కార్తికేయ, దివి వద్యాకు సమంత అక్కినేని బంపర్ ఆఫర్.. మామ నాగ్ దారిలోనే కోడలు పిల్ల

దసరా పండుగ నేపథ్యంలో సాగిన మహా ఎపిసోడ్‌లో సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించడం ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఎపిసోడ్‌లో రకరకాల భావోద్వేగాలు వ్యక్తమయ్యాయి. అయితే దసరా పండుగ సందర్భంగా ఎలిమినేషన్ ఉండదని భావించిన ప్రేక్షకులకు దివి వద్యాను ఇంటి నుంచి బయటకు పంపడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దివితో మాట్లాడుతూ సమంత ఆమెకు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏమిటంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
సెలబ్రిటీలను ఆటపట్టించిన సమంత

సెలబ్రిటీలను ఆటపట్టించిన సమంత

బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపైకి వచ్చిన సమంత అక్కినేని హోస్ట్‌‌గా హుందాగా వ్యవహారించారు. మాటలతో బురిడి కొట్టిస్తూ.. కొందరు సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ హంగామా చేసింది. వేదికపైకి వచ్చిన అతిథులు అఖిల్ అక్కినేని, హైపర్ ఆది, పాయల్ రాజ్‌పుత్, కార్తికేయలను ఘనంగా స్వాగతించారు.

దివి ఎలిమినేషన్‌తో సమంత భావోద్వేగం

దివి ఎలిమినేషన్‌తో సమంత భావోద్వేగం

ఇక దసరా పండుగ రోజున దివి ఎలిమినేట్ కావడంపై కొంచెం ఎమోషనల్ అయ్యారు. దివి ఇంటి నుంచి పంపించడం బాధగా ఉందని అన్నారు. అంతేకాకుండా దివిని కూల్ చేసేందుకు ప్రయత్నించారు. వేదికపైకి కార్తీకేయతో వచ్చిన దివితో మాట ముచ్చట పెట్టారు.

కార్తీకేయ మీ మూవీలో మంచి ఆఫర్ ఇవ్వండి

కార్తీకేయ మీ మూవీలో మంచి ఆఫర్ ఇవ్వండి

దివి వద్యా, కార్తికేయతో మాట్లాడుతూ. కార్తికేయ గారు.. దివికి మీ మూవీలో మంచి ఆఫర్ ఇవ్వండి. దివి మంచి టాలెంటెడ్ అంటూ సమంత సూచించింది. దివి గురించి మీరు చెప్పాలా మేడమ్. ఏకంగా మహేష్ బాబుతోనే నటించారు. తప్పకుండా నా సినిమాలో అవకాశం ఇస్తాను అని కార్తికేయ అన్నారు.

కార్తికేయ, దివికి సమంత ఆఫర్

కార్తికేయ, దివికి సమంత ఆఫర్

అయితే ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. మీతో ఓ సినిమా చేసే అవకాశం ఇప్పించండి. ఒక్కసారి మీతో నటించాలని ఉంది అని రిక్వెస్ట్ చేస్తే... తప్పుకుండా.. దివి, నువ్వు, నేను కలిసి ఓ సినిమా చేద్దాం అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది. దాంతో దివి కూడా హ్యాపీగా ఫీలయ్యారు.

మామ నాగ్ దారిలోనే సమంత

మామ నాగ్ దారిలోనే సమంత

గతంలో హెస్ట్‌గా నాగ్ ఇలాంటి ఆఫర్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. గంగవ్వ రిక్వెస్ట్‌కు స్పందిస్తూ ఇంటిని కట్టిస్తానని అన్నాడు. అలాగే కుమార్ సాయి చెప్పే కథను వినడానికి అవకాశం ఇస్తాను అని చెప్పడం తెలిసిందే. మామ నాగ్ దారిలోనే సమంత కూడా ఇద్దరికి హామీ ఇవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X