Bigg Boss 7 Telugu: నాగార్జునకు సమంత షాక్.. బిగ్ బాస్ సాక్షిగా బయటపడ్డ సంచలన నిజం
తెలుగు బుల్లితెరపై చాలా రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతుంటాయి. కానీ, వాటిలో తక్కువ షోలకు మాత్రమే ప్రజాధరణ దక్కుతుంది. అందులో ప్రేక్షకుల నుంచి ఎక్కువ మన్ననలు అందుకున్న ప్రోగ్రామ్‌లు మాత్రం చాలా తక్కువే ఉన్నాయి. అందులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో వస్తున్నప్పటికీ ఇది తెలుగు వారి మనసులు దోచుకుంది. దీంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు ఏదో దానికై సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత.. హోస్ట్ నాగార్జునకు షాకిచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే...
జాతీయ స్థాయిలో తెలుగు షో:17 ఏళ్ల క్రితమే బిగ్ బాస్ హిందీలో ప్రారంభం అయింది. అక్కడ సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత దేశంలోని మరికొన్ని భాషల్లోకి పరిచయం అయింది. అలా కొన్నేళ్ల క్రితమే ఇది తెలుగులోకి వచ్చింది. ఈ షోకు మన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సంపాదించి జాతీయ స్థాయిలో టాప్ షోగా రికార్డు సాధించింది.

ఏడో సీజన్ అప్పటి నుంచే: తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రసారం చేయబోతున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. అదే సమయంలో పలు రకాల ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే, ఈ సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
పనులన్నీ కంప్లీట్ చేశారు: ఏడో సీజన్‌కు సంబంధించిన పనులను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్.. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అలాగే, సెట్‌ను మరింత సుందరంగా తీర్చి దిద్దారు. గతంలో కంటే ఇప్పుడు ఎన్నో హంగులు జత చేశారు. ఈరోజు నుంచే షూట్లను కూడా ప్రారంభించబోతున్నారు.

సీక్రెట్‌గా ఉంచినా లీకులే: బిగ్ బాస్‌కు సంబంధించిన అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు నిర్వహకులు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపిక గురించి పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. ఈ షోకు ఎంపికైన వాళ్లు కూడా ఎలాంటి వివరాలను తెలపకూడదని ఒప్పందం చేసుకుంటున్నారు. కానీ, మొదటి సీజన్ నుంచే అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో పేర్లు బయటకు వచ్చాయి.
ప్రీమియర్స్‌పై ఫుల్ ఫోకస్: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. దీని కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రీమియర్ ఎపిసోడ్‌ను హై రేంజ్‌లో ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఈరోజు లేదా రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
సమంతతో పాటు వాళ్లంతా: బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను షో వైపు చూసేలా చేయాలని నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎపిసోడ్‌కు 'ఖుషి' ప్రమోషన్స్ కోసం సమంత, విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో చాలా మంది హీరోయిన్లు స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లు ఇవ్వబోతున్నారు. కొందరు గెస్టులూ రాబోతున్నారు.

షాకిచ్చిన సమంత.. రీజన్: ప్రీమియర్ ఎపిసోడ్‌కు సమంత వస్తుందన్న వార్త లీక్ అవడంతో నాగ చైతన్యతో విడాకుల తర్వాత నాగార్జునను ఆమె తొలిసారి కలవబోతుందని అంతా అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. సామ్ ఈ ఎపిసోడ్‌కు రానని తేల్చి చెప్పేసిందట. వ్యక్తిగత కారణాలతో షోకు ఆమె రాలేనని స్పష్టం చేసిందట. దీంతో నాగ్‌ను కలవడం ఇష్టం లేకనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











