నాగార్జున కోసం సమంత భారీ సాహసం: బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ.!

By Manoj

తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో స్పందనను అందుకుంటూ.. సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. ఇక్కడ మాత్రమే రికార్డు స్థాయిలో రేటింగ్‌ను సాధిస్తూ సత్తా చాటుతోందీ బిగ్గెస్ట్ రియాలిటీ షో. అందుకే మన దగ్గర మాత్రమే షో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న నాలుగో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హోస్ట్ అక్కినేని నాగార్జున కోసం సమంత చేసిన సాహసం గురించి ఓ న్యూస్ లీకైంది. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాకవుతోంది. వివరాల్లోకి వెళ్తే....

అక్కడ హిట్.. ఇక్కడ బంపర్ హిట్

అక్కడ హిట్.. ఇక్కడ బంపర్ హిట్

హీరోగా సూపర్ సక్సెస్ అవడంతో పాటు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నారు అక్కినేని నాగార్జున. సుదీర్ఘమైన తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలను పోషించిన ఆయన.. బుల్లితెరపైనా సత్తా చాటుతున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్‌'తో దాన్ని కొనసాగిస్తూ సక్సెస్ అవుతున్నారు.

ఎన్టీఆర్, నానిని మించిన హోస్టింగ్

ఎన్టీఆర్, నానిని మించిన హోస్టింగ్

తెలుగులో బిగ్ బాస్ షోను ఇప్పటి వరకు ముగ్గురు హీరోలు హోస్ట్ చేశారు. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్‌తో పాటు నాలుగో దాన్ని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. మొదటి ఇద్దరు హీరోల వల్ల షో ఎంత సక్సెస్ అయిందో.. నాగ్ హోస్టింగ్‌తో అంతకు మించిన రెస్పాన్స్ దక్కుతోంది. అదే సమయంలో రికార్డులు బద్దలువుతున్నాయి.

బిగ్ బాస్ షోకు నాగార్జున దూరం

బిగ్ బాస్ షోకు నాగార్జున దూరం

అద్భుతమైన హోస్టింగ్‌తో బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన షోకు దూరం అయ్యారు. తన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ప్రస్తుతం హిమాలయాలకు వెళ్లిన ఆయన.. అక్కడ కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. నాగ్ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మామ స్థానంలో కోడలు వచ్చింది

మామ స్థానంలో కోడలు వచ్చింది

నాగార్జున దూరమవడంతో ఆయన స్థానంలో గత వారం బిగ్ బాస్ షోను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత హోస్ట్ చేసింది. దసరా స్పెషల్‌గా రూపొందిన ఎపిసోడ్‌ను ఆమె సక్సెస్‌ఫుల్‌గా నడిపించింది. కంటెస్టెంట్లతో కలిసిపోవడమే కాకుండా.. వాళ్ల సీక్రెట్లు లీక్ చేస్తూ సందడి చేసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ ఎపిసోడ్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

నాగార్జున కోసం సమంత సాహసం

నాగార్జున కోసం సమంత సాహసం

హోస్టింగ్ విషయంలో అక్కినేని కోడలు సమంత ఎలా చేస్తుందో అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అనుమానాలు పటాపంచలు చేసిందామె. షో ప్రారంభానికి ముందే తనకు తెలుగు రాదని, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని ప్రేక్షకులను కోరిన ఆమె.. ఆ తర్వాత ఎంతో చక్కగా మాట్లాడింది. ఈ షో కోసం సమంత పెద్ద సాహసమే చేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

మూడు గంటల పాటు ప్రసారం అయిన దసరా స్పెషల్ ఎపిసోడ్ గురించి ఓ న్యూస్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్ షూటింగ్ దాదాపు పన్నెండు గంటల పాటు సాగిందట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత సమయం షూటింగ్ జరుపుకున్న ఎపిసోడ్ ఇదేనని ఇన్‌సైడ్ టాక్. మామ కోసం సమంత ఇంత పెద్ద సాహసం చేయడంతో ఇండస్ట్రీ షాకవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X