బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు సమంత వార్నింగ్: తన ఫ్యాన్స్ అతడికి ఓట్లు వేయరని షాకిచ్చింది.!

By Manoj Kumar P

మిగిలిన అన్ని భాషలతో పోలిస్తే బిగ్ బాస్ షో తెలుగులోనే ఎక్కువ ఆదరణను అందుకుంటోంది. ఇప్పటి వరకు క్రియేట్ అయిన రికార్డులే దీనికి ప్రత్యేక ఉదాహరణ. ఈ కారణంగానే మన దగ్గర ఈ రియాలిటీ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని, నాలుగో దాన్ని సైతం మొదలెట్టింది. ఈ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షో నుంచి నాగార్జున తప్పుకోవడం.. ఆయన స్థానంలో సమంత ఎంటర్ అవడం జరిగాయి. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌‌కు చెమటలు పట్టించింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.? వివరాల్లోకి వెళ్తే...

కీలక సమయంలో నాగార్జున దూరం

కీలక సమయంలో నాగార్జున దూరం

మొదట్లో కొంచెం నెమ్మదించినప్పటికీ.. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది బిగ్ బాస్ సీజన్ 4. సరికొత్త టాస్కులు, ప్రేమ కహానీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు ఇలా ఆసక్తికరమైన అంశాలతో ఈ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ రియాలిటీ షో నుంచి హోస్ట్ అక్కినేని నాగార్జున తప్పుకున్నారు.

డేంజర్ ప్లేస్‌ నుంచి వీడియో సందేశం

డేంజర్ ప్లేస్‌ నుంచి వీడియో సందేశం

ప్రస్తుతం అక్కినేని నాగార్జున.. సోలోమన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కాప్‌గా కనిపించనున్న ఆయన.. ఈ మూవీ కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లారు. ఎంతో ప్రమాదకరమైన ప్రదేశంలో షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

నాగార్జున స్థానంలో కోడలు ప్రవేశం

నాగార్జున స్థానంలో కోడలు ప్రవేశం

బిగ్ బాస్ షోకు నాగార్జున దూరం అవుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ తన సినిమా షూటింగ్ కోసం 21 రోజులు సమయాన్ని కేటాయించినట్లు చెప్పారు. దీంతో ఆయన స్థానంలో ఎవరు హోస్ట్ చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో నాగార్జున అందుబాటులో లేని ఎపిసోడ్స్‌ను అక్కినేని సమంత నడిపిస్తారని స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది.

ఎంజాయ్ మామూలుగా ఉండదట

ఎంజాయ్ మామూలుగా ఉండదట

ఇప్పటికే విడుదలైన ప్రోమోలో.. ఎంత సక్కగున్నవే పాటతో బిగ్ బాస్‌లోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. వచ్చీ రాగానే తన మామను ఇమిటేట్ చేస్తూ ‘అందరికీ నమస్కారం.. ఆదాబ్.. నేను మీ నాగార్జున' అని చెప్పింది. ఆ వెంటనే లైవ్‌‌లో ఉన్న నాగ్ అందుకోవడంతో ‘నాగార్జున కోడలిని' అని సవరించుకుంది. ఆ తర్వాత ‘నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు' అని సామ్ చెప్పింది.

ఆ కంటెస్టెంట్‌కు సమంత వార్నింగ్

ఆ కంటెస్టెంట్‌కు సమంత వార్నింగ్

స్టేజ్ మీద నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ల ముందుకు వచ్చింది సమంత. ఆ సమయంలో హౌస్‌మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు, సమంత సమంత అంటూ కేకలు వేశారు. అదే సమయంలో కంటెస్టెంట్లు అందరూ ఆమె గురించి తలో మాట చెప్పుకొచ్చారు. వీటికి సామ్ కూడా కౌంటర్లు వేసింది. సరిగ్గా అప్పుడే ఓ కంటెస్టెంట్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

చెమటలు పట్టించిన కొత్త హోస్ట్.!

చెమటలు పట్టించిన కొత్త హోస్ట్.!

‘ఇప్పుడు టైమ్ ఉందిగా ఆలోచించడానికి' అని సమంత అనగానే... ‘నా దగ్గర వాచ్ లేదు మేడం' అంటూ అవినాష్ పంచ్ పేల్చాడు. దీంతో షాకైన స్టార్ హీరోయిన్.. ‘నా మీదే పంచులు వేస్తావా.? నా సంగతి నీకు తెలీదు. నా ఫ్యాన్స్ ఎవరూ అవినాష్‌కు ఓట్లు వేయొద్దు' అని అంది. దీంతో వెంటనే తేరుకున్న జబర్ధస్త్ కమెడియన్ ‘నేను కూడా మీ ఫ్యానే. జై సమంత' అని కవర్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X