Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హోస్టుగా స్టార్ హీరోయిన్.. నాగార్జున తప్పుకోడానికి కారణం ఇదే!
ఉత్తరాదిలో ప్రారంభమై.. దక్షిణాదిలోని భాషల్లోనూ సత్తా చాటిన కార్యక్రమాల్లో 'బిగ్ బాస్' రియాలిటీ షో ఒకటి. పలు రంగాలకు చెందిన సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచడం.. అన్ని టాస్క్‌లను ముగించి ప్రేక్షకాదరణ పొందిన ఒకరిని విజేతగా ప్రకటించడం.. ఈ షో ఫార్మాట్. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ షోకు రెండు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం ఇందులో చూపించే కంటెంటే అని చెప్పొచ్చు. అలాగే, ఈ షో విజయంలో దీన్ని హోస్ట్ చేసిన హీరోల పాత్ర కూడా ఎంతో ఉంది. అందుకే ప్రతి సీజన్‌లో హోస్ట్ చాలా ప్రభావం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభమయ్యే ఆరో సీజన్ నుంచి నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

వాళ్లను సెలెబ్రిటీలుగా మార్చింది
తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు, దేశంలోనే మరే షోకూ రానంత రేటింగ్‌ను సంపాదించుకుని టాప్ ప్లేస్‌లో నిలిచింది. మరోవైపు, బిగ్ బాస్ షోలోకి ఇప్పటి వరకూ ఎంతో మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయి వరుస ఆఫర్లతో సందడి చేస్తున్నారు.

ఐదుగురు మగవాళ్లు... ఒక ఫీమేల్
బిగ్ బాస్ ఐదు సీజన్లలో విజేతలుగా నిలిచిన ఐదుగురూ మగవాళ్లే అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్‌లో శివ బాలాజీ, రెండో దానిలో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్, నాలుగో సీజన్‌లో అభిజీత్, ఐదో సీజన్‌లో వీజే సన్నీలు గెలుపొందారు. అయితే, తాజాగా ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో బిందు మాధవి గెలిచి సంచలనం సృష్టించింది.

వివాదాలున్నా... యమ దూకుడు
ఈ రియాలిటీ షోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి వివాదాలు, గొడవలు తదితర అంశాలు కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరగడంతో పాటు అమ్మాయిల గ్లామర్ టచ్.. రొమాంటిక్ సంఘటనలు వంటి వాటి వల్ల ఈ షోకు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో బయట తలెత్తిన వివాదాలూ బాగా ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

విజయంలో హీరోల పాత్ర కీలకం
తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికి ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌లో జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తమ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. తప్పు చేసిన కంటెస్టెంట్లను మందలించడం.. బాగా చేస్తే ప్రోత్సహించడం వంటివి చేసి షో విజయంలో కీలక పాత్రలను పోషించారు.

ఆరో సీజన్‌కు సన్నాహాలు కూడా
బిగ్ బాస్ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆరో సీజన్ వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలు కాబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సెట్ వర్క్‌ను కూడా ప్రారంభించారని అంటున్నారు. అంతేకాదు, ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైనట్లు బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆరో సీజన్ హోస్టుగా హీరోయిన్
మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు హోస్టుగా నాగార్జునే ఉంటారని అనుకున్నారు. ఇప్పటికే వచ్చిన కమింగ్ సూన్ ప్రోమోలోనూ ఆయనే కనిపించారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో నాగార్జునకు బదులుగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హోస్టుగా చేయబోతుందట. ఇప్పుడీ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.

నాగ్ తప్పుకోడానికి కారణం ఇదే
బిగ్ బాస్ ఆరో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున తప్పుకోడానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'ఘోస్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికితోడు మరికొన్ని ప్రాజెక్టులనూ చేయబోతున్నారు. వీటికి బిగ్ బాస్ డేట్స్‌కు క్లాష్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.


Click it and Unblock the Notifications











