అక్కినేని ఫ్యామిలీనే అలాంటిది.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Samantha Comments On Akkineni Family Goes Viral || Filmibeat Telugu

నాగార్జున తనయుడు నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని వారింట అడుగు పెట్టింది సమంత. పెళ్లి తర్వాత మరింత జోరు పెంచిన ఈ భామ.. అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తోంది. సందర్భం వచ్చినపుడు తనకు సంబందించిన విషయాలు, అక్కినేని ఫ్యామిలీకి సంబందించిన విషయాలను చెబుతూ వస్తోంది సామ్. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చిన సామ్ అక్కినేని ఫ్యామిలీపై ఆసక్తికర కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

 సమంత, నందిని రెడ్డిల పై సుమ పంచులు

సమంత, నందిని రెడ్డిల పై సుమ పంచులు

యాంకర్ సుమ మైకు పట్టిందంటే చాలు పంచులకు, మాటల తూటాలకు కొదవే ఉండదు. అది స్టేజ్ షో అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా సుమ తీరు ఒకేవిధంగా ఉంటుంది. ఈ కోవలోనే తాజాగా జరిగిన క్యాష్ ప్రోగ్రామ్‌ లో హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి, తేజలతో సరదా సరదా ఎంజాయ్ చేస్తూ వారి నుంచి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టింది సుమ.

పురుషుడికి ఎంత సమయంలో బోర్ కొడుతుంది?

పురుషుడికి ఎంత సమయంలో బోర్ కొడుతుంది?

ప్రోగ్రామ్‌లో భాగంగా.. తన వైఫ్ షాపింగ్ చేస్తే ఒక పురుషుడికి ఎంత సమయంలో బోర్ కొడుతుంది? అనే ప్రశ్న వేసింది సుమ. దీనిపై తేజ స్పందిస్తూ 6 నిమిషాలు అనగానే.. ఎస్ అంటూ ఎగిరి గంతేసింది సమంత. వెంటనే అందుకున్న సుమ నాగచైతన్య విషయంలో అలా జరిగిందా? అని అడగగా.. షాప్ లోకి ఎంట్రీ ఇస్తూనే నువ్ వెళ్లు, నేను బయట వెయిట్ చేస్తా అని నాగచైతన్య అంటాడని పేర్కొంది సామ్.

అక్కినేని ఫ్యామిలీనే అలాంటిది

అక్కినేని ఫ్యామిలీనే అలాంటిది

ఆ తర్వాత సుమ నుంచి మరో ఆసక్తికర ప్రశ్న సమంతకు ఎదురైంది. అక్కినేని అఖిల్, నాగ చైతన్యలను చూపిస్తూ ఈ ఇద్దరిలో మోస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు? అని సుమ అడిగింది. దీనిపై రియాక్ట్ అయిన సమంత.. ఫ్యామిలీనే అలాంటిది అని సిగ్గుపడుతూ చెప్పింది. దీంతో సుమ సహా అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ఆ తర్వాత మా ఆయన ఆల్రెడీ బుక్కయ్యాడు కాబట్టి అఖిల్ ఇప్పుడు అని సమాధానం చెప్పింది సమంత.

ఓ బేబీ సమంత

ఓ బేబీ సమంత

ప్రస్తుతం సమంత ఓ బేబీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత జోడీగా నాగశౌర్య నటించాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. గతంలో ఎన్నడూలేని విధంగా సమంత కూడా ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతోంది. జులై 5 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X