తెలుగు హీరో లకు సమంత రేటింగ్ లు, ట్యాగ్ లైన్స్

By Srikanya

హైదరాబాద్ : సమంత..పేరు చెప్తే చాలా కళ్ళముందు మెదిలే అంతలా తెలుగు వాకిట్లోకి చొచ్చుకుపోయిందామె. ప్రతీ విషయంలోనూ నిక్కిచ్చిగా మాట్లాడే ఆమె తనతో పనిచేసిన హీరోలుకు సైతం రీసెంట్ గా రేటింగ్ ఇచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ టెలీకాస్ట్ అయిన జీ టీవి పోగ్రాంలో ఆమె తన తో చేసిన హీరోలు గురించి మాట్లాడింది. పనిలో పనిగా వారికి ట్యాగ్ లైన్స్ ఇచ్చింది. రేటింగ్ లు ఇచ్చింది. అయితే అదంతా ఫన్ గానే సాగింది. కానీ రాపిడ్ స్పీడ్ తో సాగిన ఆ రౌండ్ లో మాత్రం ఆమె మనస్సులో మాటలు బయిటకు వచ్చాయనేది నిజం.

తన పేరు గురించి చెప్తూ..సమంత అంటే అర్దం దేముడు విన్నారు అని చెప్పింది. అలాగే కెమెరా, హెయిర్ స్టెయిల్, మేకప్ వంటి వాటితో అందంగా ఉన్నానని, అందరూ అందంగా ఉంటారనే చెప్పింది. తను ఆంధ్రప్రదేశ్ కు ఓ కూతురు లాంటిదాన్నని చెప్పింది.

ప్రస్తుతర ఆమె అల్లు అర్జున్‌తో కలసి ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

ఇంకేం చెప్పింది..హీరోలు గురించి ఏం మాట్లాడింది అనేది స్లైడ్ షోలో...

స్కూల్లో ,కాలేజీలో

స్కూల్లో ,కాలేజీలో

తను స్కూల్లో, కాలేజీలో చాలా అల్లరి చేసేదాన్ని, బాగా చదివేదాన్ని అంది. ఎకనామిక్స్ టాపర్ ని అని అంది. తనను అందరూ ర్యాగింగ్ చేసారని అంది. అలాగే ర్యాంగింగ్ చేయవద్దని తన ప్రెండ్స్ కి చెప్పానని అంది.

నాకు లైనేసాడు

నాకు లైనేసాడు

టీ నగర్ వెళ్లటానికి రెండు బస్ లు మారాలి. రెండు సంవత్సరాలు పాటు ఒక అబ్బాయి బస్ స్టాండ్ లలో వెయిట్ చేసాడు. అసలు చాలా పొడుగ్గా ఉండేవాడు. స్కూల్ దాకా వచ్చేవాడు. నాతో మాట్లాడేవాడు. బాగానే ఉండేవాడు. సన్నగా ఉండేవాడు. తర్వాత నేను వెళ్లి ఎందుకు ఇలా వెంటబడుతున్నారు అని అడిగితే అలాంటిదేమీ లేదు..నీ వెనక ఎవరు పడుతున్నారు అన్నాడు అని చెప్పింది.

పాలలో స్లీపింగ్ పిల్ వేసా

పాలలో స్లీపింగ్ పిల్ వేసా

లెవెన్త్ స్టాండర్డ్ అప్పుడు జరిగింది. మా ప్రెండ్స్ మి కలిసి ఓ పార్టీకి వెళ్లాలనుకున్నాం. ఓ రోజు డిసైడ్ అయ్యారు. క్లబ్ కి వెళ్లి డాన్స్ చూడాలి..ఎలా ఉంటుందో చూడాలి అని అనుకున్నాం. అందరూ ఇళ్లు వదిలేసాం. అయితే శరణ్యా వాళ్ల అమ్మమ్మకి మాకు కాపాలగా పెట్టారు. మేం రెడి అయ్యారు. మేం డ్రస్ వేసుకుని పైన నైట్ డ్రస్ వేసుకున్నాం. అప్పుడు ఆవిడ్ని తప్పించటానికి స్లీపింగ్ పిల్ వేసి, పాలలో వేసి, పట్టించాం అంటూ నవ్వుతూ చెప్పారామె.

