సమంత గాజులు తీసిందంటే... శ్రీముఖి వార్నింగ్‌తో కమెడియన్ పరుగులు

బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రనటి సమంత నటించిన మూవీ మా ఇంటి బంగారం. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్‌లో నటిస్తోన్న సినిమా కావడంతో మా ఇంటి బంగారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు ఏ మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. రిలీజ్‌‌కు కొద్దిగంటల ముందు కూడా సమంత సహా చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు కలిసి నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు.

స్టార్‌లో మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో హోస్ట్ శ్రీముఖి ఆటాపాటా వినోదాన్ని పంచుతోంది. వారం వారం ప్రత్యేకమైన థీమ్‌తో ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ వారం మాత్రం మా ఇంటి బంగారం టీమ్ .. ఆదివారం విత్ స్టార్ పరివారం కార్యక్రమంలో సందడి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

Samantha s Fun Moments With Maa Inti Bangaram Team On Adivaram With Star Maa Parivaram

మా ఇంటి బంగారం సెలబ్రేషన్స్ పేరుతో విడుదలైన ఈ ప్రోమోలో తొలుత దర్శకురాలు నందినీ రెడ్డి, సీనియర్ నటి గౌతమి, కమెడియన్ శ్రీలక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు నేనింత పద్ధతిగా ఉన్నానంటే మా అత్తమ్మే కారణమంటూ గౌతమి కాళ్లు మొక్కింది శ్రీముఖి. ఆ వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ రచన వాలు జాడను చూసి అవినాష్ షాకయ్యాడు. సినిమాలో నా జడ కూడా అంతే ఉంటుంది.. కానీ ప్రమోషన్స్‌ టైంకి ఇంత అయ్యిందని చూపించింది శ్రీముఖి. ఇంతలో శ్రీముఖి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో మా పరివారానికి సమంత వచ్చిందంటూ శ్రీముఖి గోల గోల చేసింది.

ఇది మీ కింగ్డమ్ కదా అని సమంత అడగ్గా.. శ్రీముఖి ఔనని చెబుతుంది. దానికి బాబోయ్ అంటూ సామ్ రిప్లయ్ ఇచ్చింది. అవినాష్‌ని పిలిచిన శ్రీముఖి.. సమంత గారు నేను బాగా క్లోజ్ అన్నావు కదా? అంత దూరంగా నిలబడ్డావేంటీ అని శ్రీముఖి అడగ్గా అవినాష్ కంగారుపడ్డాడు. సమంత రాగానే మనోడి బుర్రపోయిందని ఎక్స్‌ప్రెస్ హరి పంచ్ విసురుతాడు. ఆ అబ్బాయి షోకి వచ్చిన ప్రతి అమ్మాయిని పట్టుకుని ఏంటి మరి అని అడుగుతాడని అవినాష్‌ మీద కంప్లైంట్ చేసింది శ్రీముఖి. దాంతో ప్రామీస్ నేను అడుగుతానా అని కంగారుపడ్డాడు అవినాష్. ఇంతలో సమంత గాజులు తీస్తుండటం చూసిన శ్రీముఖి.. గట్టిగా అరవడంతో అవినాష్ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు.

ఆ వెంటనే స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ షోకి హోస్ట్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇంగ్లీష్ అమ్మాయిలు పాట పాడి వినిపించే సౌండ్‌ని బట్టి అది ఏ సాంగో చెప్పాల్సిన స్కిట్‌లో సమంత నవ్వులు పూయించింది. అనంతరం బుల్లితెర సెలబ్రిటీలు తేజస్వినీ గౌడ, ప్రియాంక జైన్, శ్రీసత్యలు సమంత సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి అలరించారు. అవన్నీ చూసి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి సమంత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా .. సమంతతో మా ఇంటి బంగారం యూనిట్ చేసిన అల్లరి చూడాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X