగ్‌బాస్ షూట్ చేస్తారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.


Click it and Unblock the Notifications











