విడాకుల తరువాత మొట్టమొదటి సారిగా అలా కనిపించనున్న సమంతా.. ఎన్టీఆర్ కోసం రిస్క్ చేసి!
నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అలాగే త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా కూడా కనిపించబోతున్నాడు.. అయితే సమంత మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి కార్యక్రమంలో నేరుగా కనిపించలేదు.. అయితే ఆమె తాజాగా ఎన్టీఆర్ షోలో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త పేరు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక షో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మొదటి ఎపిసోడ్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆ తర్వాత రాజమౌళి, కొరటాల శివ లాంటి సెలబ్రిటీలతో అడపాదడపా కొన్ని సెలబ్రిటీ ఎపిసోడ్స్ చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన ఎపిసోడ్ దసరాకు టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్ తో కూడా వీటిని సంప్రదింపులు జరిపింది అని చెబుతూ ఉండగా తాజాగా ఈ లిస్టులో సమంత వచ్చి చేరింది.

సమంత సెలబ్రిటీ గెస్ట్ గా
ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సమంత తరువాతి సెలబ్రిటీ గెస్ట్ గా కనిపించబోతోంది అని తెలుస్తోంది. ఈ రోజు ఆమె ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రానురాను షోకి రేటింగ్స్ పడిపోతున్న కారణంగా వీలైనంత ఎక్కువ మంది సెలబ్రిటీలను ఈ షోలో పాల్గొనేలా చేస్తున్నారని తెలుస్తోంది. చివరిగా వచ్చిన రేటింగ్స్ ప్రకారం చూస్తే షో రేటింగ్స్ అంతకంతకూ తగ్గిపోవడం కనిపిస్తోంది.

ఏకంగా కోటి గెలిచి
ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా షూటింగ్ జరుపుకున్న ఒక ఎపిసోడ్ కి సంబంధించి ఒక కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్నకి సమాధానం కరెక్టుగా చెప్పారు అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ ని భారీ రేంజ్ లో టెలికాస్ట్ చేయడానికి కూడా మీలో ఎవరు కోటీశ్వరులు నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ రెండ్జ్
ఇక ఈ సీజన్లో కోటి రూపాయల ప్రశ్న వరకు రావడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. అలాంటిది కోటి రూపాయల ప్రశ్న కూడా కరెక్టుగా సమాధానం చెప్పి సదరు వ్యక్తి కోటి గెలుచుకోవడం అనేది ఇప్పుడు మామూలు విషయం కాదు. అందుకే ఈ ఎపిసోడ్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రేటింగ్స్ పడిపోతూ ఉండడంతో
ఇక ఈ షో 5వ వారంలో అర్బన్ ప్రాంతంలో 4.70 రేటింగ్‌ను సొంతం చేసుకొంటే.. 6వ వారంలో 4.00 రేటింగ్‌ను సాధించింది. అలాగే రూరల్ విషయానికి వస్తే.. 5వ వారం 2.71 రేటింగ్‌తో సరిపెట్టుకొంటే.. 6వ వారంలో అంతకంటే తక్కువగా 2.42 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ దెబ్బతో ప్రమోషన్స్ ను పెంచే ఉద్దేశంతోనే సెలబ్రిటీ స్పెషల్స్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











