దటీజ్ సల్మాన్ ఖాన్.. తాగుడు, డ్రిపెషన్ నుంచి బయటపడిన స్టార్ కమెడియన్‌తో..
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో అవతారం ఎత్తనున్నారు. స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కోసం టెలివిజన్ రియాలిటీ షో కోసం నిర్మాతగా మారనున్నారు. ది కపిల్ శర్మ షో కార్యక్రమంలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. గతకొద్దికాలంగా కపిల్ శర్మ వివాదాల్లో కూరుకుపోవడంతో అత్యంత ప్రజాదరణ పొందిన షో నిలిచిపోయింది. తాజాగా సల్మాన్ చొరవతో ఈ కార్యక్రమం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నది. వివరాల్లోకి వెళితే..

డిప్రెషన్‌లోకి కపిల్
కపిల్ శర్మ హోస్ట్‌గా ది కపిల్ శర్మ షో కే9 ప్రొడక్షన్ సంస్థ రూపొందించేంది. కొన్ని కారణాల వల్ల ఆ షో ఆగిపోయింది. దాంతో కపిల్ శర్మ డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ షోను సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ పునరుద్దరించనున్నది.

మళ్లీ కపిల్ శర్మ షో కోసం
కపిల్ శర్మ షో కోసం ముంబైలోని ఫిల్మ్ సిటీలోని ఎనిమిదో ఫ్లోర్‌లో ఓ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం కొత్తరకమైన అంశాలతో సల్మాన్ ముందుకు వస్తున్నట్టు తెలిసింది.

తాగుడుకు బానిసైన కపిల్
తోటి కమెడియన్‌తో వివాదం కారణంగా కపిల్ శర్మ డిప్రెషన్ గురయ్యాడు. విపరీతమైన మద్యానికి అలవాటు పడి ఆరోగ్యం దెబ్బ తిన్నది. చాలా రోజులపాటు బెంగళూరులోని ఓ ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స పొందాడు. దాంతో మళ్లీ ఆరోగ్యవంతుడిగా మారారు.

నిర్మాతగా సల్మాన్ మద్దతు
కపిల్ శర్మ తిరిగి ఆరోగ్యవంతుడిగా మారిన నేపథ్యంలో సల్మాన్ అతడి కార్యక్రమానికి నిర్మాతగా ఉండాలని అనుకొన్నాడు. దీనికి సంబంధించిన ప్రణాళికను పూర్తిస్థాయిలో సిద్దం చేశారు. మరింత ఉత్తేజంగా ఈ షోను నడిపేందుకు ఓ టీమ్ యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నది.

కపిల్ శర్మ వివాహం
ప్రస్తుతం కపిల్ శర్మకు మంచి రోజులు వస్తున్నాయి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియురాలు గిన్నీ చత్రాత్‌తో డిసెంబర్ 12 వివాహం జరుగనున్నది. వీరి వివాహం జలంధర్‌లో జరుగుతుంది. అలాగే విందు డిసెంబర్ 14న నిర్వహిస్తున్నాం అని కపిల్ మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











