‘20 కోట్ల ఆఫర్ ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లను’
దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోలు ప్రారంభం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యంత ప్రేక్షకాదరణ, టీఆర్పీ రేటింగ్ ఉన్న ఈ రియాలిటీ షో హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మొదలు పెట్టేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా సంస్థ కసరత్తు చేస్తున్నది. ఈ షోలోకి కంటెస్టెంట్ల ఎంపికను వివిధ మార్గాల ద్వారా చర్చల ద్వారా దాదాపు పూర్తి చేసిందనే మాట వినిపిస్తున్నది. అయితే హిందీలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ షో కోసం పలు పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ షోలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను హిందీ నటుడు ఖండించారు. ఆ వార్తల వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ హిందీ వెర్షన్ 19వ సీజన్‌కు ఏర్పాట్లు పూర్తిగా ముగింపు దశకు చేరుకొన్నాయి. ఈ షోకు రికార్డు స్థాయిలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 19 సీజన్లుగా సల్మాన్ ఖాన్ ఒక్కడే ఈ హోస్ట్‌గా వ్యవహరించడం రికార్డుగా మారింది. ఇతర షోలో ఏక కాలంగా ఈ స్థాయిలో హోస్ట్‌గా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ తర్వాత కన్నడ బిగ్‌బాస్‌కు సుదీప్ కిచ్చ అత్యధికంగా హోస్ట్‌గా వ్యవహరించారు.

బిగ్‌బాస్ షోను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షో కోసం టీజర్, ప్రోమోలను రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌తో ప్రమో షూటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 8వ తేదీన , జూలై 11వ తేదీన ప్రోమో షూటింగ్ ఉంటుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ సిద్దమయ్యారు అని నిర్వాహకులు చెప్పారు.
అయితే కంటెస్టెంట్ల ఎంపికపై భారీగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ షోలోకి వస్తున్నాడనే వార్తలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. ఈ షోపై నాకు ఆసక్తి లేదు. ఒకరి జీవితాలను చూపించే షోను పూర్తిగా వ్యతిరేకం. ఇలాంటి షోలోకి నేను వెళ్తున్నానే వార్తల్లో నిజం లేదు అని ఆయన ఖండించారు.
నటుడు రామ్ కుమార్ ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ లాంటి షోలో నేను ఎప్పటికీ పాల్గొనను. వారు 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినా నేను వెళ్లను. ఆ షో నా మనస్తత్వానికి సూట్ కాదు. అలాగని ఆ షోను కించపరచడం లేదు. అది చెడ్డ షో అని చెప్పను. చాలా సక్సెస్‌ఫుల్ షో. నేను యాక్టర్‌ను.. అలాగే ఉండాలని కోరుకొంటాను. ఈ షోలో రియల్ టాలెంట్ బయటకు రాదు అని ఆయన అన్నారు.
నేను ప్రైవేట్ పర్సన్‌ను. ఇలాంటి షోలో కనిపించడం అసౌకర్యంగా ఉంటుంది. బిగ్‌బాస్ షోకు అసలు నేను సూట్ కాను. మీడియాలో వస్తున్న వార్తలపై నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు. ఇలాంటి షోలు నా కోసం కావు. నేను ఇలాంటి షోలో పాల్గొనడానికి పూర్తిగా వ్యతిరేకం అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ది మాంక్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











