For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha in NTR's EMK show: సమంత ఎంత గెలుచుకొన్నారో తెలుసా? ఆమె చెప్పిన సమాధానాలు ఇవే..

  |

  యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో ప్రముఖులు రావడం తెలిసిందే. ప్రారంభ ఎపిసోడ్‌లో రాంచరణ్ అతిథిగా రాగా, ఆ తర్వాత రాజమౌళి, కొరటాల శివ హాట్ సీట్‌పైకి వచ్చారు. ఇక దసరా పండుగను పురస్కరించుకొని సమంత రుత్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి చలాకీగా, సరదా, ఉత్సాహంగా సమంత ఆడుతూ కనిపించారు. చాలా సార్లు ఎన్టీఆర్ ఆమెను ఉడికించి.. చిలిపిగా ఏడిపించి ఆడేసుకొన్నారు. ఈ షోలో సమంత ఎంత గెలుచుకొన్నారు? ఆమె ముందుకు వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..

  1000 రూపాయల ప్రశ్న కోసం

  1000 రూపాయల ప్రశ్న కోసం

  ఏ ప్రదేశంలో, జనం స్కాట్స్, బర్ఫీస్ మరియు జంపింగ్ జాక్స్ చేయడం చూస్తాము?
  a) ఫార్మసీ
  b) రెస్టారెంట్
  c) థియేటర్
  d) వ్యాయామశాల

  Answer: వ్యాయామశాల

  2000 రూపాయల ప్రశ్న కోసం

  2000 రూపాయల ప్రశ్న కోసం

  ఈ చిత్రంలోని కుక్క ఏ జాతికి సంబంధించినదో గుర్తించండి?
  a) డాల్మేషియస్
  b) హస్కీ
  c) అల్ఫేషియన్
  d) లబ్రాడార్

  Answer: అల్షేషియన్

  3000 రూపాయల ప్రశ్న కోసం

  3000 రూపాయల ప్రశ్న కోసం

  హిందూ పురాణంలో, శకుంత మరియు దుశ్యంతుడి కుమారుడు ఎవరు?
  a) రఘు
  b) దశరథుడు
  c) భరతుడు
  d) నళ

  పై ప్రశ్న స్క్రీన్ మీదకు రాగానే నవ్వింది. అయితే సమంత నవ్వును చూసి.. ఈ ప్రశ్నను తీసేయమని చెబుతా అని ఏడిపించారు. ఎందుకంటే.. సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం కావడమే. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం చిత్రంలో సమంత నటించిన విషయం తెలిసిందే.

  Answer: భరతుడు

  5000 రూపాయల ప్రశ్న కోసం

  5000 రూపాయల ప్రశ్న కోసం

  5000 రూపాయల ప్రశ్న కోసం
  ఈ పాట ఏ చిత్రంలోనిదో గుర్తించండి
  a) బంగారం
  b) డార్లింగ్
  c) లవ్లీ
  d) ఇష్క్

  Answer: డార్లింగ్

   10000 రూపాయల ప్రశ్న కోసం

  10000 రూపాయల ప్రశ్న కోసం

  ఈ చిత్రంలోని కట్టడం ఏ ప్రదేశంలో ఉంది
  a) మైసూరు
  b) హంపీ
  c) బహోళి
  d) బేలూరు

  Answer: హంపీ

  20000 రూపాయల ప్రశ్న కోసం

  20000 రూపాయల ప్రశ్న కోసం

  2015లో ప్రారంభించబడిన ఈ ప్రభుత్వ కార్యక్రమం యొక్క శీర్షికను పూర్తి చేయండి: భేటీ బచావో, బేటీ ...
  a) బులావో
  b) సిఖావో
  c) ఖిలావో
  d) పడావో

