లవర్ బాయ్‌లకు షాకిచ్చిన సమంత: బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసి మరీ పరువు తీసేసింది.!

By Manoj Kumar P

మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే బిగ్ బాస్ షో తెలుగులోనే ఎక్కువ ఆదరణను అందుకుంటోంది. ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డులే దీనికి ప్రత్యేక ఉదాహరణ. ఈ కారణంగానే మన దగ్గర ఈ రియాలిటీ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, నాలుగో దాన్ని సైతం మొదలెట్టింది. ఈ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షో నుంచి నాగార్జున తప్పుకోవడం.. ఆయన స్థానంలో సమంత ఎంటర్ అవడం జరిగాయి. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్ల పరువు తీసేసిందామె. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్లు.? వివరాల్లోకెళ్లే..

 కీలక సమయంలో నాగార్జున దూరం

కీలక సమయంలో నాగార్జున దూరం

మొదట్లో కొంచెం నెమ్మదించినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది బిగ్ బాస్ సీజన్ 4. సరికొత్త టాస్కులు, ప్రేమ కహానీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఇలా ఆసక్తికరమైన అంశాలతో ఈ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ రియాలిటీ షో నుంచి హోస్ట్ అక్కినేని నాగార్జున తప్పుకున్నారు.

డేంజర్ ప్లేస్‌ నుంచి వీడియో సందేశం

డేంజర్ ప్లేస్‌ నుంచి వీడియో సందేశం

ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. సోలోమన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కాప్‌గా కనిపించనున్న ఆయన.. ఈ మూవీ కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లారు. ఎంతో ప్రమాదకరమైన ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

 నాగార్జున స్థానంలో కోడలు ప్రవేశం

నాగార్జున స్థానంలో కోడలు ప్రవేశం

బిగ్ బాస్ షోకు నాగార్జున దూరం అవుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ తన సినిమా షూటింగ్ కోసం 21 రోజులు సమయాన్ని కేటాయించినట్లు చెప్పారు. దీంతో ఆయన స్థానంలో ఎవరు హోస్ట్ చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో నాగార్జున అందుబాటులో లేని ఎపిసోడ్స్‌ను అక్కినేని సమంత నడిపిస్తారని స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది.

ఎంజాయ్ మామూలుగా ఉండదట

ఎంజాయ్ మామూలుగా ఉండదట

ఇప్పటికే విడుదలైన ప్రోమోలో.. ఎంత సక్కగున్నవే పాటతో బిగ్ బాస్‌లోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. వచ్చీ రాగానే తన మామను ఇమిటేట్ చేస్తూ ‘అందరికీ నమస్కారం.. ఆదాబ్.. నేను మీ నాగార్జున' అని చెప్పింది. ఆ వెంటనే లైవ్‌‌లో ఉన్న నాగ్ అందుకోవడంతో ‘నాగార్జున కోడలిని' అని సవరించుకుంది. ఆ తర్వాత ‘నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు' అని సామ్ చెప్పింది.

లవర్ బాయ్‌లకు షాకిచ్చిన సమంత

లవర్ బాయ్‌లకు షాకిచ్చిన సమంత

స్టేజ్ మీద నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ల ముందుకు వచ్చింది సమంత. ఆ సమయంలో హౌస్‌మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, సమంత సమంత అంటూ కేకలు వేశారు. అదే సమయంలో కంటెస్టెంట్లు అందరూ ఆమె గురించి తలో మాట చెప్పుకొచ్చారు. వీటికి సామ్ కూడా కౌంటర్లు వేసింది. సరిగ్గా అప్పుడే లవర్ బాయ్‌లకు షాకిచ్చింది సమంత.

 లీక్ చేసి మరీ పరువు తీసేసింది.!

లీక్ చేసి మరీ పరువు తీసేసింది.!

బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్, అభిజీత్, అవినాష్ ట్రాకులు నడుపుతున్న విషయం తెలిసిందే. వాటిని ప్రస్తావిస్తూ ‘అఖిల్ నీ డ్రెస్ బాగుంది.. గుజరాతీ స్టైలా' అంటూ మోనాల్ ట్రాకుపై పంచ్ వేసింది. అలాగే, అభిజీత్ సమంతను పొగుడుతుండగా ‘నీకు ఎంత మంది కావాలయ్యా' అంటూ సెటైర్ వేసింది. ఇక, అవినాష్‌ను మాత్రం సోఫా అంటూ ఆటపట్టిస్తూ ఆకట్టుకుందీ స్టార్ హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X