స్కూల్ డేస్ లో ఆ హీరోకే ఫ్యాన్

స్కూల్ డేస్ లో ఆ హీరోకే ఫ్యాన్

నేను హీరో సూర్య కి పెద్ద ఫ్యాన్ ని. నేను ఫస్ట్ తమిళ సినిమా సూర్య ది చూసాను. అప్పుడే గ్రేట్ ఫ్యాన్ ని అయ్యాను. అలాగే కాలేజికి మాకు గెస్ట్ గా వచ్చారు. సూర్య కాలేజికి వచ్చారని తెలియగానే నేను చాలా ఆనందడ్డానని అని చెప్పారు. తర్వాత ఆయనతో సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంటాను.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

కాలేజీలో అందరూ సమంతను సుస్మితా సేన్ అనిపిలిచేవారని అన్నారు. అయితే వాళ్లకు అసలు కళ్లు లేవని ఆమె నవ్వి అన్నారు.

తమన్నా , త్రిష నుంచి...

తమన్నా , త్రిష నుంచి...

తను తమన్నా నుంచి ఫెయిర్, క్వయిట్ ని పిక్ చేసుకుంటానన్నారు. అలాగే ..త్రిష నుంచి ఎబిలిటీ టు ఎంజాయ్ ని పిక్ చేస్తానని చెప్పారు.

 కాజల్, అనుష్క

కాజల్, అనుష్క

కాజల్ నుంచి హైట్, అనుష్క నుంచి కళ్ళు పిక్ చేసుకోవటానికి ఇష్టపడతానని చెప్పారామె.

వరస్ట్ క్రిటిసిజం

వరస్ట్ క్రిటిసిజం

నా గురించి నేను విన్న వరస్ట్ క్రిటిసిజం...తెలుగు క్రిటిక్స్ నుంచి నేను యాక్ట్రస్ గా ఫిట్ కానని అనే విమర్శ విన్నాను అన్నారు.

సూర్య,

సూర్య,

సూర్య కు ట్యాగ్ లైన్ పెడితే ...స్మార్ట్ అండ్ హాట్ అని పెడతానన్నారు.

 జూ.ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ కు ట్యాగ్ లైన్ పెడితే గ్రేట్ డాన్సర్ అని పెడతానని అన్నారామె.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కి ట్యాగ్ లైన్ పెడితే...ది గురువు గారు అని పెడతాను అన్నారామె.

 మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు కి ట్యాగ్ లైన్ గా మేస్ట్ డిజైర్ బుల్ అని పెడతానన్నారామె.

ఆమె నాకు కాంపిటేషన్ కాదు

ఆమె నాకు కాంపిటేషన్ కాదు

తమన్నా, కాజల్, శృతి హాసన్ లలో తనకు శృతి హాసన్ కాంపిటేషన్ కాదు అన్నారామె.

బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కెమెస్ట్రీ

బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కెమెస్ట్రీ

తనకు బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కెమెస్ట్రీ నాగ చైతన్యతో ఉంటుంది అన్నారామె.

పవన్ కే రేటింగ్ ఎక్కువ

పవన్ కే రేటింగ్ ఎక్కువ

డాన్సింగ్ టాలెంట్ ని బట్టి అవుటాఫ్ టెన్ లో తనతో పని చేసిన హీరోలకు ఆమె రెటింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు పది కి పది మార్కలు వేస్తానని అన్నారు.

మహేష్ బాబు కి...

మహేష్ బాబు కి...

మహేష్ బాబుకి 1 నేనొక్కిడినే తర్వాత 10కి తొమ్మిది వేస్తానని అన్నారు.

జూ. ఎన్టీఆర్, అల్లు అర్డున్, రామ్ చరణ్

జూ. ఎన్టీఆర్, అల్లు అర్డున్, రామ్ చరణ్

జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు కు సైతం ఆమె 10 కి తొమ్మిది మార్కులు వేస్తాను అని చెప్పారు.

అందం గురించి..

అందం గురించి..

''నాకంటే అందంగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. మీకో విషయం తెలుసా? చదువుకొంటున్నప్పుడు మా క్లాస్‌లో ఉన్న అమ్మాయిలతో పోలిస్తే నేను ఓ మాదిరిగానైనా ఉండేదాన్ని కాదు.నా సినీ ప్రయాణం విషయంలో అందం కంటే అదృష్టమే ఎక్కువ పనిచేసిందని నమ్ముతా. అది నిజం కూడా'' అని చెబుతుంటుంది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X