  Answer: పడావో

  40000 రూపాయల ప్రశ్న కోసం

  40000 రూపాయల ప్రశ్న కోసం

  వీటిలో మట్టిన ఉపయోగించకుండా మొక్కలను పెంచే విధానం ఏది?
  a) హైడ్రోపోనిక్స్
  b) ఆంత్రోపోనిక్స్
  c) హీలియోపోనిక్స్
  d) కైనెటోపోనిక్స్

  పై ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు.. లాక్‌డౌన్‌లో అర్బన్ కిసాన్ కార్యక్రమాన్ని చేపట్టాను అని సమంత చెప్పారు. తక్కువ నీళ్లు ఉపయోగించి కూరగాయలు, ఆకు కూరలు పండించాను అని చెప్పారు.

  Answer: హైడ్రోపోనిక్స్

  80000 రూపాయల ప్రశ్న కోసం

  80000 రూపాయల ప్రశ్న కోసం

  పీవీ సింధు తన మొదటి ఒలంపిక్ పతకాన్ని ఏ సంవత్సరంలో గెలుచుకొన్నారు?
  a) 2012
  b) 2016
  c) 2021
  d) 2008

  Answer: 2016

  160000 రూపాయల ప్రశ్న కోసం

  160000 రూపాయల ప్రశ్న కోసం

  160000 రూపాయల ప్రశ్న కోసం
  చాంప్స్ ఎలీసే మార్గంలో నడిచి, ఏ నగరంలో ఆర్క్ డి ట్రియోంఫ్‌ని చూడవచ్చు?
  a) బెర్లిన్
  b) మాస్కో
  c) పారిస్
  d) రోమ్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో సమంత తొలి లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకోగా, స్క్రీన్ పై మాస్కో, పారిస్ అనే సమాధానాలు మిగిలాయి. దాంతో పారిస్ అని సమాధానం చెప్పి 160000 గెలుచుకొన్నారు.

  Answer: పారిస్

   320000 రూపాయల ప్రశ్న కోసం

  320000 రూపాయల ప్రశ్న కోసం

  పద్మావత్ సినిమా ఏ ప్రదేశపు రాణి ఆధారంగా రూపొందించబడినది?
  a) మీరట్
  b) చిత్తోర్
  c) ఝాన్సీ
  d) ఉదయ్ పూర్

  Answer: చిత్తోర్

  640000 రూపాయల ప్రశ్న కోసం

  640000 రూపాయల ప్రశ్న కోసం

  వీటిలో, ఏ ఫాబ్రిక్‌కి దానికున్న గుణం బట్టి ఆ పేరు వచ్చింది.
  a) రెయాన్
  b) నైలాన్
  c) కాటన్
  d) స్పాండెక్స్

  Answer: స్పాండెక్స్

   1250000 రూపాయల ప్రశ్న కోసం

  1250000 రూపాయల ప్రశ్న కోసం

  ఒక మహిళ పేరు పెట్టబడి ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ నగరాల్లో ఎక్కడ ఉన్నది

  a) ఇండోర్
  b) కొచ్చి
  c) చెన్నై
  d) విజయవాడ

  పై ప్రశ్నకు సమాధానం లభించకపోవడంతో రెండో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడం ఎక్కువ మంది ఇండోర్ అని సమాధానం చెప్పడంతో అదే జవాబును చెప్పి 1250000 గెలుచుకొన్నారు.

  Answer: ఇండోర్

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
   2500000 రూపాయల ప్రశ్న కోసం

  2500000 రూపాయల ప్రశ్న కోసం

  సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశి థరూర్ పుస్తకం యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్, వీటిలో దేని గురించి రాయబడింది?
  a) ఇండో చైనా యుద్ధం
  b) బ్రిటీషు పరిపాలన
  c) కార్గిల్ యుద్ధం
  d) అత్యవసర పరిస్థితి

  Answer: బ్రిటీషు పరిపాలన

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show October 14th Episode: Samantha Ruth Prabhu in NTR's Evaru Meelo Koteeswarulu Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X