బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా సమంత అక్కినేని.. మూడు గంటలపాటు పండగే పండగ

బిగ్‌బాస్ తెలుగు షో కోసం హోస్ట్‌గా మారుతున్నారనే ఊహాగానాల మధ్య సమంత అక్కినేని రియాలిటీ వేదికపైకి ఎక్కారు. దసరా సందర్భంగా స్పెషల్ షోను నిర్వహిస్తున్న సందర్భంగా సమంతను హోస్ట్‌గా తెరపైకి తెచ్చారు. అయితే నాగార్జున హిమాచల్ ప్రదేశ్‌లో బిజీగా ఉండటం కారణంగా ఈ వారాంతంలో నడిచే షోకు దూరమయ్యారు. మామయ్య అందుబాటులో లేకపోవడంతో సమంత ఆ అవకాశాన్ని దక్కించుకొన్నారు.

 Samantha Akkineni as host for Bigg Boss Telugu 4

ఆదివారం రోజున 6 గంటలకు ప్రారంభమయ్యే బిగ్‌బాస్ షోలో సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దాదాపు వారాంతపు ఎపిసోడ్‌ను 3 గంటలపాటు కొనసాగించేలా ప్లాన్ చేశారు. పలు రకాల ఆట, పాటలతో ఎపిసోడ్‌ను పవర్ ప్యాక్‌గా రూపొందించినట్టు సమాచారం.

 Samantha Akkineni as host for Bigg Boss Telugu 4

రంగస్థలం చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత నమస్తే.. గుడ్ ఈవెనింగ్.. ఆదాబ్ మీ నాగార్జున అనగానే.. పక్కనే టెలివిజన్‌లో చూస్తున్న నాగార్జున ఏయ్ ఏయ్ అంటూ సమంతను ఆపాడు. వెంటనే మామయ్య అంటూ.. కోడలు పిల్ల సమంత అక్కినేని అంటూ తన ఎంట్రీని ముగించారు. ఇంటి సభ్యులందరూ సమంతను వేదికపైన చూడగానే షాక్ గురయ్యారు. అరుపులు, కేరింతలతో సంతోషంతో ఊగిపోయారు. తాజా ప్రోమోను బట్టి ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ మామూలు రేంజ్‌లో ఉండటం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X